మొత్తమ్మీద ఓ సీసం

మరో సవరణ

సీ. లపైని కరముంచ లపోయ డీతడు
మోహినీరూపంపు ముద్ది మోజు లేదు
వానియుదరమందు సియింప మనబోడు
గంగిరెద్దులపాలి గాడు శౌరి
రళము నిల్పుమా కంఠమందనబోడు
మృతమ్ము ద్రావగ శ లేదు
మ్మజేరగబోవ డ్డుగా తారాడు
ర్ధనారీశుపై మిత భక్తి

ఆ. ఫాలనేత్ర!సాంబ!న్నగ భూషణ!
శంభు!సోమ! స్థాణు! శంకర! శివ!
క్తపాల!వరద !పరమేశ! మామిత్రు
కొసగుమా వడిగొని, కోరు వరము.

గిరి గారు,కాదు అంటే సత్యమో అసత్యమో ( TRUE/FALSE) చెబుతున్నట్టు, కాడు/గాడు అనటం వల్ల విష్ణువు నీ కోసం ఆ వేషం వెయ్యాల్సి రాదు అని చెబుతున్నట్టూ అనిపించింది అందువల్ల కాడు అన్నాను.

6 responses to “మొత్తమ్మీద ఓ సీసం

 1. చాలా రోజులైంది ఇటువైపు వచ్చి. బాకీపడిన టపాలు చదవాలి ఇంకా. 3, 4 ఉన్నట్టున్నాయి.
  సీసం బావుంది. దీని సంగతీ సందర్భానికి సంబంధించి లంకెలు కూడా ఇస్తే బాగుండేది.

 2. పద్యం చక్కగా కుదిరింది. స్థాణు (రుద్రో భూతపతిః స్థాణుః) బదులుగా ష్థాణు ముద్రితమైంది చూడగలరు.

 3. బావుంది బావుంది…
  ఈ ఆటవెలదిని ఎక్కడో చూసానే అనుకుంటుండగా గుర్తుకువచ్చింది ఎక్కడో…
  “అమ్మజేరగబోవ అడ్డుగా తాఁరాడు” అంటే ఏఁవిటో నాకు అర్థంకాలేదు.. కాస్త చెప్పి పుణ్యం కట్టుకోగలరు..

  ఆ.
  శివుని యాజ్ఞ లేక, చీఁవైన కుట్టదు
  ఆజ్ఞ తోనె మనకు నాటవెలది
  ఎంత జెప్పు కున్న ఈశ్వరుని గురించి
  అంత మిగిలి యుండు నతని మహిమ

  🙂

 4. బావుంది. మీ ఆలోచన అర్ధమయ్యింది..కాడుని గాడు అని చదివే ప్రమాదముంది కాబట్టి కాదు వాడడం సబబని అన్నానంతే కానీ ఇంకేం లేదండి.
  ==

  అవును, సీసాలు పేల్చడం సులభమే కదా? మరిన్ని రాయండి..

 5. శ్రీరాం గారు, కొత్తపాళీ గారు, రాఘవ గారు, గిరి గారు, రాకేశ్వర గారు,
  ధన్యోస్మి.

  శ్రీరాం గారు,
  చేసిన పాపం చెబితే పోతుందంటారు గా చెబుతాను. బ్లాగేశ్వరుడు శివుని మీద ఓ పద్యం వ్రాశారు. మన పద్యప్రియులందరూ అందుకున్నారు. నే వెళ్ళి ఊరుకోకుండా శివుడి మీద సీసం అంటూ ప్రగల్భాలు పలికేను. తీరా జూస్తే, అందులో ఒక అనౌచిత్యం, ఒక యతి దోషం,
  ” వాసుదేవుడెగాడు వృషభమూర్తి” అన్నాను “గంగిరెద్దులపాలి గాడు శౌరి”బదులు..
  దానిని గిరిగారు చూపిస్తే “విష్ణుమూర్తియె గాదు వృషభమూర్తి” అన్నాను, యతి కలిసింది కాని ఔచితీ భంగం అప్పటికీ ఈ మట్టిబుఱ్ఱకి తట్టలేదు.

  ఇక,సీసం పై ఆటవెలదిలో, ఆటవెలది వ్యత్యస్థపాదారవింద అన్న విషయం మరిచి, ఒకటీ రెండూ పాదాలు ఒకే లయతో రాశాను. (యతి దోషాలు సరేసరి.) రాఘవ గారు తెలిపితే ఆటవెలది సరిదిద్దాను.
  ఒక రాత్రి నడి నిద్రలో గజాసురునిజంపి నప్పుడు విష్ణుమూర్తి కట్టింది ఏ వేషం అని అనుమానంవచ్చి, నేరాసింది తప్పని తెలిసింది, సవరించి, పైన రాశాను. ఇప్పుడు ‘మోజు’ అన్యదేశ్యమనిపించి, ముద్ది అన్నాను, ముద్ది అంటె ఇక్కడ ఇబ్బంది అని చెప్పుకోవాలి. అదీ క్లుప్తంగా దీని సంగతీ సందర్భం.

  రాకేశ్వర గారు
  “ఈ ఆటవెలదిని ఎక్కడో చూసానే అనుకుంటుండగా గుర్తుకువచ్చింది ఎక్కడో…” :: ద్వర్ధి. 🙂
  నేను సవరణ కాబట్టి అదే ఆటవెలది వేశాను. మీరు పాత ఆటవెలదినే వెంట బెట్టుకువస్తే ఎలా? క్రొత్త దీటువెలదిని ప్రవేశపెట్టండి.
  సీసంలో పాదంలో పుర్వార్ధాలు శివుడిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఉత్తరార్ధాలు, మా మిత్రుడుతో అలాంటి సంకటాలు ఏమీరావు అనిచెప్పటం. అమ్మజేరగ బోవ – అంటం – వినాయకుడి జన్మ వృత్తాంతాన్ని గుర్తుచేయటం, “అంబ” అనో “అగజ” అనో అనకుండా అమ్మ అనటం, మేము పుత్రులలాంటివారము స్వామీ కాపాడమనటం.
  స్వస్తి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s