అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౪

రెండు వారల క్రితం, అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి , రేపటినుండి మీరు దింపండి..
నాన్న: బండి మీదేగా వెళ్లేది, పది నిముషాల భాగ్యానికి ఏమి కష్టంట.
అమ్మ: అదికాదండి,
నాన్న: కాస్తా,నిద్రపోనిస్తా, మళ్లి రేపొద్దునే లేచి ఆఫిసుకి పరిగెత్తాలి.

ఓ వారం క్రితం, అర్ధరాత్రి 12:00 గం
అమ్మ : ఏమండీ, పొద్దునపూట నాకు వీడ్ని స్కూల్లో దింపటం కష్టం గా ఉందండి,తిరిగి వచ్చి మొదలు పెట్టాలంటే వంట లేటవుతోంది రేపటీ నుండి మీరు దింపండి..
నాన్న: నాకున్న సమస్యలకి నాకు నిద్రపట్టేదే తెల్లరుఝామున, ఆ రెండుగంటలన్నా ప్రశాంతంగా పడుకోనీ
అమ్మ: అదికాదండి,
నాన్న: నువ్వు దింపితేనే వాడికి ఇష్టం ఇక పడుకో

మొన్న అర్ధరాత్రి 12:00 గం

అమ్మ : ఊరుకున్నకొద్దీ వీడి మిస్సు మరీ మితిమీరి పోతోందండీ
నాన్న: ఇప్పుడేమైంది
అమ్మ: ఈవాళ వీణ్ణి “ఎంత మీనాన్నలాగ అందగాడివైతే మాత్రం అంత మిడిసిపడక్కర్లా” అందిట.
నాన్న: అంత మాట అందా, వాళ్ల ప్రిన్సిపాల్ తో మాట్లాడతాలే, అన్నట్టు, నీకు కష్టం గా ఉందంటున్నావుగా రేపటినుంచి వాణ్ణి స్కూల్లో నేను దింపుతాలే..
అమ్మ: ( మా అక్కచెప్పిన చిట్కా నాక్కూడ పనిచేసిందోచ్)

ప్రకటనలు

18 responses to “అమ్మ,నాన్న, మూడేళ్లబ్బాయి -౪

  1. బాగుంది.అమ్మ మంచి తెలివైంది.

  2. 🙂 .. ఏంటి స్వానుభవమా? లేక అలా జరగాలని మనసులొ ఉందా??
    ఊరకే అన్నారా?
    ఎంత వారలైనా కాంత దాసులే??

  3. ha haahha
    జ్యోతక్క డౌటే నాక్కూడా ఉంది.

  4. బాగుందండీ.

    “అర్ధరాత్రి 12:00 గం” ..ఈ టైమింగ్ బాగుంది. 🙂

  5. అందరికీ నెనరులు.
    @జ్యోతి గారు & ప్రతాప్ గారు,
    ఎంతవారలైనా కాంతదాసులే అని, అమరపురి ప్రెసిడెంటు నుంచి మొన్న మొన్న అమెరికా ప్రెసిడెంటు దాకా చాలా మంది నిరూపించారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు.
    అదెదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, అన్ని తప్పులూ మనమే చేయాలంటే సమయం సరిపోదు కాబట్టి, ఇతరుల తప్పుల నుంచీ , అనుభవాల నుంచి కూడ నేర్చుకోవాలి.
    @ మధు గారు,
    ఆధునిక స్వార్ధపూరిత కుటుంబవ్యవస్థ లో భార్యకి భర్తతో మాట్లాడటానికి అర్ధరాత్రి పన్నెండిటి లోపు సమయం ఉండదు అని చెప్పటానికి ఆ సమయం ఎన్నుకున్నాను కాని, మరేమీ కాదు.

  6. ఏదీ తనంతతానై నీ దరికి రాదు … (శ్రీశ్రీ పాట) 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s