టంగు తెగింది

గోటంగుక్కినపేనువోలె,బెదురుం‍గూర్చొండనాసక్తితో
నోటంగుక్కినఆంగ్లపద్యమునొ, తానోసూక్తినోగ్రక్కగాన్
చాటింపేసియెవార్తగానియరె; “మా చంటోడు విజ్కిడ్డ”నే;
మాటైనా తెనుగందు పల్కరుముఖమ్మంటాంగ్లమైస్కాంతమై

ఈ పద్యం పూర్తయ్యేటప్పటికి, కాదు కాదు మొదట్లోనే టంగు తెగింది. చూడండి.

గణ, యతి ప్రాసలు చెల్లకుంటే, దుష్ట సమాసాలుంటే .. కిట్టని సంధులుంటే చెప్పండి.

9 responses to “టంగు తెగింది

 1. ఉ.సూటిగ వొక్కమాట వినసొంపుగ పల్కగలేరు వీరు యే
  ఆటలనాడలేరు మనభాషను నేర్వరు నేర్పబోయినన్
  “కూటికి భాషయెట్లు [మాతృభాష] పనికొచ్చును? ఆంధ్రము తిండిబెట్టునా?
  మేటిగ వుండగోరు మము మీరలు క్రిందకు ద్రోసివేతురా
  వోటమి నోర్వనేర”మని పోరెడివారిని మార్చుటా? వృథా!

 2. ఊకదంపుడు వరేణ్యా, పద్యం బాగుంది గానీ వొక సంధిదోషం మాత్రం కానవచ్చింది: బెదురున్ + కూర్చొండ = బెదురుంగూర్చొండ.

 3. గణ, యతి ప్రాసలు అన్ని బాగా కుదిరాయి..ఇక దంపుడు పులి మీరు.

  వార్తగానియరె మరియు ముఖమ్మంటాగ్లమైస్కాంతమై రెంటిని కొంచెం విశదీకరించమని మనవి..

  నా జోడింపు ఇక్కడ చదవండి..

 4. “మాచంటివిజ్కిడ్డ”నే;
  U UxI UUI U
  x వుండవలసిన చోట ఒక అక్షరం లేదు.
  మా చంటోడు విజ్కిడ్డ నే
  అంటే సరిపోతుంది.
  అహ్ నేను కూడా సవరణలూ సూచనలూ ఇచ్చేస్తున్నా.. వావ్…

 5. నాకు పద్యం పెద్దగా అర్థంకాలేదనుకోండి…

 6. రాఘవ గారు, రాకేశ్వర గారు, గిరి గారు
  నెనరులు,మార్పులు చేశాను.
  రాకేశ్వర గారు
  మీకూ నాకూ పద్యం అర్ధం గాకపోవటం లో పెద్ద వింతేమీ లేదు.పద్యం లో టంగు, నోసు, ఇయరు ఐసు అన్న పదాలని ఇరికించటానికి పడ్డ వృధా ప్రయాస ఇది. అందువల్ల పద్యం లో పదాలే ఉంటాయి.
  అందుకొని మిత్రులు మంచి పద్యాలు చెబుతున్నారు చూడండి.

 7. మేష్టారు టంగు తెగడమంటే ఏమిటి??????????

 8. గిరి గారు,
  ముఖమ్ము-అంట-ఆంగ్లము-ఐస్కాంతము-ఐ. ఆంగ్లానికి ఆగ్ల మని పడింది. దిద్దాను.

  బ్లాగేశ్వరా,
  ఈ టపాకి ఆ పేరు ఎంచుకోవటానికి ‘టంగు తెగింది’ అంటే ఎంటో తెలుసుకోవాలని ఉండటం కూడ ఒక కారణం. వాడుక బట్టి చూస్తుంటే, “తల ప్రాణం తోకకి వచ్చింది’ కి సారూప్యం ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానిజాలు రానారే గారే చెప్పాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s