అబ్బాయి: ఏంటి నాన్న నేను పది రోజులు ఇంట్లో లేకపోతే నీకు బోర్ కొట్టిందా
నాన్న: అవును
అబ్బాయి: మామయ్య తిరిగి అమెరికా వెళ్లిపోయాడు, నే వచ్చేశాన్లే.
నాన్న: ఊ, ఏమిటి విశేషాలు?
అబ్బాయి : ఏమీ లేవు, నువ్వు చెప్పు.
నాన్న: మీ మామయ్య పెళ్లి చేసుకుంటానంటున్నాడా?
అబ్బాయి : అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు.
నాన్న: ???
*******
అమ్మ: మీరు రాలేదని మా తమ్ముడు చెల్లెలు చాలా సార్లు అనుకున్నారండి.
నాన్న: అవునా
అబ్బాయి: నీకు అంత సీను లేదు నాన్నా, ఇంకో మాటజెప్పు
అమ్మ:నువ్వూరుకోరా
నాన్న: వాడ్నంటావెందుకు,బడి మానిపించి మామయ్యతో తిప్పితే ఇవి కాక ఇంకేంనేర్చుకుంటాడు?
*******
నాన్న: ఓరెయ్ ఇంకా పడుకో, రేపటి నుంచి బడికెళ్లాలి
అబ్బాయి: సరే
నాన్న: లాలనుచునూచేరు లలనలిరుగడలా..
అబ్బాయి: హబ్బా, నాకు లాలి అక్కర్లేదు నాన్నా, నేను పెద్దవాడినయ్యాను.
అమ్మ: చూశారా, మామయ్య దగ్గర ఉండి ఎంత డిప్లమసీ నేర్చుకున్నాడో, మీరు పాడితే వచ్చే నిద్ర కూడా పారిపోతుందని అనిచెప్పకుండా, నేను పెద్దవాణ్ణయ్యా, లాలి అక్కరలేదు అని చెప్పాడు.
నాన్న: ???
6 స్పందనలు so far ↓
వేణూశ్రీకాంత్ // జూన్ 26, 2009 వద్ద 7:13 అపరాహ్నం |
హ హ
జ్యోతి // జూన్ 26, 2009 వద్ద 8:49 అపరాహ్నం |
స్వానుభవమా???
sujata // జూన్ 26, 2009 వద్ద 9:50 అపరాహ్నం |
మా బావగారు చాలా కొంటె మనిషి. మా అక్కయ్య చాలా బాగా పాడుతుంది. కానీ ఆమె, కొడుక్కి నిద్ర పుచ్చడానికి లాలి పాట మొదలుపెడితే, పిల్లవాడు (మా అక్క కొడుక్కి అప్పుడపుడే పూర్తి గా వాక్యాలు పలికే వరకూ మాటలొస్తున్నాయి) – ‘అమ్మా! పాత ఆపు ! నిద్రపొతా !’ అనే లా తరిఫీదు ఇచ్చారు. మొదటి సారి వాడలా అనేసరికీ మా అక్కయ్య నిర్ధాంతపోయి.. ఒక అరగంట సేపు పడీ పడీ నవ్వింది. తరవాత తెలిసింది అది పిల్లాడి సొంత తెలివి కాదనీ, వాళ్ళ నాన్న నేర్పించారనీ ! అది గుర్తొచ్చింది.
కొత్తపాళీ // జూన్ 27, 2009 వద్ద 9:44 పూర్వాహ్నం |
ha ha.
@Sujata .. double ha ha
ఊకదంపుడు // జూన్ 27, 2009 వద్ద 9:19 అపరాహ్నం |
జ్యోతి గారు,
కాస్త స్వానుభవం కాస్త ఊక. నా తరువాతి టపాకు మీరు ఇదే ప్రశ్న అడగకుందురుగాక.
ఊకదంపుడు // జూన్ 27, 2009 వద్ద 9:24 అపరాహ్నం |
సుజాత గారు,
నేను పాట పాడితే వచ్చే నిద్ర కూడా పోయే మాట నిజమే.
ఫాన్ అట్టా తిరగకుండా ఇట్టా ఎందుకు తిరిగుతుంది, నువ్వు ఫాన్ ఎక్కి కూర్చో నేను స్విచ్ వేస్తా – ఏమౌతుందో చుద్దాం…
ఇలాంటి వాటిని నిలువరించటానికి – ఓ పల్లవి పట్టుకొని అరిగిపోయిన రికార్డ్ లా అదే “చదువుతూ” ఉంటాను .. ఇంక ఎవరూ మాట్లాడరు – నిద్రపోయే టైం అయ్యింది అన్న భావన కలిగించటానికి