ఇద్దరు వ్యాపారస్థులు

నిన్న రాత్రి పదిన్నరప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెల్తూ, తమలపాకులు కొనుక్కుందామని ఓ అంగడి దగ్గర ఆగి ఐదు రూపాయలకు ఆకులు ఇమ్మన్నాను

ఆ కొట్టు ఆమె ఆకులిస్తూ కిందటి సారి, పది రూపాయలిచ్చి చిల్లర తిరిగి తీసుకోవటం మర్చి పోయారు బాబూ అంది
ఆ మాటలు నేను నమ్మలేకపోయను,విస్తుపోయాను.
నేను ఆ అంగడికి వెళ్లి కూడా పది రోజులు దాటి పోయింది..
నాకు పదిరూపాయలు ఇచ్చినట్టు గాని, ఐదు రూపాయలు తిరిగి తీసుకోలేదని గాని లీలగా మాత్రం కూడా గుర్తులేదు.
ఐతే నేను విస్తుపోయింది, నా మతిమరుపుకి కాదు, అమె నిక్కచ్చితనానికి.
ఈ రోజుల్లో,ఐదు రూపాయలు నా భాగ్య రేఖని కాని, ఆమె భాగ్య రేఖని కాని ఏ విధంగాను ప్రభావితం చేయలేవు..

అవునా, నాకు గుర్తు లేదు అన్నాను, అది అంత ముఖ్యమైన విషయం కాదని ధ్వనించేటట్టు.
అవును బాబు, ఈ టైమప్పుడె వచ్చి తీసుకున్నావ్ ఆకులు, చిల్లరదీసుకోకూండానే బండి మీన వెళ్లిపోయవ్, ఈ ఆకులు తీసుకోండి చెల్లౌతుంది.
ఆమె నిబద్ధత, ఆమె కచ్చితత్వమూ, అమె పలుకు ని రూఢి చేస్తున్నట్టు ఉన్న ఆమె స్వరానికి విస్మయం చెందాను.

మరో పక్క ఏడువేల కోట్ల రూపాయల అవకతవకల వార్త.

నిన్న రాత్రి ఆమె నిశ్చింత గా నిద్రబోయి ఉంటుంది, నిద్రకు ఉపక్రమించిన తరువాత ఈ ఉదంతం గుర్తు తెచ్చుకొని నిజాయితీ ఇంకా బతికే ఉంది అని నాకు నేను సర్ది చెప్పుకొని నేనూ నిద్రపోయాను, మరి ఆ రెండో వ్యాపారస్థుడు?

14 responses to “ఇద్దరు వ్యాపారస్థులు

 1. నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది మీ టపా…

 2. nice story . i rojullo kuda alanti varu unnarante ascharyame andaru ila unte mana desam nijaitiki nidarsanam ayutundi

 3. mmm. ok. nice writeup. But aren’t you overlooking your own negligence?

 4. yes, it seems like a case of overlooking. Nonethesless it shows that still there are poeple who stand by ethics.

  -Karthik

 5. చిలమకూరు విజయమోహన్

  మీ టపా చదివాక మొన్న నాకు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. 775రూ.లDD కోసం బ్యాంకుకెళ్ళికమీషన్తో సహా 805 రూ.లకు గానూ రెండు 500నోట్లు, 5రూ.ల చిల్లర కట్టి 200 రూ. మరచిపోయి తీసుకోకుండా అలాగే వెళ్ళిపోయాన తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ బ్యాంకుకెళ్ళి అడిగాను. అదీ క్యాషియర్ తెలిసినవాడని.సాయంత్రం డబ్బు తేలితే ఇవ్వండి అని అడిగా ప్రొద్దున రమ్మన్నాడు. మళ్ళీ వెళ్తే మిగిలింది అని 200 గాకుండా 100 రూ.లిచ్చాడు నేను కూడా మరచిపోవడం నా తప్పేనని దానితోనే సరిపెట్టుకున్నాను. నేనడమేమంటే నిజాయితీ అన్నది డబ్బులేని వ్యక్తుల దగ్గరే ఉంటుందేమోనని.

 6. నిజం చెప్పాలంటే… మద్య, దిగువ తరగుతుల వారిలోనే నిజాయితీ ఎక్కువుగా ఉంటుంది. (ofcourse.. అందుకనే వారు ఎప్పుడు ఆ తరగతులలోనే ఉంటారనుకోండి)

 7. ఆవిడ ఖచ్చితంగా అభినందనీయురాలు. వీలైతే మా అభినందనలు తెలియ చేయండి.

 8. చిలమకూరు విజయమోహన్ గారు చెప్పినట్లు నిజాయితీ అన్నది డబ్బులేని వ్యక్తుల దగ్గరే ఉంటుంది. ఆ తమలపాకుల వ్యాపారి ఎప్పాటికీ తమలపాకుల వ్యాపారి గానే ఉంటుంది. ఆ రెండో వ్యాపారస్తుడు ఇంకో రెండ్రోజుల్లో జైలు నుంచి బైటికి వచ్చి, ఓ రెండువేల కోట్లతో ఇంకో వ్యాపారం మొదలెట్టి మరో రెండువేలమందిని ఖచ్చితంగా ముంచుతాడు.

 9. ఒకచోట నిజాయితీ లేదంటే మరియొకచోట అది కచ్చితంగా చిన్నగానైనా కనబడుతుంది. ఇదిగో ఇలాగ. క్లుప్తంగా చక్కగా చెప్పారు, బావుంది.

 10. I too had a similar incident recently with a vegetable vendor near my house

  Regards,
  ~sUryuDu 🙂

 11. పది రూపాయిలు కాబట్టి ఇచ్చింది. వంద రూపాయిలైతే ఇచ్చేదా ? వెయ్యయితేనో… సరే కోటైతే లేదా ఏడు వేల కోట్లైతేనో..

  ఒకా సారి సత్యం బైఱ్ఱాజు రామలింగరాజు గారికి కోకాకోలా వాళ్ళు, ఇవిగోనండి, మీ సత్యం ప్రాజెక్టు నిమిత్తం మీకు ఇవ్వాల్సిన రెండు లక్షల డాలర్లు, అని డాలర్ల కట్లున్న సూట్ కేస్ అతని చేతిలో పెట్టగా, ఆయన అయ్యో మాకు మీరివ్వలసింది రెండు లక్షల డాలర్లు మాత్రమేనని జెప్పి. కాళీ చేసిన సూట్ కేస్ వారికి వెనక్కి ఇచ్చేసారఁట. అది కదా మనిషి ఔదార్యం. ఈ సంఘటనను నేను అట్లాంటాలోని కోకాకోలా ముఖ్య కేంద్రం ఎదురుఁగా గల పార్కులో నా కళ్ళతో నేను చూసాను.

  మీరు ఇద్దరు వ్యాపారవేత్తలు అని చెప్పి ఒకావిడ కథనే చెప్పారు, కానీ మీ మాటలు బట్టి ఆ రెండవతను వట్టి దగా కోరు అని తెలియవస్తుంది. అలాంటి దగాకోరు వ్యాపారవేత్తలకు మన రామలింగరాజు వంటి గొప్పవారిని తప్పక పరిచయం చేయాల్సివుంది.

  మీ
  రాకేశ్వర

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s