ఊక దంపుడు

నానాటికితీసికట్టు నాగంభొట్లూ!

మార్చి 21, 2008 · అభిప్రాయములు

టపా శీర్షిక చూసి అది ఏదైనా పద్యపాదంలా కనిపిస్తే పద్యం రాసే మిత్రులకు ప్రత్యేకం గా చెప్పేది ఏమీ లేదు కానీయండి, ఔత్సాహికులకోసం ఒక మాట చెబుతాను..

పై శీర్షిక కందపద్య పాదం అవుతుంది. సమస్యా పూరణం అంటానికి లేదుకానీయండి, మిగిలిన ౩ పాదాలూ రాస్తే పద్యపూరణమౌతుంది.
మీ చేత ఈ మధ్యకాలంలో ‘నానాటికితీసికట్టు’అనిపించిన విషయాలు చాలా ఉండి ఉంటాయి ( ఏంటి, నా బ్లాగ్ కూడా అంటారా, సరే ఆ విషయం తరువాత మాట్లాడుకుందాం).
అలాంటి ఒక విషయం తీసుకొని పద్యం చెప్పండి.

కంద పద్యం గురించి ఇక్కడ చూడండి, అర్ధం కాకపోతే ఇక్కడ.

వర్గాలు ఊ(సు పో)క

4 స్పందనలు so far ↓

  • రాకేశ్వర రావు // మార్చి 21, 2008 వద్ద 2:59 అపరాహ్నం | జవాబు

    సూర్యేంద్ర గణాల గురించి అలోచించీ కందం అని కూడా గుర్తుపట్టలేక పోయాను.
    పట్టిన తరువాత కూడా, ఆ జాతీయానికి అర్థం తెలియక నిస్సహాయుడనైనాను..
    నా కందం.. మందం టాపా ఒక నాటికి ఇలా నలుగురికి కందాలు నేర్వడానికి ఉపకరిస్తుందని తెలిసి చాలా సంతోషంగా వుంది.

  • రాఘవ // మార్చి 22, 2008 వద్ద 7:42 అపరాహ్నం | జవాబు

    కం. మానగలేము గదా వ్యస
    నానికి బానిసలయినచొ తద్వ్యసనముచే
    నానా తిప్పలు పడినా
    నానాటికి తీసికట్లు నాగంభొట్లూ.

    నాకంటిన వ్యసనం కందాలు వ్రాయటం. దానిని మెల్లిగా తప్పించి మెల్లగా మిగతా వాటిమీద కూడా దృష్టి పెడదామనుకునేసరికి యిలా మళ్ళీ కందంలోకి లాగేయటం భావ్యం కాదు. ఆయ్, హన్నా.

  • బ్లాగేశ్వరుడు // ఏప్రియల్ 12, 2008 వద్ద 10:55 అపరాహ్నం | జవాబు

    ఊకదంపుడు గారు, పద్యాల వైపు రాకుడదు అని ఎంత నిశ్చయించుకొన్నా …

    కం.
    నేను పరీక్షలకొఱకున్
    నానాయాతన పడుతు మనమునిల కడగా
    నేనిలుపెడి నాయత్నము
    నానాటికి తీసికట్లు నాగం భొట్లూ

    పద్యము ఏమి గొప్పగా లేదు కాని ఏదో నా ప్రయత్నము చేశాను

  • vookadampudu // ఏప్రియల్ 19, 2008 వద్ద 9:17 అపరాహ్నం | జవాబు

    డాక్టరు గారు, పద్యం బాగా వచ్చింది. మీకు పరీక్షలలో ఘన విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.

వ్యాఖ్యానించండి