సిగ్గేల?

               పేరడీ??

          హగ్గే హాటౌ చిట్కా
         రగ్గేలశిశిరపురాత్రి రమణియె బ్రోవన్
         దగ్గేలదగ్గరౌమన
         సిగ్గేలసిసలుమగనికి సిరిసిరి మువ్వా?

8 responses to “సిగ్గేల?

 1. శివుని స్తుతిస్తూ మీరు రాసిన సీసపద్యం చాలా బావుంది. నాలుగవ పాదంలో యతి/ప్రాస యతి ఒక్కసారి చూడండి, నాకు అనుమానంగా ఉంది.

 2. బ్లాగేశ్వర గారు,
  శ్రీ శ్రీ “సిగ్గేల భావకవికి” అన్నారు. ఇదే పద్యం లో ముగ్గేలచార్మినార్ ముంగిట, విగ్గేల కృష్ణశాస్త్రికి అని వస్తుంది అని గుర్తు.
  పూర్తి కందపద్యం నా దగ్గరలేదు. రాకేశ్వర గారికి కాని కొత్తపాళీ గారిని కాని తెలిసిఉంటుంది. అడిగి చెబుతాను.

  గిరి గారు,

  “అర్ధనారీశుపై నమిత భక్తి”

  మీరంటున్నది
  ఇక్కడేనా?

 3. నాకో మెయిలు పంపండి. పబ్లిగ్గా లెక్చర్లివ్వటం ఇష్టం లేదు.

 4. నేనన్నది “వాసుదేవుడు గాడు వృషభ మూర్తి” గురించి – మీరు చెప్పిన తర్వాత చూస్తే “అర్ధనారీశుపై నమిత భక్తి” లో సరైన సంధిలేదేమో అనిపిస్తోంది. గమనించగలరు.

 5. గిరి గారు,
  మార్చాను చూడండి.
  సీ. తలపైని కరముంచ తలపోయ డీతడు
  మోహినీరూపంపు మోజు లేదు
  వానియుదరమందు వసియింప మనబోడు
  విష్ణుమూర్తియె గాడు వృషభ మూర్తి
  గరళము నిల్పుమా కంఠమందనబోడు
  అమృతమ్ము ద్రావగ ఆశ లేదు
  అమ్మజేరగబోవ అడ్డుగా తారాడు
  అర్ధనారీశుపై యమిత భక్తి

  ఆ. ఫాలనేత్ర!సాంబ!పన్నగ భూషణ!
  సోమ! స్థాణు! ఆది శంకర! ఈశ్వర!
  భక్తవత్సలా!శుభంకర! మామిత్ర
  కేసరికొసగుమయ కోరు వరము!.
  కొత్త పాళీ గారు,
  నెనర్లు. ఒక్కటొక్కటిగా సందేహాలు పంపుతాను. వీలు చూ(చే)సుకొని తీర్చగలరు.

 6. ఇప్పుడు బావుంది..

  మొదటి సవరింపులో నాకు మటుకు గాడు/కాడు బదులు కాదు ఉచితమనిపిస్తుంది (వ్యక్తిగత అభీప్రాయమే).
  రెండవ సవరణకి నేననుకున్నది – “అర్ధనారీశుడందపర భక్తి”

 7. బ్లాగేశ్వర గారు, ఇదిగోండి శ్రీ శ్రీ గారి పద్యం:

  ఉగ్గేల తాగుబోతుకు
  ముగ్గేలాతాజమహలు మునువాకిటనన్
  విగ్గేల కృష్ణశాస్త్రికి
  సిగ్గేలభావకవికి సిరిసిరిమువ్వా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s