మీ టపా టపాకట్టిందా?

మీ టపా ‘టపా’కట్టిందో లేక బతికి బట్టకట్టిందో తెలుసుకోవాలంటే:

ఇచ్చట, ఇచ్చటన్ మరియు నిచ్చట చూడుడి వేగిరమ్ముగా
ముచ్చట గొల్పుబ్లాగులును ముచ్చెమటల్‍కలిగించు వ్యాఖ్యలున్
రచ్చని పించుబ్లాగులును రక్తిని గూర్చు టపాలువ్రాయనే
ర్వచ్చురొ! ఖ్యాతినొంద సులభమ్ముగ,అంతర జాలవేదిపై!

15 responses to “మీ టపా టపాకట్టిందా?

 1. ఊక దంపుడు గారు బాగుంది, నేను మీనుండి చూసిన మొదటి వృత్తం. నాలగవ పాదం లొ యతి మైత్రి కుదిరిందా సందేహము వృత్తాలలొ యతి పాటించేటప్పుడు హల్లుతో ఉన్న అచ్చు కి మైత్రి పాటించక్కరలేదా? కొన్ని పద్యాలు చూశాను వాటి లొ కుడా హల్లుతో ఉండే అచ్చు మైత్రి పాటించలేదు. అజ్విశిష్టాక్షరము అంటే ఏమిటో తెలిపగలరు

 2. బ్లాగేశ్వరా (మీ అసలు పేరెంటండీ బాబూ),
  హల్లులు యతి మైత్రి పాటించినప్పుడు వాటితో వచ్చే అచ్చులు కూడా మైత్రిని పాటించాలి. ఉదా. జా, చ లకి మైత్రి ఉంటుంది కాని జా, చీ లకి ఉండదు. నిన్ననే నాకు ఈ అనుమానం వచ్చి వాగ్విలాసము రాఘవగారిని అడిగి తెలుసుకున్నాను..

 3. @గిరి గారు , నాపేరు గూర్చి ఇక్కడ చూడండి. http://groups.google.com/group/telugublog/browse_thread/thread/5bafc280f4ccfe55#

  అసలు విషయం…. నేను కొన్ని వృత్తాల పద్యాలలొ యతి హచ్చు మైత్రి పాటిచి అచ్చు మైత్రి పాటించకుండా ఉండడం చూశాను. యతి మైత్రి లొ చాలా చాలా రకాల మైత్రి లు ఉన్నాయని ఈ మధ్యనే తెలిసింది.

 4. బ్లాగేశ్వరా!

  యతుల గురించి పరిశీలించగల జ్ఞానము నాకు లేదు గానీ, పద్యం మాత్రం చాలా బావుంది. పద్యాల గురించి నీ దగ్గర చాలా నేర్చుకోవాలి సుమా!

  ప్రసాదం

 5. ఊదం గారు,

  మీరిలా పద్యాలతో ఆడుకోటం చూస్తుంటే, నేర్చుకోవాలన్న ఉత్సాహం రోజురోజుకీ పెరుగుతోంది. అలానే సందర్భోచితంగా మీ పద్యాల్ని వదలండి.

 6. బ్లాగేశ్వర గారు,
  అవునండీ,అచ్చు మైత్రి పాటించాలి. చివరినిముషపు మార్పుల్లో నెరసు దొర్లింది. సరిదిద్దాను చూసి చెప్పండి.

  ఇంకో ఒకటి రెండు తప్పులున్నాయని అనుమానము. నా మొదటి బ్లాగు వృత్తం ఇక్కడ చూడండి. అజ్విశిష్టాక్షరము గురించి తెలుసుకొని చెబుతాను.
  ప్రసాదం గారు, నెనర్లు.
  వికటకవి గారు, మీకు ఇలా ఊరించటం అలవాటేగా! ఆడుకోవటమేమీ లేదు.. చూడండి ఒక్కో తప్పు బయటపడతాయి.

 7. మీ పద్యాపాటవం చాలా బాగుంది. అభినందనలు.

  ఇందులో నుంచి ఒక ఆణిముత్యం లాంటి ఒక జాబుకి (రాకేశ్వర రావు గారి బ్లాగ్విజయానికి పది ఉపాయాలు లంకె చూపించినందులకు కృతజ్ఞతలు.

 8. బావుంది మీరు రాసింది. చివరి పాదంలో వకి, భకి మైత్రి వచ్చేలా సవరించారు కూడా..

  మొదట చదివినప్పుడు ముచ్చెమటలు పట్టాల్సిన వ్యాఖ్యలేముంటాయిలే అనుకున్నా. మరి మీరు పెట్టిన మూడవ లంకె (బ్లాగ్విజయానికి పది ఉపాయాలు) చదివానా, చమట పట్టించే విషయమొకటి గమనించా.

  గిరి పేరుతోనే (నా సాలెగూటి హైపర్ లంకె లేదు నయం)ప్రవీణ్ గార్లపాటితో ఎవరో వ్యాఖ్య-ఘాతాలకి దిగారక్కడ..ఇదెక్కడి గొడవరా బాబు అనుకున్నా!

 9. అప్పుడెప్పుడో సీబీరావు గారు నన్ను నువ్వు చదువరివైతే తెగ రాస్తున్నావేంటి అని గద్దించారు. మీ బ్లాక్కు, మీ రాతలకూ కూడా పొంతన కుదర్లేదు, మరి.
  పద్యమూ బాగుంది, రాకేశ్వరుని పేజీ బాగుంది.
  గిరి గారూ, ఆ గిరి మీరేననుకున్నా! 🙂

 10. Giri గారు, చదువరి గారు:
  నేనున్నూ ఈ గిరి గారే అనుకున్నా
  అప్పుడు సమ్మర్ సీజన్ లెండి… 🙂

 11. గిరి గారు, నెనరులు. మీరు పాతతెలుగు సినిమాలు చూసికూడ పద్యాలు రాయాలని ఆకాంక్ష.
  చదువరి గారు, మీరు భయపడ వద్దు. యధాశక్తి ఊక కలుపగలవాడను.

 12. మీ మాట ప్రకారం పాత తెలుగు సినిమా మిస్సమ్మ మీద ఒక చిన్న ప్రయత్నం చేసాను. వీలున్నప్పుడు చదివి మీ అభిప్రాయం తెలియజేయంది. నెనరులు.

 13. బాగుంది మీ ఉత్పలమాల.
  మీరు జాతోస్పియర్ నుండి వృత్తోస్పియర్ కి దూసుకుపోగా.. నేను భావకవిత్వానికి జారిపోయా !

  అభినందనలు!

 14. రాకేశ్వర గారు,
  భావకవిత్వం లోకి ‘జారి’ పోవటం సామాన్యమైన విషయం కాదు.. ఆస్వాదించగలగాలి కానీ ఆ మత్తే వేరు..ఐనా అప్పుడప్పుడు వృత్తాలు, జాతులు కూడా రాయమని మనవి.

 15. అజ్విశిష్టాక్షరము = అచ్ + విశిష్ట + అక్షరము (జశ్త్వ,సవర్ణదీర్ఘసంధులు) 😛

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s