పెడితే పెట్టాలిరా పార్టీ పెట్టాలి
ఐతే అవ్వాలిరా ఛీఫ్ అవ్వాలి
బాటేదైనా గాని మనరైలు వెళ్లాలి
పోటిఉన్నాగాని గెలుపొంది తీరాలి
హస్తినలో నీకోసమె పాత్రే ఉండాలి
అనుపల్లవి:
వోట్లే రాలాలి మునిరాజు లాగ
సీట్లే రావాలి నటరాజు లా
పదవే ఉండాలీ నెలరాజు లా
ముగిసే పోవాలి రాజూ, పేదతేడాలన్నీ…….
అనుపల్లవి మీకేమైనా అర్ధం అయ్యిందా చదువరి గారు?
4 స్పందనలు so far ↓
చదువరి // జులై 13, 2008 వద్ద 10:38 అపరాహ్నం |
మీరు ఇలాగ్గూడా సమస్యలిస్తున్నారా సార్!?
రాజులు ముగ్గురూ ఎవరెవరో అర్థమైనట్టే అనిపిస్తోంది.
- (జల) యజ్ఞాలు చేసే మునిరాజు గారొకరు,
-చంద్రశేఖరుడైన నటరాజు ఇంకొకరు,
-చంద్రుడు – నెలరాజు – మూడోవారు. అంతేనంటారా?
పదవి నెలరాజులా ఉంటే ఎలాగండీ?
vookadampudu // జులై 20, 2008 వద్ద 1:21 అపరాహ్నం |
చదువరి గారు, ఈ ట్రిక్ బావుంది కదా, అర్ధం కాకుండా రాసేశి, చిక్కుముడి విప్పమనటం….
నేను కొంచం పాత రాజకీయలు రాశాను..
మునిరాజు – పి.వి.న.రావు గారు, చాలా కాలం ఈయన పేర భారీ మెజారిటీ తో గెలిచిన రికార్డు ఉండేది.
నటారాజు – నటసార్వభౌమ ఎన్.టి.రామారావు గారు, ఆంధ్ర అసెంబ్లీ లొ అదిక మెజారిటీ సాధించినది వీరే అనుకుంటా.
నెలరాజు – మీరు చెప్పినట్టే చంద్రబాబు గారు – ఆంధ్ర ప్రదేశ్‌కి అధిక కాలం ముఖ్య మంత్రి గా పని చేసింది ఈయనే ..
రాజేంద్ర // జులై 20, 2008 వద్ద 6:59 అపరాహ్నం |
చంద్రబాబును నెలరాజు అనటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా!అది నాదెండ్లభాస్కరరావుకు మాత్రం పరిమితం.
vookadampudu // ఆగష్టు 2, 2008 వద్ద 11:25 పూర్వాహ్నం |
రాజేంద్ర గారు, హహహ్హా!!!.. మీ “సమయ”స్పూర్తికి జోహర్లు!!