ఊక దంపుడు

చిత్ర పుత్రోత్సాహము

సెప్టెంబరు 5, 2007 · అభిప్రాయములు

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ఎపుడా
పుత్రుడు హీరో అగునో
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ‘నటులా’
పుత్రుని నటనను బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు “ఆడున్
పుత్రుని సినిమా వందని”
పత్రికలు టీవీలుపేల, పొందుర సుమతీ!

పుత్రోత్సాహమె తండ్రికి?
పుత్రుడి సినిమా ఫెయిలవ?,ఫస్ట్రోజే ఆ
చిత్రము వెనుదిరిగొచ్చిన-
పుత్రోత్సాహంబు పాడు బొందర సుమతీ!

పుత్రోత్సాహమధికమై
పుత్రుకు పుట్రేపు బెట్టి,పైగా హీరో
పాత్రిచ్చి తీయ సినిమా;
పాత్రొచ్చినచేతికి- తన పాపమె? సుమతీ!

వర్గాలు పేరడీలు

8 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి