పద్మ నయనే పద్మ హస్తే

మీరు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చారు.

నాలుగు మెతుకులు తిని నిద్ర పోదామనుకున్నారు,

టీవీ  చూస్తే గానీ నిద్ర రాదు కాబట్టి యధాలాపంగా టీవీ  పెట్టారు.

తిప్పీ తిప్పీ ఓ చానల్ వద్ద ఆగారు…
23:45:15

అక్కడ ఓ అందాల భరిణె ఆడుతోంది, అమె అఖిలాభారతకోటి అభిమాన తార..
అప్పనంగా ఇచ్చేయెమంటే మీరు అమెకి అతిలోకసుందరి అని బిరుదిస్తారు..
అమె తెరపై ఆడుతోంది .. అందంగా
అమె తెరపై ఆడుతోంది ..పాత్రోచిత దుస్తుల్లో
అమె తెరపై ఆడుతోంది ..పాటోచిత స్టెప్పుల్లో
అమె తెరపై ఆడుతోంది ..సంగీతాసాహిత్యాలకి అనుగుణంగా
అమె తెరపై ఆడుతోంది .. ప్రతి అవయవాన్ని సమర్ధవంతంగా కదిలిస్తూ
అమె తెరపై ఆడుతోంది ..తన వయసువాడితోను, తన మామగారి వయసు వాడితోనూ..
అమె తెరపై ఆడుతోంది .. సెన్సారోచితంగా, సంసారా2నుచితంగా
23:45:45
అప్పుడు మీరేమి చేయ్యాలి?

….. అంటే  ……

“ఆహా, ఈయెమ, మాననీయురాలు, గౌరవనీయురాలు, ఇంకనూ  పద్మస్ఫురిత…
నేనున్నూ ఈమెను తగు రీతి గౌరవించవలెను,గాన నామనమ్మున ఎట్టి వికారములు కలగకుండుగాకా”

అని ఘాట్టిగా మూడుసార్లు అనుకొని ఠక్కున టీవీ  కట్టేయ్యాలి.

7 responses to “పద్మ నయనే పద్మ హస్తే

 1. అది మీకు సాధ్యమా?? ఐశ్వర్య ఎంతో మందికి సౌందర్యదేవత. ఇలా అనుకోవడమే తప్పు.

 2. ఆ పైన కాస్త నింబూపానీ సేవించి అర్థాకలితో మంచమెక్కాలి..

 3. అందాలభరిణె, అభిమానతార, అలితోకసుందరి, …
  పద్మస్ఫురిత! ఆ…హా.

  సెన్సారోచితంగా, సంసారాsనుచితంగా… హహ్హహ్హా

 4. పద్మ నయనే పద్మ హస్తే… సెన్సారోచితంగా అక్కడితో ఆపారు. సంతోషం 🙂
  అన్నట్టు అలా టీవీ కట్టేసిన వెంటనే నిదురకి ఉపక్రమించకండి. వారు మీ కలలందు సాక్షాత్కరించి మీకు కలవరమ్మును కలిగించే ప్రమాదమున్నది. కావున ఆంజనేయ దండకము పలుమార్లు జపించుట మరువకుడీ!

 5. ఆవిడ కంటే ఇంకా సౌందర్య దేవతలు భారతదేశం లో ఉన్నారు, వాళ్ళకి పరపతి గల అత్తమామలూ,అమర్సింగ్ ( ఆయన లేకుంటే గవర్నమెంట్ పడిపోయేది) లాంటి మిత్రులూ లేరు.

 6. ఓహ్ ఐశమ్మకి పద్మశ్రీ వచ్చిందా. మంచిది మంచిది.
  నాకు చాలా సంతోషంగా వుంది. ఎందరో బాలురకు తమ పురుషత్వాన్ని గుర్తుచేసిన ఈ మహా నారికి ఏమిచ్చినా తక్కువే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s