వేటూరికో ఉత్పలమాల

నేపధ్యం:
http://vinnakanna.blogspot.com/2008/02/blog-post.html
నా పద్యం:
పాటలచేతనాయికల ప్రాయపు సౌరుకె దీర్ఘమిచ్చె, తా
పాటలచేతనాయకుల పౌరుష వాక్కుకె ఒత్తునిచ్చె, తా
పాటలచేతచిత్రముల ప్రాణము లూదెను మారుమారు, ఆ
పాటలరామమూర్తికిదె పద్యసుమాంజలి, నమ్రతావిధిన్.

8 responses to “వేటూరికో ఉత్పలమాల

 1. దీర్ఘం వొత్తు .. ప్రాణం .. బహు బాగుంది.
  అసందర్భమే అనుకోండి, ఒక మిమిక్రీ గుర్తొస్తోంది .. పల్లెటూరి బళ్ళో ఒక పిల్లాణ్ణి గుణింతం చెపరా అంటే .. క కి చెవ్వు మెలేస్తే కీ, ఎగ్గొట్టి దిగ్గొడితే కై .. అని చెప్తాడు

 2. ఉ.బొందితొ స్వర్గవాసమును పొందగజేసెడి భక్తిపాటలూ
  సందడి ప్రేమ పండుగ వసంతము మున్నగు వంటి వాటిపై
  వందలు వేలు వ్రాసె గద పాటలు పద్యములెన్నొ యట్టి శ్రీ
  సుందరరామమూర్తి కవిసోముని నేర్పు నుతింప శక్యమే?

 3. రాఘవ గారు,
  పద్యం బాగా వచ్చింది.

 4. చాలా బావున్నాయి ఇద్దరి పద్యాలు

 5. ఊ.దం.గారూ, మీ పద్యం , రాఘవ గారి పద్యం ఎంతో బాగున్నాయి.

  కొత్తపాళి గారి టపా కూడా గుండెకు హత్త్తుకుంది. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చివుక్కుమనిపించాయి… అనువాదం అంటేనే కత్తి మీద సాము. ఎందుకంటే ఒక్కో భాషకీ కొన్ని వాడుకలు, వ్యావహారికాలూ ఉంటాయి. అల్లాంటివాటిని ఒక బాణికి అనుగుణంగా, స్వర, రాగ భావాల సమ్మేళనంగా పలికించాలి అంటే కొంచం కష్టమే. ఈ విషయాన్ని అవధానాలు చేసేవారు ధృవీకరిస్తారు.

  ఉదాహరణకి ఒకసారి మాడుగుల వారిని పోతన గారి పద్యానికి సంస్కృతానువాదం చెయ్యమన్నరు.

  ఓయమ్మ నీకుమారుడు
  మాయిండ్లను పాలు పెరుగు మననియడమ్మ,
  పోయెదమెక్కడికైనను
  మాయన్నల సురభులాన మంజులవాణి”

  ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే మా అన్నల ఇళ్ళల్లోని ఆవుల మీద ఒట్టు అన్నది తెలుగు వారికే సొంతమైన వాడుక. సంస్కృతంలో ఇల్లా ఒట్లు పెట్టుకోవటం లేదట. అయినా సరే భావాన్ని ఒడిసిపట్టి అనువదించారు నాగఫణి (నాగ్గుర్తున్నత వరకూ ఆ శ్లోకం ఇదీ)

  హే మాతస్తవ పుత్రః
  కతిపయి ఆద్యాహరతి చ గేహస్థం
  గచ్చామః కమపిస్థల మాహో
  ప్రమాణ అత్ర సురభయహార !!

  ఏతావాతా నేన్చెప్పోచ్చేదేమిటంటే ఒక క్రికెటర్ సామర్ధ్యం, పాటవం తెలియాలంటే టెస్టు మ్యాచుల్లో అతని ప్రతిభ, ఆట చూడాలంటారు కదా అట్లా ఒక కవి (ప్రస్తుతం వేటూరి గారి) తెలుగు సాహిత్య సేవని ఆకళింపు చేసుకోవాలంటే అనువాద సాహిత్యం లో వారి కృషిని చూసే కన్నా సందర్భోచితం గా స్వభాషా సాహిత్యాన్ని రుచి చూడాలి. ఉ.దా. “భైరవద్వీపం” చిత్రంలో “శ్రీతుంబురనారదనాదామృతం” అనే పాట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s