‘ప్రో’టీన్లు-విటమిన్లూ

రానారె గారు ఇటుగావెళ్తూ అక్కడక్కడా గట్టిగింజలు కనిపిస్తున్నాయన్నారు. అప్పటి నుంచి బ్లాగాత్మారాముడు ఆమాట అపనేయము కాదని అతలాకుతలం ఐపోతున్నాడు. అందుకని, నా”బ్లాగోనెసంచి” లో మరికాస్త ఊక కలుపుతున్నాను.

[హెచ్చరిక: మొదటి వాక్యం చదివి, మిగతా టపా చదవాలో వద్దో నిర్ణయించుకోండి.]

ఓ సాయంత్రం పూట ఇందిరాపార్కు అని పిలవబడే అరుణ కాంతి ప్రదేశం లో , ఏ ఆడపిల్లనైన ఇట్టే బుట్టలో పడేయగలను అనుకొనే ఓ వారవనితాజనతాఘనతాపహారి, ఏ మగాడినైనా చిటికెలో పడవేయగలిగిన అస్తినాస్తివిచికిత్సాహేతుశాతోదరి, ఒకరిఒకరు అప్పుడే పరిచయమై మాట్టాడుకోసాగారు. ఓ ఐదు నిముషాల తర్వాత, చీకట్లు క్రమ్ముతుంటే, నల్లని వాడు, పద్మనయనమ్ములవాడు ఉన్నాడేమోనని పొదలమాటున వెతికి, మన్నే గానీ మన్నుతినేవాడు లేడని నిర్ధారించుకొని సరససల్లాపాలలో సెటిలయ్యారు.

ఆమె: ఇంతకీ మీ దేహ ధారుడ్యానికి కారణం చెప్పారు కాదు.

ఆతడు : టీన్సు-ప్రోటీన్సు, అది సరే గాని, మీ సౌందర్య రహస్యం ఏమిటో?

ఆమె: ఆఁ…విటులూ-విటమిన్లూ!!

13 responses to “‘ప్రో’టీన్లు-విటమిన్లూ

 1. బాగుంది…కాదు కాదు …బహు బాగుంది. వారవనితాజనతాఘనతాపహారి, అస్తినాస్తివిచికిత్సాహేతుశాతోదరి – అన్న పదాలు అర్ధమైనట్లే ఉన్నాయి కాని అర్ధం కాలేదు. టపా శీర్షికలో ప్రో అన్నదానిని హైలెట్ చేసారు. దానికి ఏమైనా అర్ధముందా???

 2. నువ్వుశెట్టి బ్రదర్స్

  mastu mastu mastu.

 3. ha 100 🙂
  మల్లాది గారు చూస్తే వచ్చే కధలో వాడుకుంటారేమో 🙂

 4. విటులు…విటమిన్లు అని రాసారు కదా…..”ప్రో” అంటే….వేశ్య కి ఆంగ్లమేమో…….

 5. మొదటి వాక్యాన హెచ్చరిక చూసీ మిగతా టపా అంతా చదివినందుకు మీరు గింజల్లేకుండ దంపేసిన ఊక మొహంనిండా పడి ఉక్కిరిబిక్కిరైపోయింది.
  ఈ పదాల అర్థం తెలుసుకోడానికి మళ్ళీ ఓసారి చదవల్సిందే 🙂

 6. రాజు సైకం గారు,
  అస్తినాస్తివిచికిత్సాహేతుశాతోదరి :: ఈ పదబంధం హర్ష నైషదం లోనిది. శ్రీనాధుల వారు తెనిగిస్తూ, తన పద్యంలో కూడా ఇదేవాడారు.
  ఇక అర్ధం ఉన్నదో లేదో అని సందేహం కలిగించే నడుము కలది అని.

  వారవనితాజనతాఘనతాపహారి :: దీని గురించి కొత్తపాళీగారు చాలా వివరంగా తెలిపారు. ఇక్కడ.
  కనపడకపోతే ‘An Extempore Poem’ కోసం వెతకండి.
  నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, పొదలమాటున .. ఇవి పోతనగారి భాగవతం లోని పద్యంలో మాటలు.
  ఇక ‘ప్రో’టీన్ల గురించి, నేను ఒక ఇంగ్లీషు ముక్క ముక్కితే, అందులో నాకు తెలియని శ్లేషలొస్తాయని ప్రియమైన నీకు గారు మరోసారి ఋజువుచేశారు. పోషకాహారాలలో ఉండేవి అనే అర్ధం ( ఆంగ్ల వర్ణక్రమం: protiens ) కాక, pro-teens “కౌమారీ పక్షపాతి” అనే అర్ధం రావాలని విరిచాను. అంతే.
  విటులు అంటే, ఆ వారవనితలదగ్గరకి వెళ్లేవాళ్లు ( వెళ్లని వాళ్లు అవిటులు కాదు.)
  ఇక అరుణ కాంతి ప్రదేశమంటే, ఆ సూర్యాస్తమయవేళ, ఎఱ్ఱని సూర్యకిరణాలు పడుతున్న ప్రదేశమని చెప్పుకోవాలి.

  @teresa గారు,
  ఆ గింజలు ఈ క్షేత్రం (‘ web site’) లో నాటటానికి పేటెంట్ లేదండీ. 😦 చూద్దం మీ ప్రోత్సాహం తో నిజంగా గింజలు బడతాయేమో

  @కొత్త పాళీ గారు,శ్రీరామా, సోదరులారా,
  ధన్యవాదములు

 7. “విటులు అంటే, ఆ వారవనితలదగ్గరకి వెళ్లేవాళ్లు ( వెళ్లని వాళ్లు అవిటులు కాదు.)”

  హహహాహీహీహీహూహూహూ….మీ చుట్టుపక్కలవాళ్ళు మీతో ఎలా వేగుతారండీ బాబూ…మరీ ఇంత కొంటెతనమా… 🙂

 8. ప్రొ టీన్స్ అంటే టీన్స్ లో ప్రొఫెషనల్స్ అని అనుకున్నాలెండి!

 9. దంపుడుగారు,
  టపాకి వివరణ కూడా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
  చాలా బాగుంది.

  ప్రియమైన నికు గారి బుద్ధికి రెండో పక్క చాలా పదునే.. 🙂

 10. @రాకేశ్వర గారు,
  స్వాగతం. టపాలు నచ్చినందుకు నెనరులు.
  అన్నట్టు సిద్దంగా ఉండండి, చదువరుల గురులఘువుల టపా లో మీ వంతొచ్చేస్తోంది.
  @శ్రీరాం గారు.
  భరించరండి. గమ్మునుండు అంటారు. ఐనా నేను కూడా ఎక్కువ మాట్లాడనులెండి.
  @చదువరి గారు,
  మరి ‘అరుణ కాంతి ప్రదేశం’ అంటే ఏమనుకున్నారో?

 11. చాలా ఆలస్యముగా వచ్చాను. అయితే ఏ, ఇంకా ఆ హాస్యం తాలూకు నవ్వులు వినపడుతూనే ఉన్నాయి. అదిరిందిపో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s