భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా
Entries categorized as ‘'ఊక'వితలు-పద్యాలు’
మల్లెలు – కోకిల?
ఏప్రియల్ 8, 2008 · అభిప్రాయములు
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
చంద్రమౌళి
మార్చి 5, 2008 · అభిప్రాయములు
శిరమెటనొంచని వెన్నుడె
శిరమొంచునునీకడయని శితికంధరుడా!
శిరమొంచె బావయన నీ
శిరమున జేరెను మఱింది శీతకరుండే.
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
Tagged: శివరాత్రి
వేటూరికో ఉత్పలమాల
ఫిబ్రవరి 20, 2008 · అభిప్రాయములు
నేపధ్యం:
http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html
నా పద్యం:
పాటలచేతనాయికల ప్రాయపు సౌరుకె దీర్ఘమిచ్చె, తా
పాటలచేతనాయకుల పౌరుష వాక్కుకె ఒత్తునిచ్చె, తా
పాటలచేతచిత్రముల ప్రాణము లూదెను మారుమారు, ఆ
పాటలరామమూర్తికిదె పద్యసుమాంజలి, నమ్రతావిధిన్.
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు · ఊ(సు పో)క
రైతు-సంక్రాంతి పురుషుడు -రాజకీయ నాయకుడు
జనవరి 14, 2008 · అభిప్రాయములు
ప్రతి సంక్రాంతి రైతుకి ఆశలు తెస్తుంది. సంక్రాంతి పురుషుడు కూడా రాజకీయ నాయకుడి లాంటి వాడె, సరిగ్గా పంట చేతికొచ్చే టైంకి వస్తాడు, పంట చేతికి రాకపోతే, నేనిప్పుడె వచ్చాను, తప్పంతా పాత పురుషుడిదే అంటాడు. పంట చేతికి వస్తే నేను దయామయుడిని కాబట్టి మీకు పంట చేతికొచ్చిందని పోజిస్తాడు. అహా ఇక నుంచి దమ్మప్రభువుల పాలన అని రైతు మళ్ళా మోసపోవటనికి పునరంకితమౌతాడు. చెబితే రైతు జీవితం కూడా ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురిచేతన్’అన్నట్టే ఉంటుంది. సంక్రాంతి పురస్కరించుకొని , రైతులోకానికి మేలు జరగాలని కోరుకుంటూ::
నాభూమినిప్రభుత నామమాత్రమ్మిచ్చి
లాగికొందు ననెడి రాపు లేక
పెద్దలు బలవంత బెట్టగా పొలమును
చౌక గానమ్మెడి చావు లేక
రాత్రికి రాత్రియే రాజకీయముతోడ
రింగు రోడ్డు జనెడు బెంగ లేక
చీదరించి విదుల్చు చిల్లర డబ్బుకై
కోరి సంతు కడను క్షోభ పడక
రమ్మన రాకయే, రావలదనవచ్చు
వాన గాలి జతల వ్యధలు లేక
నాయక,బ్రోకర,నకిలీల వ్యాపార
గణ సర్ప కోటికి కంట పడక
వ్యయసాయమనకయు వ్యధ సాయమనకయు
వ్యవసాయమనియె వ్యవహరింప
ఆత్మ తృప్తి కోరి, ఆత్మవి శ్వాసము
తోడ, రైతు బ్రతుక దుక్కి దున్ని
సాధు భావ రార! సంక్రాంతి పురుషుడా
తేజ రిల్ల నవని తెలుగు రైతు!!!.
మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్
డిసెంబరు 28, 2007 · అభిప్రాయములు
మోడీ మతఛాందసుడని
కాడే అపమృత్యుబేరగాడని పలికే,
మోడీ జపమ్ములో తా
మోడిరిలే ఘోరముగను, మొగమెటు చెల్లున్?
ఎన్నికలసంఘముండెనె
పన్నుగ ఉచితానుచితము పరిశీలింపన్?
వన్నే?దోషులనొదలగ?
కన్నున్ననుగ్రుడ్డిసంస్థ గాదె చదువరీ!
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు
తూగులయ్య పదాలు-౩
డిసెంబరు 19, 2007 · అభిప్రాయములు
ఇది మూడవ ( దేవుడు మేలుజేస్తే, మరియు చివరి) “రౌండు”, కాబట్టి, పఠయితలే సంయమనం పాటించాలని మనవి.
మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే ..ఇక్కడ
పెళ్లి మంటపమందు
ప్రక్క మిత్రుల విందు
సిగ్గు చేటని యందు
ఓ తూగులయ్య
***
ఫీజు జీతము నాడు
చీర పండుగ నాడు
మందు మాత్రమె నేడు
ఓ తూగులయ్య
***
తడసినంతనె గొంతు
మాట మాటకు బూతు
జేయు ననుముకవాతు
ఓ తూగులయ్య
***
బారు బిల్లగు జాస్తి
ఇంట చేతురు శాస్తి
“రోడ్డు సైడె”ప్రశస్తి.
ఓ తూగులయ్య
***
చికెను వేపుడు తోడ
గ్యాసు షోడా తోడ
తెలియు స్వర్గపు జాడ
ఓ తూగులయ్య
***
పబ్బు లొచ్చెను నేడు
కుల్కు స్మితల తోడు
తోచి నట్టుల ఆడు
ఓ తూగులయ్య
***
డాన్సు బారుల యందు
నాట్య గత్తెల చిందు
నోట్లు గుబ్బల సందు
ఓ తూగులయ్య
వర్గాలు 'ఊక'వితలు-పద్యాలు