సింగరాయకొండ టు కావలి – 1

సింగరాయకొండ టు కావలి .

ఈ మధ్య చెన్నై నుంచి హైదరాబాదు వెళ్ళే అతివేగగమని( super fast express ) ఎక్కాను. సింగరాయకొండ దగ్గరికి వచ్చేసరికి, అక్కడ నుండి ప్రతి స్టాపు లోను ఎక్కే దిగే seasoners కనిపించారు. రోజూ ప్రయాణం చేయటం ఎంతకష్టమో అనుకున్నాను. ఈ నిత్యప్రయాణీకులకి రైలు జీవితంలో ఓ భాగమెమో అనిపించిం‍ది. లేదా జీవితానికి కొనసాగింపా అనిపించిం‍ది( Is it an extenstion to life? ). రైల్ లోనే ఒక చిన్న జీవితం, అక్కడి స్నేహాలు, అక్కడి పరిచాయలు అక్కడే .. తిరిగి ఇల్లు చేరినతరువాత ప్రయాణం చేసిన విషయం మర్చిపోయి – తిరిగి ఇంటి పనులలోకి దిగాలి. ప్రయాణం చేసాను – అలసిపొయాను అనేవాళ్లు – వీళ్లను చూసి అసూయపదతారో – లేక – ఈ నిత్యప్రయాణీకులు అలా అలసిపొయాను అని చెప్పి పడకేసేవాళ్లని చూసి అసూయపడతారో. మగవాళ్లే కాక చాలమంది ఆడవాళ్లు కూడ ఎక్కారు. వాళ్లు, వాళ్ల ఉద్యోగం వల్ల తద్వారా కలిగిన స్వేచ్చ వల్ల, ఈ అర్ధిక స్వాతంత్ర్యం వల్ల సుఖ పడుతున్నారో కష్ట పడుతున్నారో అడగాలనిపించింది ..

ఇందాక చెప్పినట్టు, వీళ్లకి రైలు లోనే ఓ మినీ జీవితం అప్పుడప్పుడు వీళ్లని చూస్తుంటే రైలూ లో ఇలా కూడ కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చా అనిపిస్తుంది. జడ వేసుకోవటం, గోరుచిక్కుడు కాయలు వలవటం, చెప్పాల్సిన క్లాస్‍కి ప్రిపేర్ అవ్వటం, బాస్‍కి సమర్పించాల్సిన రీపోర్ట్‍లు రాసుకోవటం, రాత్రికో మర్నాడు ఉదయమో కలవాల్సిన వాళ్లకి ఫోన్ చేసి ఫలాన టైం కి రమ్మని చేప్పటం ఇత్యాదులు. కొంచం అతి గా (అలోచించే) అలోచిస్తే నాకు.. వీళ్లలోఎవరైన.. ఇంకొన్ని అసాధారణ పనులు కూడ రైలు లో చేస్తారా అని అనుమానమొచ్చింది.. నా బోటి బద్దకస్తుడెవడైన – రైల్ యెక్కి గడ్డం గీసుకుంటాడా? ఏ స్త్రీ మూర్తి ఐన అట్లతద్దె ముందు రోజు గోరింటాకు తెచ్చుకుపెట్టుకుంటుందా? సౌందర్యపోషాణాప్రియులు face pack రైలు లో చేసుకుంటారా? ….
(దుర్)అదృష్టం కొద్ది .. ఇలంటి వాళ్లు ఎవరూ కనపడలేదు. కాని నా యెదురుగా కూర్చున్న ఒకావిడ నన్ను ఆకర్షించింది…అహ అహ.. అది కాదు.. నా చూపు ఆవిడపై మళ్లింది.. అహా అహా.. ఇది కూడ కాదు.. ఆవిడ చేస్తున్న పని, పని చేస్తున్న తీరు నన్ను నిలిపి ఆలోపింప చేసాయి. ( ఇది కొంచం బానేవున్నట్టుంది).ఆవిడ ఎదో హైస్కూల్ లో టీచర్‍గారానుకుంటా ఇంకోటీచర్గారితో కలసి సింగిల్ సీట్స్ లో ఎదురుబొదురు కూర్చున్నారు.. కాసేపు పిచ్చపాటి మాత్లాడిన తర్వాత .. ఈవిడ తన బాగ్‍లోంచి పేపర్ల కట్ట తీశారు. ఒక వైపు మాట్లాడుతూనే వున్నారు .. ఒక వైపు దిద్దుతున్నారు.. బిట్ పేపర్ దిద్దుతారేమో అనుకున్నను ముందు కాని – చూస్తె మైన్ పేపర్ కూడ దిద్దుతున్నారు.. సాధ్యమా.. ఆవిడ అవలీలగా పేపర్ తర్వాత పేపర్ దిద్దుతుంటె నాకు నమ్మ బుద్ధి కావటం లేదు.. నిజం గా సాధ్యామా.. ఈపాటికి నాకు – అవిడకి ఒక పేపర్ దిద్దటానికి ఒక్క నిముషం కూడా పట్టటం లేదని అర్ధమైంది. పిల్లలు ఏమిరాసారో ఆవిడ కచ్చితంగా చదవటం లెదు. చూస్తోందా? ఏమో? మరి ఒక వేళా సాధ్యమే అనుకున్న న్యాయమా? కాదనిపించింది..
ఒక్క నిముషం ఆవిడపైపు నుంచి అలోచించాను.. అప్పుడు దాదాపు యెనిమిదైందేమో.. ఆవిడ దిగాల్సిన ఊరు వచ్చేసరికి తొమ్మిది కావచ్చు..ఇంటికెళ్లేసరికి తొమ్మిదిన్నర.. అప్పుడు వెళ్లి వండుకోవాలి .. పిల్లలకి, మొగుడికిపెట్టి తను తినాలి.. పిల్లల్ని నిద్రపుచ్చి తను నిద్రపోవాలి, మళ్లా పొద్దున్నే లేవాలి.. ఒకవేళ మొగుడు గారికి నిద్రపట్టకపోతే అయన్ని నిద్రపుచ్చేపని కూడ..కాబట్టి కచ్చితంగా ఇంటిదగ్గరకుదరదు.. ఒప్పుకుంటా..కాని రైలు లొ సహోద్యోగినితో మట్లాడుతూ యధాలాపంగా దిద్దటం సబబేనా? ఇలా అలోచిస్తూ ఆవిడ అవధానానికి ఆవిడ వేగానికి ముగ్ఢుడనై ఆవిడవంక తేరిపారాజూస్తుంటె.. ఆవిడ నా అలోచనలని పసిగట్టిందో లేక నా చూపులని .. తప్పుగాఅర్ధంచేసుకుందోగాని .. నన్ను కొరకొరా చూసింది..తల వేరే వైపు తిప్పి – ఒక్క నిముషం ఆ విద్యార్థుల గురించి అలోచించాను.. వాళ్లకి తక్కువ మార్కులు వస్తే? వాళ్లు ఈవిడని అడిగితే? ఈవిడ “అదంతే” అంటే? .. తర్వాత తరగతులలో ఇలాంటి ఉపాధ్యాయులే ఇంకో ఇద్దరు తగిలితే? వాడికి..ఇలా తక్కువ మార్కులతో .. చదువు మీద విరక్తి కలిగితే? నేను ఎంతచదివినా మార్కులింతే అని వాడు చదవటం మానేస్తే? ఒక potential I.A.S Officer ఒక గుమాస్తాగా మిగిలితే?..ఇంకా .. ఒక బడ్డీకొట్టూపెట్టూకోనేవాడిగా సెటిల్ ఐతే?బ్రాహ్మీముహూర్తం లో ఏకాగ్రతతో దిద్దామనటం లేదు.. కాని .. ఖాళీ periodలో దిద్దవచ్చు కదా? చుట్టూ ఎవరితో మాట్లాడకుండా పిల్లలు రాసింది చదివి దిద్దచ్చు కదా? ..
ఏమో?…
***********

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s