అంకముజేరి శైలతనయాస్తన ధుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ కబళింపబోయి యా
వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వే మృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్
(అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోనిది)
అంకముజేరి శైలతనయాస్తన ధుగ్ధములానువేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ కబళింపబోయి యా
వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వే మృణా
ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్
(అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోనిది)
వర్గాలు ఊ(సు పో)క
6 స్పందనలు so far ↓
కొత్తపాళీ // సెప్టెంబరు 16, 2007 వద్ద 1:12 అపరాహ్నం |
BEautiful. I think there’s a Sanskrit sloka that has the same meaning ..
vookadampudu // సెప్టెంబరు 16, 2007 వద్ద 8:41 అపరాహ్నం |
గురువు గారు,
సంస్కృతం లో ఉందని తెలీదండీ. పెద్దలనడగాలి. గణనాధుని కొలుస్తూ, అర్ధనారీశ్వరతత్వాన్ని కూడ చెప్పే ఈ పద్యం నాకు ఇష్టం.
రానారె // సెప్టెంబరు 20, 2007 వద్ద 3:25 అపరాహ్నం |
ఒడిని జేరి పార్వతీదేవి చనుబాలను (నోటితో) తాగువేళ బాల్య చాపల్యపు చేష్టగా తొండముతో అటుపక్కనున్న స్తనాన్నీ కబళించబోయి, ఆ పక్క స్తనమును కానక, శివుని హారము(పాము?)ను చూచి, (వే … అంటే ఏమిటో మీరే సెలవివ్వాలి !!?) గజముఖుని కొలిచెదను – అభీష్ట సిద్ధికై!
వే …. ??
మృణాళము – తామరతూడు
అంకురము – మొలక, చివురు
శంకను అంటెడు …
దయచేసి ఇదేమిటో చెప్పండి మాస్టారూ.
Sriram // సెప్టెంబరు 21, 2007 వద్ద 10:34 పూర్వాహ్నం |
వే (p. 1224) [ vē ] vē. [Tel.] pron. Same as వేయి. (q. v.) adj. Thousand, సహస్రము. Many, అనేకము. వేమారులు many times. adv. Quickly , speedily, శీఘ్రముగా. “దేవాన్వితంబైన హర్మ్యంబువేసొచ్చి.” G. ii. 80. “రథమువేకొని పొమ్ము.” DRAyo. 127. “వినినపఠించిన వేవిధముల.” M. XV. ii. 143. వేగంటి or వేగన్నులసామి vē-ganṭi. n. Lit. the thousand-eyed; a name of Indra. ఇంద్రుడు. “దీనిగనుగొన్న వేగంటి దేవరకును, వెచ్చనిట్టూర్పు పుక్కిట వెడలకున్నె.” R. vii. 112. వేచుంగులపాగ vē-ṭsungula-pāga. (వేచుంగులు+పాగ.) n. The serpent called శేషుడు. Lit. one who has a thousand-folded turban. వేవెలుగు or వేవెలుంగలదొర vē-velugu. n. The sun, సూర్యుడు. “వేవెలుంగుల దొరజోడు వేవెలుంగు.” A. i. 22.
Sriram // సెప్టెంబరు 21, 2007 వద్ద 10:36 పూర్వాహ్నం |
రానారె, మృణాళాంకురము అంటే తామర తూడు. ఇవి ఏనుగులకి చాలా ప్రీతి. మరి గజవదనుడు కదా, అందుకే ఆయనకూడా ఆ పాముని తామరతూడేమో అనుకుని పట్టుకున్నాట్ట.
రానారె // అక్టోబర్ 2, 2007 వద్ద 3:52 పూర్వాహ్నం |
శ్రీరామా, నెనరులు.