[హెచ్చరిక: ఇది పేరడీ]
శ్రీరాముడి ఈ టపా చూసిన తరువాత బ్లాగేశ్వరునికి ఎలా కలిగిందో, రానారే గారి ఈ టపా చూసిన తరువాత నాకు అలానే దురద పుట్టింది. ఏమి చెయ్యాలో తోచని స్థితిలో రోడ్డు మీద బాగా తాగి తూలుతున్న మందు బాబు దారిచూపించాడు:
అన్న మాట వినుట
తిన్న బాట జనుట
తగవు గొప్పవాడవగుట
ఓ తూగులయ్య!
మాట తూలుట కన్న
తాగి తూలుట మిన్న
బతుకు బండి సున్న
ఓ తూగులయ్య!
సత్యశోధన కూన
మూడు బీర్ల మీన
నిజమె నాల్క పయిన
ఓ తూగులయ్య!
వోట్లనాడు ఉచితము
వద్దనుటనుచితము
ఘనమీ ప్రజాతంత్రము
ఓ తూగులయ్య!
దుఃఖము మరువ తాగు
సంతోషమపుడును తాగు
నీకేల ఆలుబిడ్డల ఓగు
ఓ తూగులయ్య!
తాగి బండి నడుపబోకు
నడిపి జనుల చంపబోకు
అదియె పదివేలు మాకు
ఓ తూగులయ్య!
ఇట రానారె స్పూర్తి
నాది వికటపు ఆర్తి
ఆరుద్ర గురు మూర్తి
ఓ తూగులయ్య!
6 స్పందనలు so far ↓
Giri // అక్టోబర్ 11, 2007 వద్ద 8:48 అపరాహ్నం |
మూడు బీర్ల కథలో అమెరికాలో ఉంటున్న దేశీయుల ప్రవర్తన గురించి బాగా రాసారు భట్టిప్రోలు గారు. బెంగాలిబాబుకి ఐ.ఐ.టిలో చదివుతున్నప్పుడులేని, అమెరికకి రాగానే రగిలిన సామజికస్పృహ గురించి చదువుతున్నప్పుడు నవ్వు ఆగలేదు (ఉ. “ఆ మొహంలో తళుక్కున ఓ గంభీర ముద్ర వెలిగింది ” )
బ్లాగేశ్వరుడు // అక్టోబర్ 12, 2007 వద్ద 5:54 పూర్వాహ్నం |
ఊకదంపుడు గారు నాకు కూడా కొద్దిగా పేరడీ చెయ్యాలని అనిపించింది. మీ అంత నిపుణతో చేయలేక పోయినా ఈ దో ప్రయత్నించాను.
బాగుండదు మెదలు
అలవడును రాత్రిపగలు
తెచ్చేను కాలేయ తెగులు
ఓ తూగులయ్య!
కొత్తపాళీ // అక్టోబర్ 12, 2007 వద్ద 4:37 అపరాహ్నం |
I’m sorry to say, but u.da. boss, you missed the bus!
Annonymus // అక్టోబర్ 13, 2007 వద్ద 5:22 పూర్వాహ్నం |
Lucky u , Missed Bus got a Plane
vookadampudu // అక్టోబర్ 14, 2007 వద్ద 12:46 పూర్వాహ్నం |
గురువుగారు, తెలియజెప్పినందుకు నెనరులు. ఈ సారి జాగ్రత్త వహిస్తాను.
తూగులయ్య పదాలు-౩ « ఊక దంపుడు // డిసెంబరు 19, 2007 వద్ద 10:00 అపరాహ్నం |
[...] పఠయితలే సంయమనం పాటించాలని మనవి. మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే [...]