ఫోటో స్టూడియోల వారికి “బడును” చాలా అలవాటైన మాట అనుకుంటా…
కలర్ ఫోటో లు తీయబడును
వివాహాది శుభకార్యములకు వీడియో తీయబడును
వీడియో క్యాసెట్టు సి.డి గా మార్చ బడును .. ఇలా…
ఆంద్రప్రదేశ్ రాజధాని నగరం లో కుక్కటపల్లి ప్రాంతం లో ఇప్పుడు ఫోటో స్టూడియో ల వద్ద కనిపిస్తున్న ప్రకటన:
ఫలాన తేదీ నుండి ధరలు పెరగబడును
7 స్పందనలు so far ↓
నువ్వు // సెప్టెంబరు 11, 2009 వద్ద 2:07 అపరాహ్నం |
బడును బడును ..
Praveen // సెప్టెంబరు 11, 2009 వద్ద 2:14 అపరాహ్నం |
ఉర్దూ ప్రభావం ఉన్న హైదరాబాద్ లో తెలుగు సరిగా రాకపోతే విచిత్రం కాదు. శ్రీకాకుళం పట్టణంలో కూడా ఒక షాప్ ముందు దొరకబడును అని ఖూనీ చెయ్యబడిన బాషలో వ్రాయడం ఆశ్చర్యం కలిగించింది.
తాడేపల్లి // సెప్టెంబరు 11, 2009 వద్ద 3:14 అపరాహ్నం |
అకర్మక క్రియలకి కర్మార్థకం రాదని వాళ్ళకి తెలియదు.
అది సరే గానీ మీరొకసారి నాకు వేగు పంపుతారా ?
వేణూశ్రీకాంత్ // సెప్టెంబరు 13, 2009 వద్ద 12:23 అపరాహ్నం |
మీరు ఇచట ఊకదంచ’బడును’ అని ఏదో చెప్తున్నారేమో అనుకున్నాను ఇంకా
రవి చంద్ర // సెప్టెంబరు 13, 2009 వద్ద 11:18 అపరాహ్నం |
వామ్మో హైదరాబాదు నగరంలో దుకాణంలో బోర్డుల్లో చాలా బూతులు చూశానండీ బాబూ!
ఊకదంపుడు // సెప్టెంబరు 13, 2009 వద్ద 11:57 అపరాహ్నం |
శ్రీకాంత్ గారు, ప్రత్యేకంగా చెప్పాలంటారా? అందరికీ తెలిసినదే అనుకునన్నాను.
ఐనా పునరంకితమౌతూ త్వరలో ప్రకటన ఇస్తా లెండి.
ఎవరన్నా వాళ్ల ఊక దంపమని Out source చేస్తే అవి కూడా తీసుకుందామనుకుంటున్నాను
కొత్తపాళీ // సెప్టెంబరు 14, 2009 వద్ద 7:55 పూర్వాహ్నం |