ఇంగ్లీషూ యు లివ్ లాంగా -కొనసాగింపు

ఇంగ్లీషూ యు లివ్ లాంగా -కొనసాగింపు

ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టిన రెండో రోజు, రెండిటప్పుడు , ఇద్దరి మిత్రులతో కలిసి లంచ్ కి వెళ్తూ, దారిలో కనిపించిన సీరియస్గా పనిచేసుకుంటున్న ఓ అమ్మాయిని “మిస్ కారేజా” అని అడిగా…ఆ అమ్మాయిని దాటి కొంచం ముందుకువెళ్లగానే పక్కవాడు అందుకున్నాడు..

పక్కవాడు : ఏంట్రా, ఆ అమ్మాయిని ఏంటి అడిగావ్?
నేను: మిస్ కారేజా అని అడిగాను.
పక్కవాడు : అది విన్నాను గాని, అంటే అర్దం ఏంట్రా?
నేను : ఏదోలే బాబూ, కారేజి తెచ్చుకుందా అని అడిగాను.
పక్కవాడు: ఓ, అదా, నేను ‘కన్యా గర్భమా?’ అని అడిగావనుకున్నా!
రెండోవాడు: ‘కన్యా గర్భమా?’ ఏంట్రా? వాడు గర్భం పోయిందా అని అడిగితే!!

నాకు తెలియకుండా ఇంగ్లీషు లో ఇన్ని శ్లేషలు మాట్లాడుతున్నందుకు నాకు ఆనందపడాలో, ఏడవాలో తెలియలేదు.

        *************************

రెండు మూడు వారలక్రితం,ఓ శుక్రవారం సాయంత్రం colleague (ఇది కొలీగా?కలీగా?)వచ్చి B.R ఇవాళ చేయనా మండే చేయనా అని అదిగాడు.
నేను చెప్పాను:
If you do B.R today BR today, you want B.R monday B.R monday ,అతనికేమర్ధమయ్యిందో నాకర్ధం కాలేదు కానీయండి, ఆయన O.K అని వెళ్లిపోయాడు.

5 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా -కొనసాగింపు

 1. ha ha…nice one!

  i think ur blog is not added to koodali, jalleda etc. do it ASAP 🙂

 2. బాసూ .. మీరు ఒక్క పేరడీ టపాకే హెచ్చరిక పెట్టారు అన్నం తినేప్పుడూ చదవద్దని – మీ టపాలన్నిటికీ పెట్టాలి ఆ హెచ్చరిక ..
  ఇంతకీ BR అంటే ఏంటి?

 3. కొత్తపాళీ గారు,
  ఆ టపాలో వికారపు శబ్దాలున్నాయని అలా రాసానండీ, మిగతావన్నీకూడా అంతే వికారంగా ఉన్నాయంటారా? 😦
  B.R అంటే పెద్ద ప్రక్రియ, అందుకే పేరు కూడా కుదిచ్చేశారు. మీకోసం కనుక్కుంటే Build Request అని చెప్పారు.

 4. పింగుబ్యాకు: ఇంగ్లీషూ యు లివ్ లాంగా -3 « ఊక దంపుడు

 5. మిస్ కారేజా … టూ గుడ్ అండి… అంటే ఇన్సేన్లీ గుడ్ అని..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s