Entries categorized as ‘ఊ(సు పో)క’
పొద్దుపోని యవ్వారం అనబడు డూపు టపా
వాళ్లిద్దరూ కపులా?
అవును కపులే.
నీకెలా తెలుసు?
లేకపోతే అలా బండి మీద కూచొని కోతిచేష్టలెందుకు చేస్తారు.
నే అడిగింది ఆలూమగలా అని..
ఆడామగలైనందుకు సంతోషించాల్సిన కాలమిది.
…
….
మొత్తానికి హైదరాబాదు చూపించరా అంటె ఫ్రీజోన్ కి తీసుకొచ్చినట్టున్నావే
నువ్వే కదా సినిమా కి వెళదామటే కాదు సాగర్ చూస్తానన్నావ్
నువ్వుచెప్పలేదుగా – బుద్ధుడి ముందుగట్టు వైపు లేక్ వ్యూ
వెనకగట్టు వైపు లేకి వ్యూ అని
సరే ఇప్పుడైనా వెళ్ళి డి.వి.డి తెచ్చుకొని చూద్దం పద
*****
బ్లూ సినిమా ఉందా అండీ
అబ్బే మా దగ్గర అట్టాంటివి ఉండవండీ.
???!!
వర్గాలు ఊ(సు పో)క
Tagged: డూపు టపా
ఫోటో స్టూడియోల వారికి “బడును” చాలా అలవాటైన మాట అనుకుంటా…
కలర్ ఫోటో లు తీయబడును
వివాహాది శుభకార్యములకు వీడియో తీయబడును
వీడియో క్యాసెట్టు సి.డి గా మార్చ బడును .. ఇలా…
ఆంద్రప్రదేశ్ రాజధాని నగరం లో కుక్కటపల్లి ప్రాంతం లో ఇప్పుడు ఫోటో స్టూడియో ల వద్ద కనిపిస్తున్న ప్రకటన:
ఫలాన తేదీ నుండి ధరలు పెరగబడును
వర్గాలు ఊ(సు పో)క
గత రెండేళ్ల లో హిందూ మతానికీ జరిగిన ఆవగింజంతా మేలైన ఉంటే, ఆ మేలు గురించి చెప్పుకోవటం జరిగితే వాటిలో భక్తి టి.వి తప్పక ఉండదగినది.
నిన్న రెండేళ్లు పూర్తి చేసుకున్న భక్తి టి.వి కి శుభాకాంక్షలు.
ఉషా కిరణ్ మూవీస్ సంస్థకు పాతికేళ్లు.
శ్రీవారికి ప్రేమలేఖ. ప్రతిఘటన. మయూరి. కోట. శ్రీకాంత్.
ఉషా కిరణ్ మూవీస్ వారికి నా శుభాకాంక్షలు.
ఈ నెల లోనే 10వ తేదీన ఈనాడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంది. తెలుగు చదవటం వచ్చి, ఈనాడు దినపత్రిక “అస్సలు” చదవని తెలుగువాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈనాడు వారికి శుభాభినందనలు. ఈ దినపత్రిక కొన్నివందల ఏండ్లు నడచు గాక.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా మొదటి సారి ప్రమాణస్వీకారం చేసినది సెప్టెంబర్ 1న. రేపటికి పుష్కరం పైన రెండు సంవత్సరాలు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారలను మెప్పించిన, ప్రధాని పదవి లో ఎవరు ఉండాలి అనే విషయం లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన, ఎక్కువకాలం ముఖ్య మంత్రిగా కొనసాగిన గుర్తింపు కలిగిన దశనుండి, హత్యాయత్నము, పదవీచ్యుతి, నిన్న మొన్న రాజకీయాలలోకి వచ్చిన వారితో శాసనసభలోనూ – వాంప్ కి ఎక్కువ హీరోయిన్కి తక్కువ వంటి వారలతో బయటా మాటలనిపించుకొనే స్థితి -విధివిలాసమంటే ఇదేనేమో.
ఇక, బ్లాగ్లోకం లో- గురుతుల్యులు, నిత్య యవ్వనులు శ్రీ చింతారామకృష్ణ గారి ఆంధ్రామృతం బ్లాగు ప్రధమ వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా పూర్తిచేసుకుంది.
వర్గాలు ఊ(సు పో)క
గత కొన్ని వారాలలో నా బ్లాగు నందు కొన్ని వ్యాఖ్యలు WordPress వారి పుణ్యమా అని, నా ప్రమేయం లేకుండానే చెత్తగా గుర్తింపబడి తొలగింపబడ్డాయి. నేను ఏ వ్యాఖ్యనూ తొలగించలేదని, మీ వ్యాఖ్య కనపడకపోతే అది WP వారి పనే అనీ సుహృదయులైన బ్లాగ్మిత్రులకు మనవి చేసుకుంటున్నాను. ( చంద్రబాబు లాగా కాదు, నా లాగానే)
వర్గాలు ఊ(సు పో)క
లంచగొండులైన ప్రభుత్వోద్యోగులు రెండు రకాలు:శాతవాహనులు, శాతకర్ణులు.
శాత-కర్ణి: మీ పని విజయవంతమైతే అతనికి ఎంత శాతం కమీషన్ ఇస్తారో చెవిలో ఓ ముక్క చెబితే మీ ఫైల్ ను ముందుకుకదిపేవాడు.
శాత-వాహనుడు: మీ పని విజయవంతమౌతుందో లేదో దేవుడెరుగు, ముందు తన పర్సెంటేజ్ ఇస్తేనే కాలు/చెయ్యి/పెదవి/ఫైలు కదిపేవాడు.
కొన్ని శాఖలలో వీరే “post-paid/pre-paid” గా చలామణి అవుతున్నారని వినికిడి.
వర్గాలు ఊ(సు పో)క