ఊక దంపుడు

అమ్మ, నాన్న, మూడేళ్లబ్బాయి

జులై 12, 2008 · అభిప్రాయములు

అమ్మ: పదిన్నర అవుతోంది పడుకోరా
అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా

అమ్మ: పదకొండయింది పడుకో నాన్న, టి.వీ రేపు చూడచ్చు
అబ్బాయి: నాన్న వచ్చాక పడుకుంటాలే అమ్మా
అమ్మ: నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంకా లేటవుతుందిట, నేనూ పడుకుంటున్నాను , నువ్వూ పడుకో
అబ్బాయి: సరె ఐతే నువ్వు పడుకో అమ్మా నేను ఇవాళ పడుకోను లే..
అమ్మ: ఎందుకు పడుకోవు?
అబ్బాయి: నేను నిద్ర మధ్య లో లేచి ఏడిస్తే, నువ్వు విసుక్కొని తిడతావు గా, అప్పుడు ఎత్తుకొని నిద్రపుచ్చటానికి నాన్న ఉండరుగా అందుకు.
అమ్మ: ??!

వర్గాలు ఊ(సు పో)క · పెంపకం
Tagged:

పెడితే పెట్టాలిరా…

జులై 12, 2008 · అభిప్రాయములు

పెడితే పెట్టాలిరా పార్టీ పెట్టాలి
ఐతే అవ్వాలిరా ఛీఫ్ అవ్వాలి
బాటేదైనా గాని మనరైలు వెళ్లాలి
పోటిఉన్నాగాని గెలుపొంది తీరాలి
హస్తినలో నీకోసమె పాత్రే ఉండాలి

అనుపల్లవి:
వోట్లే రాలాలి మునిరాజు లాగ
సీట్లే రావాలి నటరాజు లా
పదవే ఉండాలీ నెలరాజు లా
ముగిసే పోవాలి రాజూ, పేదతేడాలన్నీ…….

అనుపల్లవి మీకేమైనా అర్ధం అయ్యిందా చదువరి గారు?

వర్గాలు ఊ(సు పో)క · పేరడీలు