తూగులయ్య పదాలు-౩

ఇది మూడవ ( దేవుడు మేలుజేస్తే, మరియు చివరి) “రౌండు”, కాబట్టి, పఠయితలే సంయమనం పాటించాలని మనవి.
మొదటి, రెండవ వాత’లిక్కర’ ..అదే ..ఇక్కడ

పెళ్లి మంటపమందు
ప్రక్క మిత్రుల విందు
సిగ్గు చేటని యందు
ఓ తూగులయ్య
***
ఫీజు జీతము నాడు
చీర పండుగ నాడు
మందు మాత్రమె నేడు
ఓ తూగులయ్య
***

తడసినంతనె గొంతు
మాట మాటకు బూతు
జేయు ననుముకవాతు
ఓ తూగులయ్య
***

బారు బిల్లగు జాస్తి
ఇంట చేతురు శాస్తి
“రోడ్డు సైడె”ప్రశస్తి.
ఓ తూగులయ్య
***

చికెను వేపుడు తోడ
గ్యాసు షోడా తోడ
తెలియు స్వర్గపు జాడ
ఓ తూగులయ్య
***

పబ్బు లొచ్చెను నేడు
కుల్కు స్మితల తోడు
తోచి నట్టుల ఆడు
ఓ తూగులయ్య
***

డాన్సు బారుల యందు
నాట్య గత్తెల చిందు
నోట్లు గుబ్బల సందు
ఓ తూగులయ్య

6 responses to “తూగులయ్య పదాలు-౩

 1. పదాలు మంచి లయతో ఉన్నాయి. అందుకేనేమో “కుల్కు స్మితల తోడు” లో లయ తప్పిన విషయం వెంటనే తెలిసిపోయింది. తొమ్మిది మాత్రలే ఉంటం చేతనంటారా?

 2. ఊక దంపుడు బ్లాగు
  భళి భళీ అతి బాగు
  కామెడీలకు వాగు
  ఓ తూగులయ్య

 3. క్వార్టరైనను చాలు
  తూగులయ్య పదాలు
  ఊకదంపుడు ‘వ్రాలు’
  ఓ గూగులమ్మా!

 4. చదువరి గారు,
  అవునండీ.అక్కడొక మాత్ర తగ్గింది, గమనించలేదు. నెనరులు.

  నాగ మురళి గారు రానారె గారు, నెనరులు.

 5. దంచుతాఁడు ఊక
  ఆటవిడుపు లేక
  నాకుఁ నవ్వు రాఁగ
  ఓ గుత్తేదారు!

  గమనిక – మీరు గ్యాఁసు అంటే దాని శబ్దం గ్యాన్సు లేద గ్యాంసు ‘అన్నట్టు’ వస్తుంది… ఆంగ్లులు పలుకునట్లు రాయడానికిక్కడ ఁ పనికిరాదనుకుంట.. నాకు పెద్దలు చెప్పినదానిబట్టి అర్థమయ్యింది.. (మీ మేలైడీ నాదగ్గర లేదు లేకంటే కొన్ని లంకెలున్న మేలొకటి మీకు ముందుకంపేవాడిని (forward)).

 6. రాకేశ్వర గారు,

  “ఉంచఁదగని చోట నుంచగా నఱ సున్న
  నీతులందుఁ బుట్టు బూతు లెన్నొ”
  అని పి.బి.శ్రీనివాస్ గారన్నది నా(బోటి వారి) రాతలు చూశేనేమో..

  ఆ అరసున్నా తీసివేసినాను. మీకు మెయిలు పంపినాను, ఆ వ్యాసాలు పంపండి. నెనరులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s