మనమా? మత్తేభమా?

రెండు హాంగోవర్ల మధ్య మద్య పిపాసి ఆలోచించుకోగలిగితే::

నుమా ఎందరొ వీధివీధికిని, ఆల్లుంగొనంగూలిరో,
వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
నుమా , మద్యము జోలికెళ్ళనని యే, యాప్తుల్ ముదంబొందగా,
నమా ఒద్దిక నాదు మాట వినుమా, ర్యాద కాపాడుమా

9 responses to “మనమా? మత్తేభమా?

 1. బాగుంది, అది సరే గానీ ఇక మీ తూఊఊఊఊఊఊఊఊఊఊగులయ్యనొదలరా? 🙂

 2. వికటకవి గారు, ఆ వ్యసనాన్ని వదిలి ఇంకో ఆధునిక వ్యసనాన్ని బట్టుకున్నాను చూడండి.
  కనుమా, లేదట ఆటగాండ్రకును ఏ కాస్తైన మిత్రత్వమే
  కనుమా, హద్దులు మీరుచుండెడు ‘కళాకాంతా’సమూహమ్ములన్
  వినుమా, వద్దిక ఆక్రికెట్టును తమిన్ వీక్షించు వ్యామోహమే
  మనమా! ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా!

  అనుమానంబొకొ?తేటతెల్ల మయె, అత్యాశా యుగమ్మౌ నిదే,
  వనితా దేహమె ఒప్పు నాభిగను, హా! వాణిజ్యమే సర్వమున్
  కినుకన్ మానుమ, ఆటజచ్చెనట, ఆ కేరింత గత్తెల్ బడన్,
  మనమా! ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా!

 3. బాగున్నాయి. మొదటిది మరింత నచ్చింది.

 4. రెండేసి, మూడేసి పూరణలు రాయడం మీకూ గిరిగారికే చెల్లు!!
  నాకు మూడోది నచ్చింది. కేరింత కత్తెలనమాట వాళ్ళు- భలే! నేనూ ఇదే విషయంపై పూరించాను, రానారె బ్లాగులో.

 5. చదువరిగారన్నట్టు రెండేసి, మూడేసి పూరణలు రాయడం మీకూ గిరిగారికే చెల్లు. మీ మొదటిపద్యం నాకు నచ్చింది. చాలా బాగుంది. మూడోపాదంలో ‘యే’ నాకు నచ్చలేదు.

 6. బాబోయ్ .. చాలా జరుగుతోంది …. నేనే చాలా వెనకబడి పోతున్నాను.

  ఈ పరీక్షలు కాదు జీవితము అంతా ఈ పరీక్షలు రాయలేక చస్తున్నాను

 7. కల్లు మీద పద్యం బావుందండీ

 8. రానారే గారూ, మూడో పాదం మార్చాను చూడండి, మందు మానటం వల్ల ఎంతమందికి ఆనందం కలిగినా బ్రహ్మానందం మటుకు భార్యకే, అందువల్ల:
  కనుమా ఎందరొ వీధివీధికిని, ఆకల్లుంగొనంగూలిరో,
  వినుమా, నీదు శరీరమున్ తొలచి నిర్వీర్యుండజేయుంగదా,
  అనుమా మద్యము జోలికెళ్ళనని బ్రహ్మానందమౌనాలికిన్,
  మనమా ఒద్దిక నాదు మాట వినుమా, మర్యాద కాపాడుమా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s