సింగరాయకొండ టు కావలి – 3

సింగరాయకొండ టు కావలి .
మూడో ఘట్టం

నా బోగీ లో చీరాలలో దాదపు పదిహేను మండి ఎక్కారు. అందరూ కలిసి పెళ్లికో పేరంటానికో వెళ్తున్నట్టున్నారు. ముగ్గురు నలుగురు ఆడవాళ్లు .. నలుగురు పిల్లలు, ఇద్దరు ఇంటర్మీడీయట్ కుర్రవాళ్లు ఇద్దరు పెద్దవాళ్లు. అందరు ఎక్కగానే, అందులో ఒకాయన తన దగ్గరన వున్న మూడు టిక్కెట్లూ తేసుకొని , ఒక పెన్ పట్టుకొని వాళ్ల బెర్త్‍లు వెతకటం మొదలు పెట్టాడు. ( పాపం వాళ్లకి ౩ బోగిలలో వచ్చాయి సీట్లు). ఇంతవరకు బాగానే వుంది కానియండి, ఆయన ఒక కలం కూడా పుచ్చుకొని వాళ్లకు అలాట్ ఐన బర్త్ కనపడగానే టికెట్ మీద ఆ బెర్త్ ఎదురుగా ఒక టిక్ పెట్టుకుంటున్నాడు. నా దగ్గరకు వచ్చి ౩౨(32) మాది అండి అన్నడు. నేను ౩౨ నాది అండి, అని ఒక సారి ఆయన టికెట్ చూస్తే, వాళ్ల బెర్త్ ౫౨(52), ఐతే అప్పటికే ఆ టికెట్ మీద ఈయన పెట్టిన టిక్ మార్కులు, చెరిగిన ఇంకు ముద్దలతొ నంబర్స్ సరిగా కనపడకుండా పొయాయి. ఆయన అలా టిక్ ఎందుకు పెట్టుకుంటున్నాడో దానివల్ల ఉపయోగం యేమిటో నాకర్ధం కాలేదు. మొత్తానికి – దాదాపు – ఒక అర్ధగంటా అటూఇటూ తిరిగి, ( చేతిలో పెన్ను, టికెట్స్ పట్టుకొనే ) అటు వాళ్లని ఇటు , ఇటు వాళ్లని అటు సర్ది , చివరి సారి హాజ్అరు పలికించి నిద్రకు ఉపక్రమించాడు – ఏదో సాధించిన తృప్తితో.. ఆయన పడుకోబోతుంటే – వాళ్ల మరదలు అంది:
బావ అర్ధగంట నుంచి రైల్వేఆఫీసర్ మల్లె అటూఇటు ఓ పెన్నుపేపర్ పట్టుకుతిరిగావ్, ఒక్కళ్లకీ లోయర్ బర్త్ సంపాదించలెకపోయావ్, ఏంది నువ్వు చేసింది, ఇప్పటిదాక?
పాపం ఆయన ముఖం లో నెత్తురుచుక్కలేదు.

ప్రకటనలు

3 responses to “సింగరాయకొండ టు కావలి – 3

  1. అన్న
    భోగీ కదన్నా!! బోగీ

  2. భాస్కర్ గారు, ధన్యవాదములు. సరిదిద్దాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s