ఈ మధ్య మా ప్రాజెక్టు లో ఒకతను రాజీనామా చేసి బాలెన్స్‍షీట్ కాస్త బాగా కన్పిస్తున్న కంపెనీ వైపు పరిగెత్తితే, మా ప్రాజక్టు లో ఓ ఇంజినీర్ కి కొరతొచ్చింది. మానేజరు నన్ను బిలిచి, ఇప్పుడు నియామకాలు లేవు, పక్క ప్రాజెక్టు లో నుంచి ఒకడిని తెచ్చుకోవాలి, ఈ ఇద్దరితో మాట్లాడి, ఎవరినో ఒకరిని ఎంచుకో అని ఓ రెండు పేర్లు చూపించారు.
మొదట చందన్ మిశ్రా తో మాట్లాడాను
నువ్వు ఎందుకు ప్రాజెక్టు మారదామనుకుంటున్నావు?
Actually I want to change project ఇసిలియే కీ …..
నీకు c++ వచ్చా?
I know C++ మతలబ్ I gave a paper in 3rd sem మగర్ సంఝో కీ I did not work on C++…
ప్రాజెక్టు లో నీ పని ఏమిటి?
Beginning, I was given a feature, it so happened కీ ..
…వీడు ఇట్టా మాటిమాటికీ, “కీ”లిస్తుంటే మనవల్లకాదని రెండో వాడిని (పొన్నూరు మధుబాబు) పిలిచాను మాట్లాడటానికి..
ఇంటిపేరేనా, ఊరిపేరు కూడా పొన్నూరేనా..
పొన్నూరు కాదు గానీ, పక్కనే…
సరే, రేపటినుంచి ఈ ప్రాజెక్ట్ కి వచ్చెయ్..
***
రెండు రోజుల తరువాత .. అతడు నా దగ్గరికి వచ్చి:
“UdaM I am empty. “ అన్నాడు
వ్వాట్
That documents read completed. Now I am empty. Give me something.
I am empty అంటే , ఖాళీ గా ఉన్నాను అని అర్ధం నేర్చేసుకొని, మా రామలింగానికి మనసులో ‘థాంక్స్’ చెప్పుకొని
“గో,చెక్ సర్వర్ ” అని సర్వర్ ఉన్న వైపు చేయి చూపించాను..
అతను అక్కడికి వెళ్లి, నాకు వినిపడటానికి గట్టిగా
“You are locked” అని అరిచాడు
వ్వాట్
“You are locked server,I can’t check logs, please open.” అని అరిచాడు
తేరుకొని, సిష్టం అన్‍లాక్ చేయటానికి వెళ్తుంటే, అనుమానమొచ్చింది, పొరబాటున, సర్వర్ కిల్ అయ్యుంటే వీడేమి అరిచేవాడా అని..