>>> కవులలో అతడు కిలిమంజారో కాంతామణి కనిపిస్తే మాత్రం వెకిలిమంజారో
>>> జనాలు రెండు రకాలు ‘వినదగునెవ్వరుచెప్పిన’ అనేవాళ్లు, ‘వినదగు never, చెప్పిన’అనేవాళ్లు.
>>> మా ఇంటి ఓనర్ అఖిలాండ్రేశ్వరి, అందరిని ఉతికారేస్తుంది.
>>> రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు
>>> breakfast కి ఓ ఉత్తరాది మిత్రుడి హిందీ అనువాదం భూకావట్.
>>> Technologistకి తెలుగు పదం సాంకేతిగాడు.
>>> అవధానాల్లో ప్రసంగాలు రెండే రకాలు ౧. అప్రస్తుత ప్రసంగాలు ౨. స్తుత ప్రసంగాలు
>>> పాపులేషన్ లో మూడొంతులు పాపులే.
^^^
11 స్పందనలు so far ↓
వీవెన్ // ఆగష్టు 31, 2007 వద్ద 3:35 పూర్వాహ్నం |
చదువరి // ఆగష్టు 31, 2007 వద్ద 5:14 పూర్వాహ్నం |
అయ్యా, అదరగొట్టారండీ. ఉత్తమమైనవి ఈ వరసలో! మిగతావి ఉత్తవని నాఉద్దేశ్యం కాదు సుమండీ!
రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు
పాపులేషన్ లో మూడొంతులు పాపులే.
అవధానాల్లో ప్రసంగాలు రెండే రకాలు ౧. అప్రస్తుత ప్రసంగాలు ౨. స్తుత ప్రసంగాలు
మీ పాత జాబులూ ఎంతో బాగున్నాయి. “మిస్స్ కారేజా”, “ఓటవర్లు” (ఓటు వరులు) బాగా నచ్చాయి
మీ పేరేంటో రాయలేదు.. శ్లేషావతారమా? పన్డరి నాథా? పేరేదైనా మీరు పన్డితులే!
ఇలాగే పన్నులు రాలుస్తారని / పన్డిస్తారని ఆశిస్తూ!!
రానారె // ఆగష్టు 31, 2007 వద్ద 5:55 పూర్వాహ్నం |
Technologist సాం’కేతిగాడై’తే, Platinum బంగారక్క కాకపోతుందా? డిగ్రీ రోజుల్లో ఇలాగే పాండిత్యం ప్రదర్శిద్దామని, పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్న ఒక సందర్భంలో, “సంసారంలో ఒడి-దుడుకులు తప్పవు, కొత్త సంసారంలో మరీనూ” అని, అక్షింతలు వేయించుకున్నాను.
కొత్తపాళీ // ఆగష్టు 31, 2007 వద్ద 10:10 పూర్వాహ్నం |
చాలా బావున్నై.
తెలుగుఅభిమాని // ఆగష్టు 31, 2007 వద్ద 11:52 పూర్వాహ్నం |
’ఫన్’ టాస్టిక్
వికటకవి // ఆగష్టు 31, 2007 వద్ద 1:10 అపరాహ్నం |
వాహ్వా! వాహ్వా!
radhika // ఆగష్టు 31, 2007 వద్ద 3:41 అపరాహ్నం |
అదుర్స్!
vookadampudu // సెప్టెంబరు 1, 2007 వద్ద 5:00 పూర్వాహ్నం |
చదువరి గారు, వీవెన్ గారు, కొత్తపాళీ గారు,
ధన్యోస్మి.
చదువరి గారు:
కొన్నాళ్ళు అనామకుడిగానే ఉండనిద్దురూ. మీరిచ్చిన ఐఛ్చికాలు బాగున్నాయి. శ్లేషావతారమూర్తి అని పెట్టుకోమంటారా? మీరు బ్లాగ్ పదకోశం చాలాబావుంటుంది. మీ రాజకీయ ‘టపా’కాయలు కూడా బాగున్నాయి.
రానారే గారు :
బంగారక్క ప్రయోగం బావుంది.
తెలుగు అభిమాని గారు, వికటకవి గారు, రాధిక గారు:
ధన్యవాదములు.
పన్ తరంగాలు -౨ « ఊక దంపుడు // డిసెంబరు 6, 2007 వద్ద 1:12 అపరాహ్నం |
[...] 1 ప్రదర్శిస్తే బాహువుల మధ్య ముఖం దాచుకోవాల్సొచ్చే [...]
పన్ తరంగాలు -౩ « ఊక దంపుడు // అక్టోబర్ 9, 2008 వద్ద 12:19 పూర్వాహ్నం |
[...] పన్ తరంగాలు -౧ పన్ తరంగాలు -౨ [...]
narasimha rao mallina // అక్టోబర్ 9, 2008 వద్ద 5:27 పూర్వాహ్నం |
హాయిగా..హాయిహాయిగా…ఉన్నాయండి