౫-౭-౫ లేక కు(హనా)హైకూ

ఒక్క వాక్యాన్ని
మూడు ముక్కలు చేస్తే
అదే కు హైకూ
[నాల్గో ముక్క చేస్తే అకాణానీ]

క్లుప్తత గోరి
నేను పరిశ్రమిస్తే-
భావ శూన్యత

భావం పెదవి
దాటకే -అక్షరాలు
లెక్కదాటాయి

తెనుగు హైకూ
ఛాందసవాదుల
విదేశీ మోజు

సకల ఛందో
ప్రక్రియానుగతమీ
ఊక దంపుడు
——————

దిగులు కాకి
మామ రావటం జూసి
తుర్రు మన్నది

మాటలలలు
మ్రింగే బంధు సాగరం
ఇద్దరి మధ్యా.

ఒకటే మాట
నీనోట- మనసుకి
మాయని గాయం

1) అరువు బాణీ
ఉక్కుచట్రంలో సినీ
తెలుగు పాట

2) హిందీ గొంతుల
అంపశయ్యపై సినీ
  తెలుగు పాట

బండి మురికి
వానకి వదిలింది-
తలపై హెల్మెట్

11 responses to “౫-౭-౫ లేక కు(హనా)హైకూ

 1. అదరగొట్టేశారండీ! తెలుగులో మొట్టమొదటి నిజమైన (5-7-5) హైకూ లన్నమాట!

  “ఒకటే మాట
  నీనోట- మనసుకి
  మాయని గాయం”

  చాలా బాగుంది.

 2. తెలుగు హైకూ
  జపాన్లా వ్రాయబోతే
  ఊకదంపుడే! 🙂

 3. 🙂 మీరెప్పుడో కూడలికబుర్లలో దొరక్క పోరు నా హైకూ(కి)ల్ లతో మిమ్మల్ని 🙂

 4. “మాటలలలు
  మ్రింగే బంధు సాగరం
  ఇద్దరి మధ్యా.”
  That truly is a haiku.
  good show.

 5. ” హిందీ గొంతుల
  అంపశయ్యపై సినీ
  తెలుగు పాట ” బాగా చెప్పారు

 6. భలే.
  “బండి మురికి
  వానకి వదిలింది-
  తలపై హెల్మెట్”
  హిహి… తలలో మురికి వానలకి వదలదులెండి 🙂

 7. ఆలకించగా
  ఈ హైకూ కూతలలో
  ఏదో కైపుంది

 8. తెనుగు హైకూ
  ఛాందసవాదుల
  విదేశీ మోజు

  పైనున్న హైకూ
  ౫-౭-౫ కాదంటాను
  అవునంటారా?
  🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s