మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్

మోడీ మతఛాందసుడని
కాడే అపమృత్యుబేరగాడని పలికే,
మోడీ జపమ్ములో తా
మోడిరిలే ఘోరముగను, మొగమెటు చెల్లున్?

ఎన్నికలసంఘముండెనె
పన్నుగ ఉచితానుచితము పరిశీలింపన్?
వన్నే?దోషులనొదలగ?
కన్నున్ననుగ్రుడ్డిసంస్థ గాదె చదువరీ!

11 responses to “మోకాలడ్డుటకునేమి? మోదీ గెల్చెన్

 1. పిలిచి, నిలబెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. 🙂
  కుస్తీ పట్టి సమాధానం రాస్తున్నాను.

  అన్నది సోనియ గావున
  చిన్నగ హెచ్చరికతోటి చెల్లెన్! అదియే
  మున్నుగ మోడీ యన్నచొ
  భిన్నముగా నుండనోపు వీరుల చర్యల్!

 2. చదువరి గారు,
  టోపీ తీసి నిలబడి చప్పట్లు కొట్టాను.

 3. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు !
  బ్లాగులద్వారా ఈ ప్రక్రియ మొదలుబెట్టినవారు మీరిద్దరేనేమో!
  ఇక ఆపకండి.

  రానారే, కొ పా, బాలవాక్కూ ఎక్కడున్నారండీ?
  మిగతా వాళ్ళందరిని ఒక కేకెయ్యండి!
  రండి! త్వరగా!
  తలా ఒక పద్యమో, పాదమో వెయ్యండి!
  అయ్యా! తెలుగు బ్లాగర్లందరు, రారండి!
  రండి!

 4. లలితగారు, రాధిక గారు, “జ్యోతక్క”గారు, సౌమ్య గారు, – మీలో ఎవరన్నా ఒక్క చెయ్యివెయ్యగలిగిన వారున్నారా? రండి

 5. చదువరి గారు, కొనసాగిస్తున్నాను
  మున్నుగలడుశేషాఖ్యుడు
  కన్నంతనెనేతలందు కలుగగ వణుకే,
  దన్నుగ నిలచెను జనులకు
  ఎన్నక నేతల ‘ఇమేజి’ ఎన్నికలందున్

 6. బాగా చెప్పారు. శేషన్, లింగ్డోలు వన్నెలద్దిన పదవది. ముఖ్యంగా లింగ్డోను నేనభిమానిస్తాను. (ఆయన మనూళ్ళో ఉంటం మనకు గర్వకారణంగా భావిస్తాను.) ఆయన చెప్పిన క్యాన్సరు పోలిక – 24 క్యారెట్లు! అందుకే..

  ఉన్నత పదవుల నందున
  వెన్నెముకే లేని జనులు వెలవెలపోవున్!
  ఎన్నదగిన ఘనవీరులు
  ఉన్నపుడే శోభ గలుగు, ఊదం గారూ!

 7. లెక్కకు టపామొదలిడగ
  దక్కెను పద్యములు రెండు దయతమదౌటన్
  మ్రొక్కెదసద్యస్ఫూర్తికి,
  చక్కని కవితా ప్రతిభకు, చదువరి గారూ!

 8. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!
  మీ చలవన నాకు నాలుగు పద్యాలు దక్కాయి.

  అన్నట్టు, ఇంగ్లీషు పాఠాలకు ఎడమొచ్చేసింది. నాబోటి ఇంగ్లీషు నేర్చుకునేవాళ్లకి ఇబ్బంది కదా.. ఆలోచించగలరు!

 9. @Netizen:
  నాకంత దృశ్యమూ లేదు…అంత భాషా లేదు. 🙂

 10. సౌమ్య గారు,
  దృశ్యం నాక్కూడా లేదు, అందుకే అదృశ్యంగా రాస్తుంటాను. ఇక భాష, తప్పులు చెప్పటానికి ఇక్కడ చాలామంది పెద్దలున్నారు. కాబట్టి భయపదవలసిన అవసరం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s