పన్ తరంగాలు

>>> కవులలో అతడు కిలిమంజారో కాంతామణి కనిపిస్తే మాత్రం వెకిలిమంజారో

>>> జనాలు రెండు రకాలు ‘వినదగునెవ్వరుచెప్పిన’ అనేవాళ్లు, ‘వినదగు never, చెప్పిన’అనేవాళ్లు.

>>> మా ఇంటి ఓనర్ అఖిలాండ్రేశ్వరి, అందరిని ఉతికారేస్తుంది.

>>> రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు

>>> breakfast కి ఓ ఉత్తరాది మిత్రుడి హిందీ అనువాదం భూకావట్.

>>> Technologistకి తెలుగు పదం సాంకేతిగాడు.

>>> అవధానాల్లో ప్రసంగాలు రెండే రకాలు ౧. అప్రస్తుత ప్రసంగాలు ౨. స్తుత ప్రసంగాలు

>>> పాపులేషన్ లో మూడొంతులు పాపులే.
        ^^^

11 responses to “పన్ తరంగాలు

  1. అయ్యా, అదరగొట్టారండీ. ఉత్తమమైనవి ఈ వరసలో! మిగతావి ఉత్తవని నాఉద్దేశ్యం కాదు సుమండీ!

    రిటైరవ్వకముందు ఇంటికి మూలపురుషుడు, రిటైరయ్యాక ఇంట్లో మూలపురుషుడు
    పాపులేషన్ లో మూడొంతులు పాపులే.
    అవధానాల్లో ప్రసంగాలు రెండే రకాలు ౧. అప్రస్తుత ప్రసంగాలు ౨. స్తుత ప్రసంగాలు

    మీ పాత జాబులూ ఎంతో బాగున్నాయి. “మిస్స్ కారేజా”, “ఓటవర్లు” (ఓటు వరులు) బాగా నచ్చాయి
    మీ పేరేంటో రాయలేదు.. శ్లేషావతారమా? పన్‌డరి నాథా? పేరేదైనా మీరు పన్‌డితులే!

    ఇలాగే పన్నులు రాలుస్తారని / పన్‌డిస్తారని ఆశిస్తూ!!

  2. Technologist సాం’కేతిగాడై’తే, Platinum బంగారక్క కాకపోతుందా? డిగ్రీ రోజుల్లో ఇలాగే పాండిత్యం ప్రదర్శిద్దామని, పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్న ఒక సందర్భంలో, “సంసారంలో ఒడి-దుడుకులు తప్పవు, కొత్త సంసారంలో మరీనూ” అని, అక్షింతలు వేయించుకున్నాను. 🙂

  3. ’ఫన్’ టాస్టిక్

  4. వాహ్వా! వాహ్వా!

  5. చదువరి గారు, వీవెన్ గారు, కొత్తపాళీ గారు,
    ధన్యోస్మి.

    చదువరి గారు:
    కొన్నాళ్ళు అనామకుడిగానే ఉండనిద్దురూ. మీరిచ్చిన ఐఛ్చికాలు బాగున్నాయి. శ్లేషావతారమూర్తి అని పెట్టుకోమంటారా? మీరు బ్లాగ్ పదకోశం చాలాబావుంటుంది. మీ రాజకీయ ‘టపా’కాయలు కూడా బాగున్నాయి.

    రానారే గారు :
    బంగారక్క ప్రయోగం బావుంది.

    తెలుగు అభిమాని గారు, వికటకవి గారు, రాధిక గారు:
    ధన్యవాదములు.

  6. పింగుబ్యాకు: పన్ తరంగాలు -౨ « ఊక దంపుడు

  7. పింగుబ్యాకు: పన్ తరంగాలు -౩ « ఊక దంపుడు

  8. హాయిగా..హాయిహాయిగా…ఉన్నాయండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s