సింగరాయకొండ టు కావలి – 2 (అమ్మ నాన్న ఓ ఐదేళ్లబ్బాయి )

సింగరాయకొండ టు కావలి  – 2
అమ్మ
నాన్న
ఓ ఐదేళ్లబ్బాయి

అదే రైలులో నెల్లూరు లో అనుకుంటాను ఓ కుటుంబం ఎక్కారు. తల్లి తండ్రి, ఒక ఐదారేళ్ల పిల్లవాడు. ముగ్గురు side berth మీద కూర్చొన్నారు , తల్లి ఓవైపు, తండ్రి ఓ వైపు, మధ్యలో పిల్లవాడు. కాసేపటికి రైలు ఆగితే ఇది ఏ స్టేషన్ అని అడిగాడు , పిల్లవాడు తల్లిని. ఆవిడ పెదవివిరిచింది నాకు తెలియదు అన్నట్టూ.. ఇంకా ఎంతసేపు పడుతుందనోయెన్నింటికి వెళ్తామనో అడిగాదు .. తల్లి మళ్లీ పెదవి విరిచింది. ( నాకు స్వర్గీయ పి.వి.నరసింహారావు గారుగుర్తొచారు.) పిల్లవాడు గడ్డంకింద చేయిపెట్టుకొని అలోచిస్తున్నట్టు కూర్చున్నాడు. తల్లిది తండ్రిది అదే ముద్ర. ముగ్గురూ మౌనంగా .. ఎవరి ఆలోచనలోవారు. కాసేపటికి తల్లి పిల్లవాడిని వేలితో మోకలిమీద కొట్టి , మొగుడి వైపు వేలుచూపి, తన మణికట్టు చూపింది.పిల్లవాడు తండ్రి వంక చూశాడు, తండ్రి cell phone ఇచ్చాడు. పిల్లవాడి చేతిలో ఫోన్‍లో తల్లి టైంచూసింది. పిల్లవాదు cell phone తొ ఆడుకోబోతే తండ్రి కోపంగాచూసి లాక్కున్నాడు. మళ్లీ పిల్లవాడి గడ్డం కింద చేయి.. కాసేపటికీ తండ్రి బాగ్‍లోంచి బిస్కట్లూ తీసుకొని తింటంమొదలుపెట్టాడు. తింటావా అని కొడుకుని అడగలేదు. ( కొడుకునే అడగని వాడూ భార్యని అడగడు కదా) పిల్లవాడు నాకు కావలని అడగలేదు.. బహుశః ఇంకో అరగంట ముగ్గురూ అలామౌనంగా కూర్చున్నారు. ఎదో స్టేషన్ వచ్చింది. తండ్రి బా‍గ్ తీసుకొని లేచాడు. వెనక పిల్లాడు .. వెనక తల్లి..దిగి వెళ్లిపోయారు .. వాళ్లు ముగ్గురూ యెప్పుడు మాట్ళడుకుంటారో నాకు తెలియదు..

నా ప్రశ్నలు:
౧. పిల్లవాడు చేసినతప్పు యేమిటి? వాడి ప్రశ్నలకు సమాధానాలు చేప్పకపోవటం న్యాయమా?
౨. తండ్రి కసురుకొని పిల్లవాడిచేతిలో ఫోన్ లాక్కోవటం న్యాయమా?
౩. భర్త/భార్య మీద కోపాన్ని పిల్లలమీద చూపించాల్సిందేనా? చిన్ని హృదయాలను కష్టపెట్టాల్సిందేనా?
౪. వాడు withdrawn అయ్యి(గడ్డం కింద చేయి, దీర్ఘాలోచన), మెల్లమెల్లగ అంతర్ముఖుడై(introvert) , ఎవరితో మాట్లాడక, ముందు ఫ్రెండ్స్ తో తర్వాత సమాజం తో కలవకుండా వుంటే ఎవరిది తప్పు?

***************

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s