ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౬

మొన్న మా రామలింగంతో కలిసి ఓ పెళ్లికి వెళ్ళవలసివచ్చింది. నాకు వధూవరులు తెలియదు, ఊరిబయట ఓ ఉద్యానవనం లో పెళ్ళి, అర్ధరాత్రి తిరిగివచ్చేటప్పుడు నాకుతోడుగా ఉంటావ్ రారా అంటే మొహమాటానికి బయలుదేరాను, ఈ సారి ఎప్పూడైనా ఇంగ్లీషు నేర్పేటప్పుడు దెప్పుతాడని.

ఈ పెళ్లిలోకూడ అన్ని పెళ్ళిళ్లలో లాగేనే ఆడవాళ్లు అందరూ చాల సంతోషంగానూ, కొందరు మగవాండ్రు నిర్వికారంగాను, కొందరు నిర్ల్పితం గాను, కొందరు నిస్సహాయం గాను, కొందరు విచారవదనం తోనూ కనిపించారు. అయ్యో ఇంకోమగవాడు ‘పెళ్ళి పీఠం’ ఎక్కినాడే అన్న దిగులు మనసులో మొదలై, గుండెలకి జేరి, పొట్టను కూడా ఆక్రమించబోతుంటే, కాసేపగితే అన్నానికి చోటుండదని, రామలింగడిని భోజనానికి లేవదీశాను. భోజన శాల వెతుక్కోవటనికి వెళ్తుంటె హలో అంటూ ఓ యువకుడు మా రామలింగం చేయి బట్టుకున్నాడు.. రామలింగం హలో అంటూ, ఇతను పెళ్లికొడుకు తమ్ముడురా, ఆంధ్రా యూనివర్శిటి లో అలంకారశాస్త్రం లో “Ph. D” చేస్తున్నాడు అన్నాడు.
నేను ఛటుక్కున చేయి ముందుకు జాపి “Nice to meet you, Doctor of Decoration Science” అన్నాను, నా అనువాద వేగానికి నేనే మురిసి పోతూ.
అతను రామలింగం వంక కొంచం ఇబ్బందిగా, రామలింగం నా వంక కొంచం కోపం గా చూసారు, పట్టా రాకుండానే డాక్టరన్నందుకనుకుంటా. 😦

—————————————————————————–
కొసవిడుపు::
” Way 2 BAFE” అని చూసి నేను నేరుగా వెళ్లగలిగాను కాని, ఆ పెళ్లికొడుకి తమ్ముడితో మాట్లాడి వెనకొచ్చిన మా రామలింగానీకి బఫే ఎక్కడో కనుక్కోవటం కొంచం కష్టమైందిట.వాడికి బఫే వర్ణక్రమమూ, ఎలా పలకాలో తెలియటమూ తప్పైందని ఏకగ్రీవంగా తీర్మానించాం.

9 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా-౬

 1. 🙂 మీ అనువాదవేగాన్నందుకోవడం కష్టమే మరి.
  అది సరేగానీ, చివర్లో ‘కొసవిడుపు’ అన్నారు అది కొసమెరుపుకూ ఆటవిడుపుకూ వర్ణసంకర సంతానమా?

 2. గుంటూర్ “లీలా మహల్”లో ఒక దశాబ్దం క్రితం – అప్పుడు ఆడుతున్న ఒక ఆంగ్ల చిత్రం‌లోని నాయకుడి పేరేమిటి అని అడిగితే – “స్కావన్జర్ ” అని విన్నప్పుడు బిక్కమొఖం వేసాడు – స్కావెంజరు ఎవరా అని! మీకు తెలిసిందా ఆ స్కావెంజరు ఎవరన్నది?

 3. నెటిజన్, ఆర్నాల్డు ‘స్కావెంజరు’ గురించేనా మీరు చెపుతున్నది?

 4. ౯౦లలో బ్లేజ్‌వాడలో కార్ల్ మార్క్స్ రోడ్డు మీద ఒక సినిమా హాల్*కి వెళ్ళినప్పుడు తన మిత్రుడిని పరిచయం చేసారు, బావమరిదిగారు. సినిమా మొదలవ్వడానికి ఇంకా ఐదు నిముషాలు ఉందనగా కలిసాడు ఆయన. ఆ ఐదు నిముషాలు ఈ బ్లాగర్ గురించి, వ్యాపకాలగురించి, ఉంటున్న ఊరు గురించి చాలా వివరాలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నాడాయన. మళ్ళీ కలుసుకుందామని విడిపొయ్యాము.
  అతను నిష్క్రమించిన తరువాత బావమరిదిగారు అడిగారు. మీ సంభాషణలో ప్రత్యేకత ఏదైనా గమనించారా అని.”లేదు”, అన్నది జవాబు.
  తరువాత తెలిసింది – బావమరిదిగారి మితృడు ఒక్క ఆంగ్ల అక్షరం కాని పదం కాని వాడలేదని – ఈ బ్లాగర్ జవాబులన్నీ కూడా ఆ ఐదు నిముషాలు “ఆంగ్లం” లోనే అని.

 5. BAFE స్పెల్లింగు సరిగ్గానే ఉన్నా మీ స్నేహితుడికెందుకర్థం కాలేదో తెలీలేదు సుమండీ!

 6. చదువరి గారు, మీరు పున్నమ్మ గారి బడి లో నేర్చినవన్నీ మర్చిపోయినట్టున్నారే? BUFFOON బఫూన్ ఐతే, BAFE బఫే ఎలా అవుతుంది?, BUFFE బఫే అవుతుంది కానీ.
  కాదు నేను ఒత్తుగా తినను, డై(డే)టింగు అని అనే వాళ్లకి ఒక ‘F’ డిస్కౌంట్, BUFE అని రాసుకోవచ్చు,
  నెటిజన్ గారు, గిరి గారు చెప్పిన తరువాత అర్ధం అయ్యింది.
  తెలుగు వెలుగు అనే కార్యక్రమం లో మృణాళిని గారు కూడ ఆంగ్లపదాలు వాడరుట

 7. 😀
  ఏంటోనండి, నాకంతా ఆశ్చర్యంగా ఉంది.. ఈ ఇంగ్లీషు స్పెల్లింగులతో నాకుండే కన్ఫెషను పూర్తిగా పోయిందనే ఉద్దేశ్యంతో ఈ మధ్య ఇంగ్లీషులో మాట్టాడ్డం, రాయటం కూడా మొదలెట్టాను. దీన్ని బట్టి చూస్తే నేను నేర్చుకోవాల్సింది ఇంకా కొద్దిగా ఉన్నట్టుంది!

 8. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » మార్చి పోస్టుల మార్చిపాస్టు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s