చిత్ర పుత్రోత్సాహము

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ఎపుడా
పుత్రుడు హీరో అగునో
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, ‘నటులా’
పుత్రుని నటనను బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు “ఆడున్
పుత్రుని సినిమా వందని”
పత్రికలు టీవీలుపేల,  ప్రాప్తము సుమతీ!

పుత్రోత్సాహమె తండ్రికి?

చిత్రమువెనుదిరిగివచ్చి చీకటిబడకే

పుత్రుడివలెమూలనుబడ
పుత్రోత్సాహంబు పాడు బొందర సుమతీ!

పుత్రోత్సాహమధికమై
పుత్రుకు పుట్రేపు బెట్టి -పొంగగ, హీరో
పాత్రిచ్చి తీయ సినిమా-
పాత్రొచ్చినచేతికి- తన పాపమె? సుమతీ!

ప్రకటనలు

11 responses to “చిత్ర పుత్రోత్సాహము

  1. బావుందండి, హాయిగా నవ్వుకున్నాను.
    సోమ శంకర్

  2. పుత్రోత్సాహము వారికి
    చిత్రము మనినా కలుగదు, చిత్రము! ప్రజలా
    పుత్రుని కభిమానమునన్
    ఛత్రము పట్టిన, కలుగును చప్పున సుమతీ!

  3. చదువరి గారూ .. తేటగీతి కష్టమంటూనే ఇక్కడ అలవోకగా కందాలు పండిస్తున్నారు .. ఊకదంపుడుగారి పంచరత్నాలు ఒక తమాషా ఐతే .. దానిమీద మీ టేకు అదిరింది.

  4. కొత్తపాళీ గారు,
    సుడిగాలి పర్యటనకు ధన్యవాదములు. చదువరి గారు కందము పండించటమే కాదు, ఆ కాస్త కందం లో శ్లేష కూడా వేశారు.
    చదువరి గారు,
    మీ పద్యం పై పద్యాలకి తలమానికం గా ఉంది.

    సొమ శంకర్ గారు, శ్రీరామ్ గారు,
    ధన్యోస్మి.

  5. ఊదం గారి పద్యంలోంచి నాలుగైదు మాటలను మార్చితే సరిపోయింది, గభాలున పద్యం తయారై పోయింది.
    మెచ్చినందుకు కృతజ్ఞతలు.

  6. క్యా బాత్ హై!! చదువరి గారి శ్లేష చాలా బాగుంది.

  7. క్యా బాత్ హై!! చదువరి గారి శ్లేష కూడా చాలా బాగుంది.

  8. పింగుబ్యాకు: మా కందాలు – మాకందాలు « ఊక దంపుడు

  9. ఈ పోస్టు ఎప్పటినుంచో ఉన్నా నేను ఇవాళే చూసేను. నాకు కంద పద్యాలు చాలా ఇష్టం. బ్లాగుల్లోకంద పద్యాలని చూసి మురిసి పోతు న్నాను. నేను కొత్తగా బ్లాగు పెట్టాను.అంచులో సరదాగా నేను రాసుకునే్న కంద పద్యాలు (శతకమే మకుటం లేకుండా) ఉన్నాయి. ఎక్కువగా సరదాగా చదివి ఎంజోయ్ చేయ్యడానికి రాసినవే.కంద పద్య ప్రియులని ఆహ్వనిస్తున్నాను. బ్లాగ్– http://www.apuroopam.blogspot.com…పంతుల గోపాలకృష్ణ

  10. గోపాలకృష్ణగారూ, నెనరులండీ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s