రైతు-సంక్రాంతి పురుషుడు -రాజకీయ నాయకుడు

ప్రతి సంక్రాంతి రైతుకి ఆశలు తెస్తుంది. సంక్రాంతి పురుషుడు కూడా రాజకీయ నాయకుడి లాంటి వాడె, సరిగ్గా పంట చేతికొచ్చే టైంకి వస్తాడు, పంట చేతికి రాకపోతే, నేనిప్పుడె వచ్చాను, తప్పంతా పాత పురుషుడిదే అంటాడు. పంట చేతికి వస్తే నేను దయామయుడిని కాబట్టి మీకు పంట చేతికొచ్చిందని పోజిస్తాడు. అహా ఇక నుంచి దమ్మప్రభువుల పాలన అని రైతు మళ్ళా మోసపోవటనికి పునరంకితమౌతాడు. చెబితే రైతు జీవితం కూడా ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురిచేతన్’అన్నట్టే ఉంటుంది. సంక్రాంతి పురస్కరించుకొని , రైతులోకానికి మేలు జరగాలని కోరుకుంటూ::
భూమినిప్రభుతయే నామమాత్రమ్మిచ్చి
లాగికొందు ననెడి రాపు లేక
పెద్దలు బలవంత బెట్టగా పొలమును
చౌక గానమ్మెడి చావు లేక
రాత్రికి రాత్రియే రాజకీయముతోడ
రింగు రోడ్డు జనెడు బెంగ లేక
చీదరించి విదుల్చు చిల్లర డబ్బుకై
కోరి సంతు కడను క్షోభ పడక
మ్మన రాకయే, రావలదనవచ్చు
వాన గాలి జతల వ్యధలు లేక
నాయక,బ్రోకర,కిలీల వ్యాపార
ణ సర్ప కోటికి కంట పడక
వ్యయసాయమనకయు వ్యధ సాయమనకయు
వ్యవసాయమనియె వ్యవహరింప

త్మ తృప్తి కోరి, త్మవిశ్వాసము
తోడ, రైతు బ్రతుక దుక్కి దున్ని
సాధు భావ రార! సంక్రాంతి పురుషుడా
తేజ రిల్ల నవని తెలుగు రైతు!!!.

మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

9 responses to “రైతు-సంక్రాంతి పురుషుడు -రాజకీయ నాయకుడు

 1. “బ్రోకర” ప్రయోగం భలే వుంది. మీరు గమనించారో లేదో… “చౌక గాను అమ్ము చావు లేక” అన్నప్పుడు సీసంలోకి ఆటవెలది దూరి తిష్టవేసింది. తెలుగురైతు అనేకన్నా రైతులందరూ అంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం.

 2. రాఘవ గారు,
  నెనరులు. ఆట వెలదిని సాగనంపాను. ఇప్పుడు చూసి ఇంకా తప్పులుంటే చెప్పండి.

 3. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

 4. మనకు ఆ.వె, తే.గీ మొ: వాటి గురించి 10వ తరగతి పరీక్షలు అయిపోవటంతోనే అంతా శూన్యమైపోయింది (ఒక్క వాటి పేర్లు తప్ప) :-(….మరలా ఇప్పుడిప్పుడే మీరు, రాఘవ గారు, తా.ల.బా.శా గారు మొదలగు వారిచే ఇప్పుడే కొంచెం దారిలో పడుతున్నట్టుగా ఉంది.

  కానీ మీరు చెప్పదలచుకున్న భావానికి మీ పదాల పొందిక అధ్బుతంగా కుదిరింది. స్పందించటానికీ, ఆశావహంగా ఉండాలని కోరుకోవటానికీ రైతు బిడ్డే కావలసిన అవసరంలేదు గానీ, ఓ రైతుబిడ్డగా ఈ నూతన సంవత్సరంలో రైతాంగానికి మీరు కోరుకున్నట్టుగా అంతా (ఒకటి రెండు జరిగినా నిజంగా అది ఒక గొప్ప ముందడుగే) మంచే జరగాలనీ…అలా కోరుకోవటంలో ఒక వైవిధ్యాన్ని చూపిన మీ ప్రజ్ఞ, శ్రమ నిజంగా బహుధా ప్రశంసనీయం. ……

  హృదయపూర్వక అభినందనలతో

 5. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

 6. గిరి గారు,తెలుగు ‘వాడి’ ని గారు,కొత్త పాళీ గారు,
  నెనరులు.

  పొద్దు వారలూ,
  నెనరులు.

 7. పింగుబ్యాకు: విరోధి వత్సర మకర సంక్రాంతి « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s