తూగులయ్య పదాలు -౨

ఇది రెండో వాత, అదే.. విడత.

పాత గాయపు మాన్పు
కొత్త కైతల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

పాత గాయము మాన్పు
కొత్త కోర్కెల కాన్పు
నిండు బాటిలు తేన్పు
ఓ తూగులయ్య!

శుక్రవారపు రాత్రి
చుక్క చుక్కకు ఆర్తి
చుక్క లెంచును నేత్రి
ఓ తూగులయ్య!

తెలుగు మాటలు నాంచు
తాగి యాంగ్లము దంచు
గొంతు వేమన కంచు
ఓ తూగులయ్య!

నేలనిలచి “నో”యను
ఫ్లైటున వడి దెమ్మను
రోమునతడు రోమను
ఓ తూగులయ్య!

రద్దు కోరుచు నరచు
నెగ్గి నంతనె మరచు
బెల్టు షాపుల దెరచు
ఓ తూగులయ్య!

సీత జాడను దెలిసి
కోతు లన్నియు దనిసి
ద్రావె దండుగ గలిసి
ఓ తూగులయ్య!

సుధలు పుట్టిన దెంత
దివిన జాలుట వింత
కలిపిరే”ఇది” కొంత
ఓ తూగులయ్య!

9 responses to “తూగులయ్య పదాలు -౨

 1. Much better 🙂

  best one –
  తెలుగు మాటలు నాంచు
  తాగి యాంగ్లము దంచు
  గొంతు వేమన కంచు
  ఓ తూగులయ్య!

  does not fit meter –
  నేలనిలచి “నో”యను
  ఫ్లైటున వడి దెమ్మను
  రోమునతడు రోమను
  ఓ తూగులయ్య!

 2. గురువు గారు,
  ధన్యోస్మి.
  నాకు ఎందుకో
  శుక్రవారపు రాత్రి
  చుక్క చుక్కకు ఆర్తి
  చుక్క లెంచును నేత్రి
  ఓ తూగులయ్య!
  నచ్చింది.
  ఇక్కడ వీడు బుడ్డి మీద బుడ్డి చివరిచుక్కలొంపుకుంటూ Golden drops అంటూ తాగుతూఉంటే, ఇంటావిడ, పనిఅంతా చక్కబెట్టి తోచుబడికాక నక్షత్రాలు లెక్కబెట్టుకుంటుంది.
  ప్రాస చెడినా కూడా అలానే ఉంచాను.

  నేలనిలచి “నో”యను
  ఫ్లైటున వడి దెమ్మను
  రోమునతడు రోమను
  ఓ తూగులయ్య!
  4+2+4 ‘తూగు’లో వ్రాయటానికి ప్రయత్నించాను.మార్చగలనేమో చూస్తాను.

  శ్రీరామా,
  నెనరులు.

 3. కొత్తపాళీ గారు,
  మీ ఓపికకి జోహారులు, ప్రతి పద్యబ్లాగరు వద్దకీ వెళ్ళి వ్యాఖ్య చదవమని చెప్పారు. ‘word press’ వాడు మీ వ్యాఖ్య ‘spam’ అనుకున్నాడు, మొదట గిరి గారి పేజీ లో చదివి పిదప నా ఎకౌంట్ లో చూశాను.

 4. ఊకదంపుడుగారు,

  మీకు నచ్చిన తూగులయ్యపదమే నాకూ నచ్చింది. మీరు చెప్పేదాక ప్రాసచెడిన సంగతికూడా గమనింపుకురాలేదు. వేగంగా రాస్తున్నారు. తాగి తత్వాలు చెప్పడమనేది తూగులయ్యకు తొలిసుక్కతో పెట్టిన విద్య అంటారుకదా, మరి మొదలెట్టేస్తున్నాడా?

 5. బాబోయ్ ఇంత మాహా సాహిత్యం పండుతుంటే,
  నేనింత కాలం ఎలా మిస్సయ్యిపోయాను?
  ఆఃసమ్

 6. నాకు మొదటి వాత ఎక్కడా కనిపించట్లేదు….

 7. పింగుబ్యాకు: తూగులయ్య పదాలు-౩ « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s