భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా
మల్లెలు – కోకిల?
ఏప్రియల్ 8, 2008 · అభిప్రాయములు
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
6 స్పందనలు so far ↓
రాఘవ // ఏప్రియల్ 8, 2008 వద్ద 11:38 అపరాహ్నం |
ఇదిగో దీనికి జత మత్తకోకిల:
బావచెప్పిన వూసులన్నియు బాగుగా తను విన్నదై
బావకోసమె వచ్చినానని పల్కె మెల్లిగ తీయగా
బావనప్పుడు చూచుచూ తన బావ మీదను ప్రేమతో
బావకౌగిట సిగ్గుమొగ్గగ మారిపోయెనలా అలా.
vookadampudu // ఏప్రియల్ 12, 2008 వద్ద 12:10 పూర్వాహ్నం |
రాఘవ గారు,
జత బావుంది. మిత్రులు ఉగాది నుంచి నవమి వరకు శెలవులో ఉన్నాట్టున్నారు, లేకపోతే, ఇక్కడ చిన్నపాటి కోకిలల కుటుంబం ఏర్పడేది ఈ పాటికి.
ఓ పక్షి కూత « వికటకవి // ఏప్రియల్ 17, 2008 వద్ద 1:01 పూర్వాహ్నం |
[...] గాడిదని చెడగొట్టిందని తెలుసు కానీ, ఇలా కూసే పక్షులు కూడా మేసే పక్షుల్ని “పాడు” [...]
వికటకవి // ఏప్రియల్ 17, 2008 వద్ద 1:04 పూర్వాహ్నం |
నా కూత నా బ్లాగులో కూసా కోకిలలారా
ఓసారటు వచ్చెళ్ళండి.
కొత్తపాళీ // ఏప్రియల్ 17, 2008 వద్ద 8:35 పూర్వాహ్నం |
ఆహా కోకిల గానం .. మా వూరికి కూడా వసంతం వచ్చేసినట్టుందే?
వూ.ద. మహాశాయా, మ్రోయ అంటే ధ్వనించడం – అక్కడ తాంబూల చర్వణంలో ఏమి “ధ్వని”స్తున్నదో ఏవిటో??
vookadampudu // ఏప్రియల్ 19, 2008 వద్ద 9:00 అపరాహ్నం |
గురువు గారు,
ఆకులు చుట్టేటప్పటి కరకంకణ నిక్వాణమేమో.
అక్కడ క్రావడి అనవసరంగా మొశాను. తొలగిస్తున్నాను.
ఱాకేశ్వరుడు చెప్పినట్టు
మొత్తానికి పద్యం వ్రాసిన తరువాత ఒక రెండు మూడు సార్లు తిరిగి చూసుకుంటే సరిపోదన్నమట, ఒక పది సార్లైనా చూడాల్సిందే