ఊక దంపుడు

Entries categorized as ‘ఊక ముల్లు’

గ(ని)లీజు

సెప్టెంబరు 1, 2007 · వ్యాఖ్యానించండి

హైకోర్టు వద్దంది ఈ రోజు;
ఇకనైనా ఆగేనా అక్రమ గ(ని)లీజు?
ఇన్నాళ్లపాట “ప్రతిపక్షానికి స్క్రూలూజు”
ఇప్పుడేమంటాడో మరి సీమ రాజు

వర్గాలు ఊక ముల్లు

ఇది మటుకు జోకే

ఆగష్టు 29, 2007 · అభిప్రాయములు

http://www.eenadu.net/story.asp?qry1=23&reccount=28

నాకు అర్ధం కాలేదు – నైతిక బాధ్యతకి – గాంధీకి గారికి ఏమిటి సంబంధం?
బాధ్యులెవరో తెలియని పరిస్థితులలో – అలా స్పందించటం అంటే -? రేపు బాధ్యులెవరో తెలిసిన తర్వాత – నాది నా ప్రభుత్వానిది కాదు ఫలాన వాడిది బాధ్యత అంటారా?
చివరలో బాగా శెలవిచ్చారు, టవరులు కూలిన ప్రభుత్వం కూలలేదు అని. అవును, ప్రభుత్వం కూలాలంటే టవర్లు కాదు ఓటవర్లు ( ఓటు బ్యాంకులు) కూలాలి మరి

వర్గాలు ఊ(సు పో)క · ఊక ముల్లు

పేరు పెట్టెద…

ఆగష్టు 17, 2007 · అభిప్రాయములు

peru31.jpg

రాజీ పడకయె పెట్టెద
రాజీవ్ నామము విరివిగ రాష్ట్రము నిండా
మాజీ ప్రభుత పధకముల
ఈజీగా పేరు మార్చి; ఇకమన కెదురే?

వర్గాలు ఊక ముల్లు