నే రాయని రెండు టపాలు-౧

బాపు ౭౫వ పుట్టినరోజు

డిసెంబరు ౧౫న బాపు తన ౭౫వ పుట్టిన రోజు జరుపుకున్నారు. నాకు ఆ రోజు రాత్రి భక్తి టి.వి వారు ప్రసారం చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం వల్ల తెలిసింది. ఆ రోజూ, మర్రోజూ ప్రయాణం లో ఉండటం వల్ల బ్లాగులో ప్రకటించలేకపోయాను.తోటి బ్లాగరులెవరైనా ఈ విషయం ప్రస్తావించారేమో తెలియదు. ఈ నిత్యయవ్వనుడు, ౬౦లు సమీపిస్తున్నపుడనుకుంటాను, కాస్త వయసుకనిపించాలనో,ఏమో పైపు పట్టారుట. ఆయన చేతితో ఆయన వేసుకున్న ఆయన పైపు పట్టిన బొమ్మ ఈనాడు ఆదివారంపై వచ్చింది, ౬౦వ జన్మదినం సందర్భంగా శ్రీ.ము||వెం||రమణ ఓ ప్రత్యేక వ్యాసం రాశారు. ౭౦వ పుట్టిన రోజుకి, మళ్ళీ ఆయన వేసుకున్న బొమ్మే, ఈ సారి రాములవారు సీతమ్మ పాదాలకి పారాణి దిద్దుతుంటే, పారాణీ అందిస్తున్నట్టు. ఇంతలో ఇప్పుడు ౭౫వ పుట్టిన రోజు. ఆ రోజు దినపత్రికలు బాపు పుట్టినరోజు ఎలాజరుపుకున్నాయో తెలీదు. ఈ భక్తి టివీవారి ప్రత్యేక కార్యక్రమానికి మటుకు యాంకరమ్మ సుమ. ఆరుద్ర వారి “కొంటె బొమ్మల బాపు” తప్పు జెప్పి, ఓ చప్పనైన స్క్రిప్టు పట్టుకొచ్చి ఫెయిలు మార్కులు సంపాదించింది.
కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. చిత్రకారుడు బాపు,చలనచిత్రకారుడు బాపు.
నాకు చిత్రకారుడి భాగం నచ్చింది, రామాయణ, భారత భాగవతాలపై బాపు వేసిన బొమ్మలు లిప్తకాలం పాటైనా, చూసి అహా అనుకున్నాను. ఆ చిత్రం తెరమీద కనబడిబడగానే పక్కనున్న మిత్రులు ఆ ఘట్టం చెబుతుంటె, ముందు మిత్రుడి గొప్పతనమనుకున్నాను కాని, ఆనక తెలిసింది ఆ గొప్పతనం బాపూదని.శ్రీయుతులు ముళ్లపూడి వేంకట రమణ,శ్రీ రమణ, తనికెళ్ళ భరణి, బాపు గురించి మాట్లాడారు.
చలచిత్రపు భాగం, రాబోయే బాపూసినిమా వ్యాపార ప్రకటనగా మారినట్టు అనిపించింది.

ఈ రామభక్తుడికి ఆ స్వామి, దీర్ఘాయురారోగ్యైశ్వర్యాలనివ్వాలని, బాపు గారు కలకాలం అంధ్రనాట హాస్య,భక్తి రసాలని పంచాలని కాంక్షిస్తున్నాను.
సరే మీరు ఇది చూసి ఆనందించండి.

2 responses to “నే రాయని రెండు టపాలు-౧

  1. నువ్వుశెట్టి బ్రదర్స్

    బాపు ని అందరూ ఆరాధించేవాళ్ళే కాని, ఆ మహానుభావుడి జన్మదినాన్ని మన బ్లాగర్లు అంతగా పట్టించుకున్నట్లు లేరు. కొత్త ఆంగ్ల సంవత్సరాన్ని మాత్రం ఘనంగా జరుపుకుంటాం. కనీసం మీరన్నా గుర్తు చేసారు. సంతోషం.

  2. మీరీపాటికి చూసి యుండకపోతే ఇది కూడా చూడండి.
    http://bapuramaneyam.blogspot.com/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s