తెఱచి రాజు

“తెఱచి రాజు” అని చూసి, ఎవరిదో పేరు, ఇంటి పేరు తెఱచి వ్యక్తి పేరు రాజు అనుకునే రోజులేమో. అలాంటి వాళ్లందరూ కూడ ఇప్పుడు “రాజు తెఱచి” లయ్యారు కాబట్టి, ఇదేదో ముసలి వ్యవహారం అని దాటవేయావచ్చు. తెఱచి రాజు అనేది చదరంగపు ఆట కు సంబంధించిన మాట. ఏదైనా బలగాన్ని కదిపి , అలా కదపటం తో వేరే బలగంతో ‘రాజు’ చెప్తే దానిని తెఱచి రాజు అంటారు. దీనికి ఆంగ్లభాషాసమర్ధకం Discovered Check ట. ఈ పదాన్ని ఒకప్పుడు విరివిగా వాడేవారనుకుంటా. ఈ పేరుతో నవలో కధో కూడా ఉన్నట్టు గుర్తు. ఒక వ్యక్తి తనపని తనుచేసుకుపోతూ, పనిలో పని ఎదుటి వాళ్లని ఇబ్బంది పెడితే ఇది వాడేవాళ్లు(?). ఇప్పుడెందుకిదంతా అంటారా? ఈ మాట వాడకపోయినా, కార్యాలయాలలో చాలామందిచేసేది ఇది కాదుటండీ?

5 responses to “తెఱచి రాజు

 1. నవల విశ్వనాథ వారిదనుకుంటా – ఇంటికెళ్ళి చూడాలి.
  చదరంగంలో సందర్భాన్ని సరిగానే చెప్పారు గానీ, వాడుకభాషలో అర్ధం అది కాదు – దాడి చేస్తున్నట్టు అవతలి వాడికి తెలియకుండా దాడి చెయ్యడం .. అన్నమయ్య కీర్తనల్లో “నల్లని మేని నగవు చూపుల వాడు” అనే దాంట్లో వస్తుంది “తెరచి రాజన్నట్టి దేవుడు” అని. అంటే ఈ వాడుక చాలా పాతదే అయి ఉండాలి.

 2. కొత్తపాళీ గారు,
  అర్ధమయింది, కీర్తన (విన్న) గుర్తు లేదు, ఒకసారి వింటాను.

 3. తోసిరాజు – కూడా చదరంగంలోనిదేనాండీ?

 4. రానారె గారు,
  తోసిరాజు – కూడా చదరంగంలోనిదే. ఐతే, ఆట లో అర్ధం కాక, ” నా మాట కాదన్నాడు”/ “నేను చెప్పింది కాదన్నడు” అనే అర్ధం లో వాడుతున్నారు

 5. తోసి రాజంటే ఒక కాయని చంపుతూ గడిలోకి వచ్చి రాజ నడం (ఛెక్). ఉయ్యాల తోసిరాజు అని కూడా ఉంది – ఓ భటుడు రాజుని వెనక్కి తోస్తూ ఆటకట్టించడ మది.

  నిన్ననే శ్రీపాదవారి వడ్లగింజల కధ చదివాను – తంగిరాల శంకరప్ప అనే చదరంగ ఉద్దండుడి గురించి మాగొప్ప కధలెండి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s