కాళిపూనికనొంది గౌరిగా రూపొంద
నీవెకారకుడవు, నీల కంఠ!
అన్నపూర్ణగగొనియాడనపర్ణాఖ్య
నానందమగునీకు ఆది భిక్షు!
పుట్టింటికేగి తాఁబూదియైనసతికి
ప్రాణముఁ బోసిన ప్రళయ కార!
సకలలోకములకుఁ సతియెదిక్కనుచును
రుద్రభూమిఁదిరుగు రుద్రుఁడీవు!
సతిసుఖమనయమ్ముపతికిముఖ్యమనియు
సతివిభవముగాంచి సంతసించు
ననియు బోధపరుపనర్ధాంగికినెటులో
నేర్పవయ్య నాకు సర్పభూష!