నే రాయని రెండు టపాలు – ౨

                         ఆంధ్రప్రదేశ్ ఉందని తెలియని తెలుంగులు

వార్తగురించి కూడా నేను టపాలు చూడలేదు. ఇది చదివితే నాకు గగుర్పాటు కలిగింది. ఎంతో దూరం లో, తమ భాష మాట్లాడేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారని, తమ భాషకి లిపి ఉందని తెలియక జీవనం సాగిస్తున్న నాలుగు వందల పైచిలుకు కుటుంబాల కధ. అలాంటి వారికి ఒక్కరోజు అకస్మాత్తుగా తమ భాష మాట్లాడేవాళ్లు కనిపిస్తే? ఆ అనుభూతి మాటలకందుతుందా?
వందల ఏండ్లుగా తమ భాషని కాపాడుకుంటూ, ఇంకా తెలుగులోనే మాట్లాడుకుంటున్నందుకు వీళ్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

అనుభూతులకి కవిత్వమే అక్కరలేదు ‘”నీతో మాట్లాడుతున్న నిముషమే మాకు స్వర్గాన ఉన్నట్టుంది” అన్నాడుట, ఆ తెగలోని ఒక వ్యక్తి. వాక్యం రసాత్మకం కావ్యం అంటె ఇదేనేమో. మీదగ్గరకు మేం వచ్చేస్తాం రానిస్తారా? మమ్మల్ని మీలో కలుపుకుంటారా అన్నారుట. పాములు,కోతులు ఆడించి సంచారజీవనం గడుపుతున్న వీరు ఆంధ్రప్రదేశ్ రాగలిగితే మెరుగైన జీవితం గడపగలుగుతారని నాకనిపిస్తుంది. మరి ప్రభుత్వం సాయమందిస్తుందో, వీళ్లకి ఎప్పటికి వోట్లు రావాలి, ఎప్పటికి వోట్లేయటం రావాలి అంటుందో. సాంస్కృతిక శాఖైనా సానుకూలంగా స్పందిస్తే బావుండు.

7 responses to “నే రాయని రెండు టపాలు – ౨

 1. క్షణభంగురాలైన వార్తాపత్రికల కథనాలకి లంకెలిచ్చి ప్రయోజనం లేదు. ఆ కథనాన్ని యథాతథంగానో, టూకీగానో మరల ఇక్కడ చెప్పండి.

 2. కొత్తపాళీ గారు, నేను వారి పాతర నుంచి లంకె ఇచ్చాను, కాబట్టి ఇంకొన్ని రోజులు లంకె సజీవముగానే ఉండచ్చు. త్వరలో ఆ కధ టూకిగా టపాలో చెబుతాను.

 3. లంకె తెగింది…
  మీ టపా.. క్లైమాక్సు చూపించి.. ఫ్లాషుబ్యాకులోకి వెళ్తుంటే కరంటు పోయున సినిమా లాగా వుంది..

 4. అందరినీ మన్నించమని కోరుతున్నాను. కొత్తపాళీ గారు చెప్పినప్పుడైనా లంకె బావుందో లేదో చూసుకొనవలిసింది. నా అనుమానం, నే లంకె ఇచ్చిన తరువాత ఈనాడు వారి దాన్ని ‘ఎక్స్లూజివ్స్’ లోకీ మార్చారేమోనని. లంకె మార్చాను దయ చేసి ఇప్పుడు చూడండి. తెలుగు బ్లాగు లో ఆవార్త యథాతథంగా కనిపించింది, ఈ బద్దకస్థుడికి ఎత్తిరాత పని తప్పించిన ఆతడికి/ఆమెకి నమస్కరిస్తూ:
  http://wowmusings.blogspot.com/2007/12/blog-post_2690.html

 5. నారాయణ రావు గారికి అభినందనలు… ఫాంట్ మార్చి మొత్తం వార్త / వ్యాసాన్ని వారి బ్లాగులో పెట్టినందుకు…!

  ఈనాడు,వార్త , ఆంధ్రజ్యోతి తదితర ఫాంట్ ల encoding నించి Unicode కి మార్చటం క్రింది లంకె లో చాల సులభం…, ఇది చాల పాత లంకె…, చాల మందికి తెలిసే ఉండాలి.
  http://geocities.com/vnagarjuna/padma.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s