నేర్పవయ్య నాకు సర్పభూష!

సీసము(?):

శిరమున యొప్పుకాపురభారమొక్కటి

శిరమున సంసార భారమదొక్కటి
పరవళ్ల గంగయు- వరసకొడుకు*

తిరముగ ఒంటినంటి రమణి యొక్కతె
పార్వతీ దేవియు పసుపు కొడుకు

ఆమెకు ఈమెకు నేమందులేగాని
సకలలోకమనెడి సవతి పోరు

ఈతని కాతని కీశ! జెప్పగనేల,
సకలలోకమెరుగు చవితి పోరు

ఆటవెలది(?):

మౌని,స్థాణు, జడుడ, మాటవరసకైన
జోక్య మింత లేదు జోగి నీదు.
“నీరు-తామరాకు” నియతి వర్తింపగా
నేర్పవయ్య నాకు సర్పభూష!

19 responses to “నేర్పవయ్య నాకు సర్పభూష!

 1. మీకు,మీ కుటుంబానికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

 2. పద్యాల్లో కూడా పన్నులా సార్ !!

 3. వరసకొడుకు? చంద్రుడా? పక్కన * ఎందుకండీ? Conditions apply? 🙂

  “చవితి పోరు” … వహ్వా!!

 4. ఇంతవరుకూ నేను సవతిపోరే విన్నాను, చవితిపోరు గురించి వినడం ఇదే మొదలు, భలే!
  చాలాబావుంది పద్యం.

 5. అన్నట్టు, “సవతిపోరే విన్నాను” అనడంలో సవతిపోరు గురించే విన్నాను అని నా ఉద్దేశం, అన్యథా భావించకండి. అసలే మీరిలాటి విషయాల్లో “pun”డితులు 🙂

 6. ఊదము గారూ భేషూ
  పాదము తలనెట్టెగంగ పాముల బుసలే
  మోదన చెవిన తన సొంత
  రోదనె వినబడని ఈశ్వరుకింకో పోరా ?

 7. ఏఁవండోయ్ ఊకదంపుడుగారూ, నాకు ? * వంటి గుర్తులు ఎందుకొచ్చాయో తెలియలేదు.

  వరసకొడుకా? ఏ వరుసలోనండీ? శివుడి నెత్తి మీదుండే ఆకాశగంగకీ సముద్రంలో కలిసే భూలోకగంగకీ కొంచెం తేడా చూపించండి సార్. లేదంటే శివుడూ సముద్రుడూ… వామ్మో సపతులౌతారు!!!

  పసుపు కొడుకు… పసుపు వినాయకుడు. బావుంది ప్రయోగం 🙂

  ఆవిడకీ ఈవిడకే కాక, కొడుకులు అని చెప్పి వాళ్లకీ పోరు పెట్టడం మీకే చెల్లిందండీ!

  ఔనూ, శివుడు మీకు ఏం నేర్పాలీ?

  మీది పన్ను కాదు. పసుపు కొడుకుయొక్క విరిగిన దంతం 🙂

 8. కామేశ్వర రావు గారు,
  అన్యధా భావించడమే? “అక్షింతలు” గా స్వీకరిస్తాను.
  రాఘవ గారు,
  పోనీ ,భూలోక గంగమ్మ ఆకాశ గంగ కి చెల్లలనుకోండి, కాదూ “కజిన్ సిష్టర్” అనుకోండి,
  శివుడు సముద్రుడూ “కో-బ్రదర్స్” అనుకోండి.(కాసేపు)

 9. ఆత్రేయగారూ,
  రామకృష్ణా రావు గారు చెప్పినట్టు
  ఇంకెన్నాళ్లీ కందపు
  సంకెళ్లందే నడకలు? చక్కటి వృత్తాల్
  ఇంకా కొన్నుపజాతుల్
  కంకణ బద్ధులయి వ్రాయ కౌతూహలమున్

 10. ఆయన ఫణిరాజ హారుడైతే తమరు పన్ రాజ హారులు. సుసం”పన్”నం చేశారు!

 11. సలహా బాగుందండీ …
  పలహా రము చేసిన విధి పద్యము చెప్పన్‌
  అలవడినవారు తమరే
  అలవోకగ వృత్తములన అనుభవ మివరూ ?

  అందము గుందని పట్టిన
  కందము ఇచ్చిన దురదలు కనుమరు గయితే
  అందరు చెప్పిన విధముగ
  ముందడుగులు వేయగలను ముద్దుగ నేర్చీ

 12. ఆత్రేయ గారు::

  ఉ. వృత్తము నేర్వబోదునని వీనుల విందుగ చెప్పినారయా!
  త్తమ వస్తువుం గొనుడి ఱక నావలె యూకదంపకే 🙂
  చిత్తము నిల్పిరే, యతులు జెల్లును ప్రాసయు ఛందమున్,గనన్
  త్తమమౌనుదొల్తగను, త్పల మాలయొ మత్తకోకిలో .

  ఇది చూడండి:
  http://andam.blogspot.com/2007/07/blog-post_17.html

 13. దంపితిరుఉత్ప లంబున
  నింపితిరిగద విషయములు నింపాదిగనే
  పంపితిరి లంకె బిందెను
  వొంపెద నయ ధనము నింక వొడిలో నిండన్

 14. ఆదిలోనే హంసప్రాస. 🙂 భారాన్ని మార్చాల్సుంది.

 15. రాకేశ్వర్రావ్ గారూ
  నాకీ ప్రాసలెపుడయిన నానవు నోటిన్
  బాకీ ఉందుము తమరికి
  మాకీ ప్రాసేమిటన్న మాట తెలిపినన్

 16. రాకేశ్వర గారు,
  ప్రాస యతి చెల్లించాను అనుకున్నాను,కాదన్న మాట, ఇప్పుడు చూసి ఇంకా తప్పులుంటే చెప్పండి.

 17. పింగుబ్యాకు: నేర్పవయ్య నాకు సర్పభూష! – ౨ « ఊక దంపుడు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s