ఊక దంపుడు

Entries categorized as ‘'ఊక'వితలు-పద్యాలు’

విరోధికేస్వాగతమను వింతను గనుడీ!

మార్చి 27, 2009 · అభిప్రాయములు

కం.  ముచ్చెమటలుబట్టెనయా
రచ్చల గనిద్రవ్యమాంద్య రక్కసి రూపున్
విచ్చేయగనీవునిపుడె
హెచ్చరికయుసేయలేను హేలాగతులన్!

కం.    పేరే విరోధి యంటివె
మారేమిపలుకుదునయ్య, మౌనము ముద్రై
దారేమోమున్ముందిక
రారో, వచ్చెదరొ హితులు,రక్షింపన్,నన్.

శా.  పేరున్నెంచరొ మానసంబున,మఱిన్ భీతిల్లరో వీరులై,
క్షీరాంభోధిసుతామనోహరుడనేసేవించుధైర్యమ్మొ,తీ
రా,రానున్నదిరాకమానదనువైరాగ్యమ్మె సిద్ధాంతమో
నీరాకంగనిసంబరమ్ముజరుపన్ నెమ్మౌననేనమ్మికో-

కం.   ( అరవై యేండ్లకు ఒకపరి)
నరులిండ్లనుగట్టితోరణములే, దీర్చీ
అరుగుల గడపల ముగ్గులు
విరోధికేస్వాగతమను వింత యిదిగనన్.

ఉ.     ఓయి!వసంతకాలమను ఉద్దిరి వెంబడి రాగమచ్చికౌ
తీయని పాటలన్ వినగ దెచ్చిన జెల్లునుకోకిలమ్మలన్
దోయిది చాలదన్నటుల తోడుగ ఎన్నిక దెచ్చినాడవే
హాయిని గూర్చుమాసమున హవ్వ!విరోధివిగాకయుందువే.

ఉ.  నామము వ్యక్తిలక్షణగుణమ్ముల కద్దముబట్టుపాతదౌ
నేమము యంతరించెగద, నేస్తమ! పేరది గుర్తుకోసమే
లేమియు కల్మిజంటలిట లెక్కగు నన్యము లెల్లశూన్యమే
నీమదినెంచి ఈ నిజము నిత్యవిరోధముబూనబోకుమా!

సీ.     మున్నొక్కడిటువచ్చి ముంచెలే నిలువునా
క్రయవిక్రయములందు కపట పుటల

తొల్లియొక్కడువచ్చి చెల్లుచీటినివ్రాసె
సోదరులకు కోట్ల సొమ్ము కొఱకు

ఏడాది ముందఱ ఇటులొచ్చి నొక్కడు
వేలకోట్లను జేసె వెఱ్ఱిమాట

వచ్చుచు నొక్కడు దెచ్చెనులెసునామి
కూలెరానొకడుదలాలు వీధి
ఆ.వె.     పేరు మంచి దౌట వారుచేసినదేమి
చెప్పరాదుగాని చేదునిజము;
మంచి చేయ నీవు మరువబోరుజనులు
కాలచక్రమెంత కదలినేని.

ఉ.    నేతల వైరివై నిలుము నీతిని జంపిరి లోకమందునన్
వాతలు బెట్టుమా బిలచి వర్తక శ్రేణుల సత్యదూరులన్
పూతపవిత్రబారతిన పోరియె ద్రుంచుము యుగ్రవాదమున్
యాతన బెట్టిపేదలను అద్దెబలమ్మని విఱ్ఱవీగకే.

కం.   బీదల, పిల్లల, మహిళల
మేదిని శుభములనుగూర్చ మీలో ఒక్కం
డుదయం దల్చును త్వరలో
సాదుగ నిల్వంగనీవు చాలదె మేలౌ.

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
Tagged: , ,

నేర్పవయ్య నాకు సర్పభూష!

ఫిబ్రవరి 23, 2009 · అభిప్రాయములు

సీసము(?):

శిరమున యొప్పుకాపురభారమొక్కటి

శిరమున సంసార భారమదొక్కటి
పరవళ్ల గంగయు- వరసకొడుకు*

తిరముగ ఒంటినంటి రమణి యొక్కతె
పార్వతీ దేవియు పసుపు కొడుకు

ఆమెకు ఈమెకు నేమందులేగాని
సకలలోకమనెడి సవతి పోరు

ఈతని కాతని కీశ! జెప్పగనేల,
సకలలోకమెరుగు చవితి పోరు

ఆటవెలది(?):

మౌని,స్థాణు, జడుడ, మాటవరసకైన
జోక్య మింత లేదు జోగి నీదు.
“నీరు-తామరాకు” నియతి వర్తింపగా
నేర్పవయ్య నాకు సర్పభూష!

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
Tagged:

చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా

అక్టోబర్ 12, 2008 · అభిప్రాయములు

గోపిక-1:
హారనులేనికారువలె, హస్తికి దంతము లేనిరీతినన్
చీరెకు అంచులేనటుల, జీరలు కల్గని వ్యాఘ్రమోయనన్
ధారుణి ఖ్యాతినొందనగు, దాపరికమ్మొకొ, ఏమియా  
దారములేని హారము, నితంబిని, నీకెటులొచ్చె జెప్పవే?
గోపిక-2:
మేరువు పండితోత్తముల, మేటికవీశులమధ్య, తా.ల.బా, 
పేరుకుతగ్గరీతిమన పెద్దన యల్లిక సౌరునిచ్చె,రా   
నారెయు,రామకృష్ణ,గిరి, నవ్యకవుల్  శుభలగ్నమందునే
తీరుగ జేరికట్టిరిదొ, దివ్యకదంబము పద్యమాలికన్,  
దారములేనిహారమని,తానిడె కాన్కగ కొత్తపాళియే!
గోపిక-1:
కరవదినవ్యయుగమునన్,
అరదుగగనగలుగువీధి యంగడి యందున్
వరమే? అణాకు తూగని
సరుకే దెచ్చికొని చెలియ, సంతస మేలా?

గోపిక-2:
కప్పుర గంధము ఓలెన్
అప్పసిడితొడవులమెరయు అందము లాగున్,
అప్పారిజాతమువలెను
ఇప్పద్యమునిత్యనూత్నమింతీ! మఱియున్ –    

సురపురనందనైకవరశోభితసుందరశ్వేత,గంధశ్రీ
విరితరుశాఖనే భువికివేడుకదెచ్చినరీతి; జాలమున్ 
అరయగకొత్తపాళివరుడంటునుద్రొక్కగ పద్యశైలికే
స్థిరముగబూనికొన్నదనశిష్యులె పాదునుజేసి నీరిడన్
చిరుతరువింక పూచివికసించి ఫలమ్ములనిచ్చి కాచుగా!

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు

మా కందాలు – మాకందాలు

సెప్టెంబరు 10, 2008 · అభిప్రాయములు

ఇప్పటి వరకూ మాకందాలకే ఋతువుంటుండనుకునేవాడిని గానీ, కందాలకి కూడ ఋతువుంటుందని మాంఛి రాజీకయపునెలలో చదువరి గారు కందపద్యాల టపా వత్తితేనూ, అందులో కామేశ్వరరావు గారి వ్యాఖ్య చూస్తేనూ తెలిసింది. మా అయ్యవారిని అడిగితే అబ్బే, ఆ ఋతువు రావడనికి ఇంకా సమయం ఉండే అన్నారు గాని, తొందరపడి ఓ కవి కోయిల ముందే కూసింది అని బ్లాగులు చూసిన నాకు అర్ధమైపోయింది.
ఈ కోయిల కూతలు అంటు వ్యాధులు అవ్వటం చేత, అవి తొందరగా నలుబ్లాగులకి వ్యాపించాయి.
పైగా, ఇంతకుముందు కందం ముట్టని గిరి గారి చేత కూయిస్తే , అలానే మరి కొంత మంది కొత్త కోయిలలు కూడ గొంతు కలిపాయి..
సరే ఇదుగో నా వంతూ అందామని, గొంతు కలుపుదామని మా బాస్ చేత ఎంత తన్నించుకున్న ఓ కందమన్నా రాలితే నా? ( ఇప్పుడు తెలిపోయిందా నే ముద్దు కుర్రణ్ని కానని :) )
పోనీ మెదలకుండా కూర్చుందామంటే,కందబలంగలవారే కవులోయ్ అని ప్రచారం చేస్తుంటిరి.. పంది కొట్టలేవని ముందే తెలుసు అంటుంటిరి.
మరి ఏమి చేయాలీ? ఏమి చేయాలేమిటండి అది కూడ తెలియదా? ఈ వేసవి లో మావిడి పళ్లు తినలేకపోతే, ఏంచేస్తాం, క్రితం వేసవిలో, ఆ సీనుగాడు చిత్తురునుంచి బుట్టేసుకొచ్చాడురా, అప్పుడు తిన్నాం చూడు , ఇంకొ మూడేళ్లదాక మామిడి కాయ తినగూడదు అన్నంత మొహం మొత్తిందనుకో .. అంటామా? నేను అదే చేశాను ….
ఇంతకు ముందు కందాలన్నీ ఏరుకొచ్చి పేర్చాను చూడండి..
అవునయ్యా, ఎవరో కందాలు రాస్తుంటే, నీకెందుకయ్యా దురదా అంటారా?
ఆ పేరింటే నాకు తెలియకుండానే దురదొచ్చేస్తుంది. అసలు , నే బ్లాగులో అడుగెట్టింది, కంద సమస్యతోటే..

1. దంచెద ఊక… (ఆగష్టు 6, 2007 )

దంచెద ఊకనిటనహో
దంచెద కుడియెడమల మరి దంచుట సరదా
దంచిన కాలహరణమట
దంచెద వేరొండు పనినె దలుపగ నేలా?

చెబితే మీరు నమ్మక పోవచ్చుగాని, ఈ పద్యానికి మొదట మూడో పాదం పుట్టింది.

2. పేరు పెట్టెద…
రాజీ పడకయె పెట్టెద
రాజీవ్ నామము విరివిగ రాష్ట్రము నిండా
మాజీ ప్రభుత పధకముల
ఈజీగా పేరు మార్చి; ఇకమన కెదురే?

3. చిత్ర పుత్రోత్సాహము
ఇందులో ఏకంగా ఐదు పద్యాలున్నాయి. వ్యాఖ్యాల్లో చదువరి గారి పద్యం చూడండి, చిన్న కందపద్యం లొ ఓ శ్లేష, ఓ జాతీయం ఎలా వేయచ్చో తెలుస్తుంది.

4. నెనర్లు (అక్టోబర్ 17, 2007 )
రంపపు కోతల ఆంగ్లమె?
ఇంపగు మాటలు తెలుగున ఇన్నుండనుచున్
సొంపుగ నెనరిడె; నెనరులు
గంపెడనంగ కలగూరగంప గురువుకున్!

పై పద్యం చూసి కొత్తపాళీ గారు నాల్గొ పాదం బావుందోయ్ అన్నారు. పై మూడు పాదాలకి “రాజుగారి పెద్దభార్యాలంకారం” వర్తించదని మీకు నేను చెప్పనవసరం లేదనుకోండి. ఈ “రాజుగారి పెద్దభార్యాలంకార” నికి కూడ ఓ శాస్త్రీయ నామముంది, ఆలంకారీకులెవరూ చెప్పకపోతే ఒ రెండ్రోజులాగి నేనే చెబుతా.

5. వందన శతముల్ (అక్టోబర్ 17, 2007)
వాగ్దేవికి వినయముగను
వాగ్దేవీవల్లభునకు వాని సములకున్
వాగ్దేవీసమనేత్రుల,
వాగ్దేవీవరసుతులకు వందన శతముల్!

6. పదములు మూడిచ్చి కంద పద్యమ్మడిగెన్! ( అక్టోబర్ 19, 2007)
అనుమానింపగ ధర్మమె
ఘనమౌ తపమాచరింప కల్గెడి శక్తిన్?
మునిమంత్రములుత్తాటక?
తనయుడు కర్ణుడు కలుగుట తధ్యము కుంతీ!

మునివరమునుశంకింతువె
పనిగట్టుకొనిటులకుంతి? బలివైతివిగా
క్షణమున విధివింతాటకి!
తనయుడు కర్ణుడు కలడన ధరకన్నియకున్!
ఈ టపా ప్రత్యేకతేమిటంటే, శీర్షిక ఓ కందపద్యపాదం కావడం, దానినందుకొని మిత్రులు బ్లాగేశ్వరులు పద్యం చెప్పటం.
8. సిగ్గేల?నవంబరు 19, 2007

హగ్గే హాటౌ చిట్కా
రగ్గేలశిశిరపురాత్రి రమణియె బ్రోవన్
దగ్గేలదగ్గరౌమన
సిగ్గేలసిసలుమగనికి సిరిసిరి మువ్వా?

ఈ పద్యం ప్రత్యేకతేమిటంటే, అసలు పద్యం తెలీకుండా పేరడి రాసేశాననుకోవడం :( . తర్వాత దొరకబుచ్చుకున్న అసలు ఇదీ :
ఉగ్గేల తాగుబోతుకు
ముగ్గేలాతాజమహలు మునువాకిటనన్
విగ్గేల కృష్ణశాస్త్రికి
సిగ్గేలభావకవికి సిరిసిరిమువ్వా!

దీనితో కందల సీజనైపోయింది.
ఏంటి, పాత కందాలు చూపించి చేతులుదులిపేసుకుంటే ఎలా అంటారా?
ఎంత ఎలిగెన్సు త్యాగం జేసినా, కందానికీ కాస్త ఖర్చౌతుంది, అదంతా ఎవడు పెట్టుకుంటాడు చెప్పండి…
అందుకని
కలదే తాంబూలము, తే
వలెదే ప్రియదూతికయది వయ్యారముగన్,
కలరే పాఠక శ్రేష్టుల్?
బలురుచులతొభోజనముయు,పద్యమ్మడగన్?

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · ఊ(సు పో)క

నిరీక్షణ

మే 4, 2008 · అభిప్రాయములు

నన్ను నేను చూసుకుందామని
నీ కళ్లలోకి తొంగి చూస్తే
కనిపించింది నేను లేని విశ్వం!

నీ కళ్ళెదుటే నేను
కానీ,
నీ చూపుమేర లో లేను?!

నీ కనురెప్పల వాకిలిలో
కరుణాస్పద దృక్కులకై నిలుచున్నా

రెప్పమూసి హృదిలోన చోటిస్తావో
రెప్పలార్పి పాదాలకు జారనిస్తావో

నిర్ణయం నీది
నిరీక్షణ నాది

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు

మనమా? మత్తేభమా?

ఏప్రియల్ 27, 2008 · అభిప్రాయములు

రెండు హాంగోవర్ల మధ్య మద్య పిపాసి ఆలోచించుకోగలిగితే::

నుమా ఎందరొ వీధివీధికిని, ఆల్లుంగొనంగూలిరో,
వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
నుమా , మద్యము జోలికెళ్ళనని యే, యాప్తుల్ ముదంబొందగా,
నమా ఒద్దిక నాదు మాట వినుమా, ర్యాద కాపాడుమా

వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు