ఊక దంపుడు

డిసెంబరు 2007 నుండి టపాలు

పన్ తరంగాలు -౨

డిసెంబరు 5, 2007 · అభిప్రాయములు

జావా రాకపోతే జావాజమ్మ.
యడాగమ సంధి: ఎడం వస్తే తిరిగి కలవటానికి చేసుకునే సంధి.
గురువు గారిది బహుముఖప్రజ్ఞ, నాది బాహుముఖప్రజ్ఞ1.
ఒకప్పుడు తిక్క శంకరయ్య లుండేవారు, ఇప్పుడు తిక్క యాంకరయ్యలు, యాంకరమ్మలూ
నా మిత్రులందరూ గ్రంధసాంగులే, పుస్తకంలో చూసే పాటలు పాడతారు
డాక్టర్: వ్యాధుల్నించి రోగుల్నీ, rogue-ల్నించీ నర్సుల్నీ కాపాడేవాడు.
పన్‍తరంగాలు-౧ ఇక్కడ
———————————————————————-
1 ప్రదర్శిస్తే బాహువుల మధ్య ముఖం దాచుకోవాల్సొచ్చే ప్రజ్ఞ.

వర్గాలు ఊ(సు పో)క

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -3

డిసెంబరు 1, 2007 · అభిప్రాయములు

నా మిత్రుడి సలహా మీద ఈ విధంగా ఇంగ్లీషు మాట్లాడటం, అది అందరికి అర్ధమైపోవటం లాంటివి జరగుతూ ఉండటం తో, వాడికి ఈ విషయం చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్లేటప్పటికి వాళ్ల అన్నయ్య కొడుకు ఈ ఇంగ్లీషు ముక్కలు బట్టీయం వేస్తున్నాడు:
“But I have promises to keep,
And miles to go before I sleep”


మా రామలింగాన్ని తీసుకొని బయటకు వచ్చి కాఫీ హోటల్లో కూర్చున్నాక నేను అడిగాను :
ఆ బుడ్డోడికి అంత ‘పెద్ద’ పద్యాలు అవసరమంటావా?
రామ: పెద్ద చిన్న ఏముంది అన్నీ నేర్చుకోవాలీ, మన సీసమూ కందమూ లాగే.
నేను: నేనన్నది ఆ పెద్దగాదు,
“పెద్దలకి మాత్రమే” పెద్ద.
రామ : అందులో పెద్దలకు మాత్రమే ఏముందిరా
నేను : నువ్వు ఆ పద్యం వినలేదా, దాని అర్ధం పట్టించుకోలేదా?
రామ : ఎంట్రా దానర్ధం, అడిగాడు టీ తాగబోతూ..
నేను : ” కానీ, నా దగ్గర ఉంచుకున్నదానికి చేసిన ప్రమాణాలు ఉన్నాయి ,
            మరియు (అందువల్ల) చాలా మైళ్లదూరం వెళ్ళి నిద్రపోవాలి”నేను ఇది చెప్పిన తరువాత మా రామలింగడు ఏదో చెబుదామనుకున్నాడు కాని, వేడి టీ తో నోరు కాలటం వల్ల మాట్లాడలేకపోయాడు..

వర్గాలు ఇంగ్లీషూ ..... · ఊ(సు పో)క