నేపధ్యం:
http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html
నా పద్యం:
పాటలచేతనాయికల ప్రాయపు సౌరుకె దీర్ఘమిచ్చె, తా
పాటలచేతనాయకుల పౌరుష వాక్కుకె ఒత్తునిచ్చె, తా
పాటలచేతచిత్రముల ప్రాణము లూదెను మారుమారు, ఆ
పాటలరామమూర్తికిదె పద్యసుమాంజలి, నమ్రతావిధిన్.
వేటూరికో ఉత్పలమాల
ఫిబ్రవరి 20, 2008 · అభిప్రాయములు
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · ఊ(సు పో)క
7 స్పందనలు so far ↓
రానారె // ఫిబ్రవరి 21, 2008 వద్ద 3:16 పూర్వాహ్నం |
అద్భుతం!
వెన్నెల // ఫిబ్రవరి 22, 2008 వద్ద 12:16 అపరాహ్నం |
baagundi!
కొత్త పాళీ // ఫిబ్రవరి 25, 2008 వద్ద 10:24 అపరాహ్నం |
దీర్ఘం వొత్తు .. ప్రాణం .. బహు బాగుంది.
అసందర్భమే అనుకోండి, ఒక మిమిక్రీ గుర్తొస్తోంది .. పల్లెటూరి బళ్ళో ఒక పిల్లాణ్ణి గుణింతం చెపరా అంటే .. క కి చెవ్వు మెలేస్తే కీ, ఎగ్గొట్టి దిగ్గొడితే కై .. అని చెప్తాడు
రాఘవ // మార్చి 5, 2008 వద్ద 9:54 అపరాహ్నం |
ఉ.బొందితొ స్వర్గవాసమును పొందగజేసెడి భక్తిపాటలూ
సందడి ప్రేమ పండుగ వసంతము మున్నగు వంటి వాటిపై
వందలు వేలు వ్రాసె గద పాటలు పద్యములెన్నొ యట్టి శ్రీ
సుందరరామమూర్తి కవిసోముని నేర్పు నుతింప శక్యమే?
vookadampudu // మార్చి 9, 2008 వద్ద 3:51 అపరాహ్నం |
రాఘవ గారు,
పద్యం బాగా వచ్చింది.
Giri // మార్చి 9, 2008 వద్ద 7:57 అపరాహ్నం |
చాలా బావున్నాయి ఇద్దరి పద్యాలు
రానారె // మార్చి 22, 2008 వద్ద 12:35 పూర్వాహ్నం |
ఔను.