కావుము మము కరివదనా!!!

అంకముజేరి శైలతనయాస్తన ధుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ కబళింపబోయి యా

వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వే మృణా

ళాంకురశంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్

(అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోనిది)

6 responses to “కావుము మము కరివదనా!!!

 1. గురువు గారు,
  సంస్కృతం లో ఉందని తెలీదండీ. పెద్దలనడగాలి. గణనాధుని కొలుస్తూ, అర్ధనారీశ్వరతత్వాన్ని కూడ చెప్పే ఈ పద్యం నాకు ఇష్టం.

 2. ఒడిని జేరి పార్వతీదేవి చనుబాలను (నోటితో) తాగువేళ బాల్య చాపల్యపు చేష్టగా తొండముతో అటుపక్కనున్న స్తనాన్నీ కబళించబోయి, ఆ పక్క స్తనమును కానక, శివుని హారము(పాము?)ను చూచి, (వే … అంటే ఏమిటో మీరే సెలవివ్వాలి !!?) గజముఖుని కొలిచెదను – అభీష్ట సిద్ధికై!

  వే …. ??
  మృణాళము – తామరతూడు
  అంకురము – మొలక, చివురు
  శంకను అంటెడు …

  దయచేసి ఇదేమిటో చెప్పండి మాస్టారూ.

 3. వే (p. 1224) [ vē ] vē. [Tel.] pron. Same as వేయి. (q. v.) adj. Thousand, సహస్రము. Many, అనేకము. వేమారులు many times. adv. Quickly , speedily, శీఘ్రముగా. “దేవాన్వితంబైన హర్మ్యంబువేసొచ్చి.” G. ii. 80. “రథమువేకొని పొమ్ము.” DRAyo. 127. “వినినపఠించిన వేవిధముల.” M. XV. ii. 143. వేగంటి or వేగన్నులసామి vē-ganṭi. n. Lit. the thousand-eyed; a name of Indra. ఇంద్రుడు. “దీనిగనుగొన్న వేగంటి దేవరకును, వెచ్చనిట్టూర్పు పుక్కిట వెడలకున్నె.” R. vii. 112. వేచుంగులపాగ vē-ṭsungula-pāga. (వేచుంగులు+పాగ.) n. The serpent called శేషుడు. Lit. one who has a thousand-folded turban. వేవెలుగు or వేవెలుంగలదొర vē-velugu. n. The sun, సూర్యుడు. “వేవెలుంగుల దొరజోడు వేవెలుంగు.” A. i. 22.

 4. రానారె, మృణాళాంకురము అంటే తామర తూడు. ఇవి ఏనుగులకి చాలా ప్రీతి. మరి గజవదనుడు కదా, అందుకే ఆయనకూడా ఆ పాముని తామరతూడేమో అనుకుని పట్టుకున్నాట్ట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s