మల్లెలు – కోకిల?

భామదేహపుమంచిగంధము భామరాకనుతెల్పగా
భామకొప్పునమల్లెపువ్వులు బంపనిద్రను దవ్వుగా   
భామజుట్టినఆకువక్కలు”పండు యాశల”మోయగా
భామజెంతకుజేరెకాంతుడుపారవశ్యమునొందగా

ప్రకటనలు

6 responses to “మల్లెలు – కోకిల?

  1. ఇదిగో దీనికి జత మత్తకోకిల:

    బావచెప్పిన వూసులన్నియు బాగుగా తను విన్నదై
    బావకోసమె వచ్చినానని పల్కె మెల్లిగ తీయగా
    బావనప్పుడు చూచుచూ తన బావ మీదను ప్రేమతో
    బావకౌగిట సిగ్గుమొగ్గగ మారిపోయెనలా అలా.

  2. రాఘవ గారు,
    జత బావుంది. మిత్రులు ఉగాది నుంచి నవమి వరకు శెలవులో ఉన్నాట్టున్నారు, లేకపోతే, ఇక్కడ చిన్నపాటి కోకిలల కుటుంబం ఏర్పడేది ఈ పాటికి.

  3. పింగుబ్యాకు: ఓ పక్షి కూత « వికటకవి

  4. నా కూత నా బ్లాగులో కూసా కోకిలలారా 🙂 ఓసారటు వచ్చెళ్ళండి.

  5. ఆహా కోకిల గానం .. మా వూరికి కూడా వసంతం వచ్చేసినట్టుందే?

    వూ.ద. మహాశాయా, మ్రోయ అంటే ధ్వనించడం – అక్కడ తాంబూల చర్వణంలో ఏమి “ధ్వని”స్తున్నదో ఏవిటో??

  6. గురువు గారు,
    ఆకులు చుట్టేటప్పటి కరకంకణ నిక్వాణమేమో. 😦
    అక్కడ క్రావడి అనవసరంగా మొశాను. తొలగిస్తున్నాను.

    ఱాకేశ్వరుడు చెప్పినట్టు

    మొత్తానికి పద్యం వ్రాసిన తరువాత ఒక రెండు మూడు సార్లు తిరిగి చూసుకుంటే సరిపోదన్నమట, ఒక పది సార్లైనా చూడాల్సిందే 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s