ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౭

ఈ మధ్య మా ప్రాజెక్టు లో ఒకతను రాజీనామా చేసి బాలెన్స్‍షీట్ కాస్త బాగా కన్పిస్తున్న కంపెనీ వైపు పరిగెత్తితే, మా ప్రాజక్టు లో ఓ ఇంజినీర్ కి కొరతొచ్చింది. మానేజరు నన్ను బిలిచి, ఇప్పుడు నియామకాలు లేవు, పక్క ప్రాజెక్టు లో నుంచి ఒకడిని తెచ్చుకోవాలి, ఈ ఇద్దరితో మాట్లాడి, ఎవరినో ఒకరిని ఎంచుకో అని ఓ రెండు పేర్లు చూపించారు.
మొదట చందన్ మిశ్రా తో మాట్లాడాను

నువ్వు ఎందుకు ప్రాజెక్టు మారదామనుకుంటున్నావు?
Actually I want to change project ఇసిలియే కీ …..
నీకు c++ వచ్చా?
I know C++ మతలబ్ I gave a paper in 3rd sem మగర్ సంఝో కీ I did not work on C++…
ప్రాజెక్టు లో నీ పని ఏమిటి?
Beginning, I was given a feature, it so happened కీ ..
…వీడు ఇట్టా మాటిమాటికీ, “కీ”లిస్తుంటే మనవల్లకాదని రెండో వాడిని (పొన్నూరు మధుబాబు) పిలిచాను మాట్లాడటానికి..
ఇంటిపేరేనా, ఊరిపేరు కూడా పొన్నూరేనా..
పొన్నూరు కాదు గానీ, పక్కనే…
సరే, రేపటినుంచి ఈ ప్రాజెక్ట్ కి వచ్చెయ్..
***

రెండు రోజుల తరువాత .. అతడు నా దగ్గరికి వచ్చి:

“UdaM I am empty. “ అన్నాడు
వ్వాట్
That documents read completed. Now I am empty. Give me something.
I am empty అంటే , ఖాళీ గా ఉన్నాను అని అర్ధం నేర్చేసుకొని, మా రామలింగానికి మనసులో ‘థాంక్స్’ చెప్పుకొని
“గో,చెక్ సర్వర్ ” అని సర్వర్ ఉన్న వైపు చేయి చూపించాను..
అతను అక్కడికి వెళ్లి, నాకు వినిపడటానికి గట్టిగా
“You are locked” అని అరిచాడు
వ్వాట్
“You are locked server,I can’t check logs, please open.” అని అరిచాడు
తేరుకొని, సిష్టం అన్‍లాక్ చేయటానికి వెళ్తుంటే, అనుమానమొచ్చింది, పొరబాటున, సర్వర్ కిల్ అయ్యుంటే వీడేమి అరిచేవాడా అని..

16 responses to “ఇంగ్లీషూ యు లివ్ లాంగా -౭

 1. నేను చండిఘర్ లో వున్నపుడు ఈ హింగ్లీషుకు చచ్చేవాడిని! “కీ” భాషతో ఇదేమి నా భాగ్యమో అని నిట్టూర్పు విడిచేవాడిని!!ఇప్పుడు ఇక్కడ-ఇంగ్లీష్ బదులు ఇంగ్లీషు!ఎంతైనా మనము అజంతా భాషవారము కదా!!!
  చాలా థ్యాంక్సు!!!!

 2. హా హా హా

  మాఊరి మధుబాబు హా హా హా
  ఆర్తనాదం ఊదం గారు!

 3. బాగుందండీ. అంగ్రేజీ, ఇంగ్లేజీ పోషిస్తున్న హాస్యరసం.

 4. it is nice only no?! the thing is you must follow him no ?

  😀 (Hyd style english)

 5. D హహ్హహ్హా!
  మై స్టమక్ ఈజ్ బ్రేకింగ్ ఇంటు పీసెస్!

  మా పొన్నూరేపు వాళ్లకి ఇంగ్లీషు బాగా వస్తుందని ఈ పాటికి అర్థమయ్యుండాలి మీకు. టెల్ అవర్ మధుబాబు దట్ ఐ ఆస్క్‌డ్ హిమ్!

 6. మీ టపా చదవగానే కామెంట్ రాసి తీరాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి వారి బారిన నేను తరచుగా పడతాను. మా పక్కింటమ్మాయి I thought కి అని ఇరవై సార్లు వాడుతుంది రోజుకు. ఇంకో వీరుడు ‘హాయ్, యూ ఆర్ హియరా, టుడే యూ డోంట్ హావ్ ఆఫీసా ‘ అంటాడు.

  యూ ఆర్ గోయింగ్ అవుటా ?
  యూ ఫినిష్డ్ యువర్ డిన్నరా? లాంటి ప్రశ్నలు రోజూ వినాల్సిందే!

  ఇంకోడికి ‘this thing అనేది అలవాటు.
  “rE, my this thing is not working” అంటాడు . లేదా

  “your sister’s this thing ..I mean that….engagement is overaa?”

  అందుకే మా వారు ఎవరన్నా జాబ్స్ గురించి అడిగితే ‘నీకు సబ్జెక్టు రాకపోయినా పర్వాలేదు. నేను నేర్పించుకుంటా! కానీ communication skills, spoken english రాకపొతే నా పేరు కూడా తల్చుకోవద్దు అని నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారు.

  చివరగా చిన్న ఝలక్! మొన్న ఒక రోజు సినిమాకు వెళితే అక్కడ ఉన్న ప్లే ఏరియాలో కూతుర్ని ఆడిస్తున్న తండ్రి రంగుల రాట్నం తిరుగుతున్న పిల్లతో ఇలా చెప్పాడు.
  Don’t run fast. If you run speed, your eyes will turn ” అనగా వేగంగా తిరిగితే “కళ్ళు తిరుగుతాయి” అన్నమాట!
  eyes will turn! అద్భుతం కదా!

 7. sujata gaaru (ma.ma)

  my eyes r revolving – how’s that??!! better english??

  Such things are funny, as long as they happen to others!! Excuse me for commenting in English.. anyway it’s all abt long live.. englishuu.. 🙂

 8. సుజాత గారు, రాసి తీరినందుకు సంతొషం. రాయకపోతె మంచి వ్యాఖ్య కోల్పోవలసివచ్చేది. ఓ మారు కొత్తపాళీ గారు అన్నారు,
  కొన్ని సార్లు అసలు టపా కన్నా స్పందించిన వారి వ్యాఖ్యలు వన్నె తెస్తాయి అని.
  అలానే ఈ ఇంగ్లీషు… టపా లన్నింటికీ, బ్లాగరులు తమ అనుభవాలను జోడించి పరిపుష్టం చేస్తున్నారు.
  మీ వారి దగ్గర ఉద్యోగం సంపాదించటం నాకు కష్టమే 😦
  అందరికీ నెనరులు.

 9. “హాయ్, యూ ఆర్ హియరా, టుడే యూ డోంట్ హావ్ ఆఫీసా ‘ “….మనవాళ్ళతో మాట్లాడాల్సి వఛ్ఛినప్పుడు చాలాసార్లు నా భాష కూడా ఇలాగే వు0టు0ది. 😦 అలాగే ఓకే నా?అని నేన0టే ఓకే వా? అని తమిళ ఫ్రె0డు అ0టు0ది.

 10. మా సహోద్యోగిని ఒకామె అమెరికా వాళ్లకు కూడా “కీ” యిస్తూ వుంటుంది. కానీ కలుపుగోలుతనం మెండుగా కలిగినది కాబట్టి “కీ” వలన ఆమె కొచ్చిన నష్టమేమీ లేనట్టే వుంది.

 11. ఇలా పాపం మీ అంత జ్ఞానం లేని వాళ్ళని పట్టుకుని వాళ్ళని కారికేచరు లో చూపించి, సంతోష పడడం పెద్దరికం అనిపించుకోదు.
  మీలా గొప్ప గొప్ప పట్టణాళ్ళో పుట్టని మాబోటోరి ఏదో నాలుగు ఇంగ్లీషు మాటలు వస్తే అదే పరమానందం.

 12. రాకేశా, నేనెప్పుడూ పట్నం లో చదివిందీ లేదు, నాకు ఇంగ్లీషు వచ్చిందీ లేదు.

  కన్యాశుల్కం లో వెంకటేశం లా కానంతవరకూ నాలుగు ముక్కలొస్తే నాకూ ఆనందమే!
  -భవదీయుడు
  ఊకదంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s