ఊక దంపుడు

‘ప్రో’టీన్లు-విటమిన్లూ

సెప్టెంబరు 21, 2007 · అభిప్రాయములు

రానారె గారు ఇటుగావెళ్తూ అక్కడక్కడా గట్టిగింజలు కనిపిస్తున్నాయన్నారు. అప్పటి నుంచి బ్లాగాత్మారాముడు ఆమాట అపనేయము కాదని అతలాకుతలం ఐపోతున్నాడు. అందుకని, నా”బ్లాగోనెసంచి” లో మరికాస్త ఊక కలుపుతున్నాను.

[హెచ్చరిక: మొదటి వాక్యం చదివి, మిగతా టపా చదవాలో వద్దో నిర్ణయించుకోండి.]

ఓ సాయంత్రం పూట ఇందిరాపార్కు అని పిలవబడే అరుణ కాంతి ప్రదేశం లో , ఏ ఆడపిల్లనైన ఇట్టే బుట్టలో పడేయగలను అనుకొనే ఓ వారవనితాజనతాఘనతాపహారి, ఏ మగాడినైనా చిటికెలో పడవేయగలిగిన అస్తినాస్తివిచికిత్సాహేతుశాతోదరి, ఒకరిఒకరు అప్పుడే పరిచయమై మాట్టాడుకోసాగారు. ఓ ఐదు నిముషాల తర్వాత, చీకట్లు క్రమ్ముతుంటే, నల్లని వాడు, పద్మనయనమ్ములవాడు ఉన్నాడేమోనని పొదలమాటున వెతికి, మన్నే గానీ మన్నుతినేవాడు లేడని నిర్ధారించుకొని సరససల్లాపాలలో సెటిలయ్యారు.

ఆమె: ఇంతకీ మీ దేహ ధారుడ్యానికి కారణం చెప్పారు కాదు.

ఆతడు : టీన్సు-ప్రోటీన్సు, అది సరే గాని, మీ సౌందర్య రహస్యం ఏమిటో?

ఆమె: ఆఁ…విటులూ-విటమిన్లూ!!

వర్గాలు ఊ(సు పో)క