ఊక దంపుడు

అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౨

ఆగష్టు 12, 2008 · అభిప్రాయములు

గురువారం రాత్రి:
అబ్బాయి : ఎంటి నాన్న తొందరగా వచ్చి నిద్రబుచ్చుతాననిచెప్పి ఇవాళ కూడా లేట్ గా వచ్చావు?

(అవసరానికో అబద్ధం ఆడే) నాన్న
:  పెందరాడే వద్దామనుకున్నా, వస్తుంటే పని ఉందని కారుణ్యా అంకుల్ ఆపేశాడు, అందుకని లేట్ అయ్యింది

***

శుక్రవారం ఉదయం
అమ్మ: ఏమండి,లేవండీ మీకు కారుణ్య ఫోన్
అబ్బాయి : ఉండు నేను మాట్టాడతా

అబ్బాయి : హలో, రాత్రి మా నాన్నని అంతసేపు ఆఫీస్ లో ఎందుకట్టేపెట్టా? తొందరగా వచ్చి బబ్బోపెడతానన్నాడు, రాలేదు పెట్టాలేదు..
కారుణ్య: ???
అమ్మ, నాన్న :? ????

వర్గాలు పెంపకం

6 స్పందనలు so far ↓

వ్యాఖ్యానించండి