మాతా శత్రుః పితా వైరి గురుర్ రిపుః

హెచ్చరిక : ఈ టపాలో మీకు జుగుప్సాకరమూ, అభ్యంతరకరమూ ఐన అంశాలు ఉండవచ్చు. మీ విచక్షణను అనుసరించి చదవండి.

మాతా శత్రుః పితా వైరీ
యేన బాలో నపాఠితః
న శోభతే సభా మధ్యే
హంస మధ్యే బకో యధా

అని చెప్పుకోవలసిన రోజులు కావివి…
అంతెందుకు …
మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ…
అని అనవలసిన అవసరమేమైనా ఉన్నదా అని బడిపిల్లలు అలోచించుకోవల్సిన రోజులివి.

ఇంకా చెప్పాలాంటే…పిల్లలందరూ కాన్వెంటు చేరుకోగానే…

మాతా శత్రుః పితా వైరీ
యేన బాలో పాఠితః
గురుర్ రిపుః పురా మధ్యే;
వ్యాఘ్ర మధ్యే మృగో యధా

అని గొంతెత్తి పాడతారు… వాళ్లకి కాస్త స్వేచ్ఛ ఇస్తే ,
కొట్టే/దండించే గురువు/తండ్రి/తల్లి వెనక నుంచొని లేరని తెలిస్తే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలియకపోతే మీరు అదృష్ట వంతులు…

తెలుసుకోవాలనుకుంటే…::

డిల్లీ లో ఓ విధార్ధిని నిండు ప్రాణం పోయింది… తన గురువు వల్ల

మూడు నెలలక్రితం ఓ విద్యార్ధికి చావుతప్పి కన్ను పోయింది… తన గురువు వల్ల

pin

వీళ్లని చూసి .. “ఆచార్య దేవో భవ” అని అనమని ఎవరు చెబుతారు?…

ఎడ్మిషన్ కోసం వెళ్లండి … తీయతీయని మాటలు చెబుతారు…
కన్నది మీరా , వాళ్లా అని మీకే సందేహం వచ్చే రీతి లో ముద్దు చేస్తారు…

ఒక్కసారి ఆ బడి లో చేర్పించండి .. అప్పుడు అసలు రంగు బయట పడుతుంది…

సామాజిక ద్రోహం లో చాలా భాగం పాఠశాల యాజమాన్యాలదే ఐనా… తల్లిదండ్రులకు భాగం లేదా అని ప్రశ్నించుకోవాలి..

పై ఇద్దరు విద్యార్ధుల గురించి, వారి కుటుంబాల గురించి నేను మాట్లాడటం లేదు..

కాని… సమాజం లో గత రెండు, రెండున్నర దశాబ్దాలలో… తల్లిదండ్రుల ప్రవర్తనలలోనూ,పిల్లల పెంపకం లోను వచ్చిన మార్పులు…
బేరీజు వేసుకోవలసిన సమయం ఇది.

మా అబ్బాయే స్కూల్ ఫష్ట్ రావాలి…మా అబ్బాయికి స్టేట్ రాంక్ రావాలి…(నేను మటుకు హోమ్వర్క్ చేశావా అని కూడా అడగను.. అన్నం తిన్నావా అని అడగను.. నా సమస్యలూ నా చికాకులు నావి….)

అన్న ఆశ ఒకవైపు… Flase Prestige అనే దిగజారుడుతనం మరో వైపు.. తల్లిదండ్రులని అల్లకల్లోలం చేసి…
హాస్టళ్లు.. స్టడీ అవర్స్.. ఇంటెన్సివ్ కోచింగ్, స్పెషల్ కేర్.. గాడిదగుడ్డు… అనే విష సంస్కృతిని
విద్యాసం సంస్థలపేరిట .. పాతుకుపోనిచ్చాయి…

తల్లి, తండ్రులని అంటున్నాని మీరు కోప్పడవచ్చు…
కానీ … వాళ్ల తీరుని మీరు ఓ సారి ప్రశ్నించుకోండి…

“నాకు ఆఫీస్ పని హెవీ గా ఉంటుందండీ..”
“ఫలానీ స్కూల్ లో ఐతే వాల్లే “శ్రద్ధ” తో చదివిస్తారండి.. ఇక మనం పట్టించుకోనవసరం లేదు”…
“ఆ స్కూల్లో admission వచ్చిందంటే… ఇక పిల్లాడికి తిరుగులేదను కోండి.. వాళ్లే రుబ్బుచ్చి రాటు దేలుస్తారు”

తండ్రి(తల్లి) – ఎడ్మిషన్ సంపాయించటం, ఎడ్మిషన్ కోసం డబ్బులు సంపాయించటమే తమ పని అనుకుంటే
తల్లి ( తండ్రి) – పొద్దున్నే కాంప్లాను, బాక్సులో రొట్టెలు, సాయంత్రం బూస్టూ, రాత్రి తిండీ, పండే తమ పని అను కుంటేను…
గురువులు తమపని తమరు చేసుకొరూ?

ఇక పిల్లల సంగతి ఏమిటి?

తల్లి తండ్రికి – స్టేటుకు తగ్గకుండా, వీలైతే దేశలెవల్లోనూ ర్యాంకు మీ పిల్లవాడికి సంపాదిస్తామని .. మాటిచ్చి డబ్బు తీసుకున్నావారు..
వాడు చదవకపొతేనో, తల నొప్పిగా ఉండి ఓ పూటా క్లాసు వినకపోతే నో ఊరుకుంటారా? చంపేయరూ?…

ఉత్తీర్ణత, విజయమూ, ర్యాంకూ, మా విద్యాసంస్థకు ఇన్ని ర్యాంకులూ అనే దోరణి ఒక కారణమైతే…
ఇంక పెద్ద కారణం .. సమాజపు, ప్రభుత్వపు వైఫల్యం…

పెరిగిన జనాభాకి అనుగుణం గా బడులు పెరగ లేదు…
అన్ని బడులు పెట్టి నిర్వహించే స్థోమత ప్రభుత్వానికి లేదు…

తగిన చదువు, అంతకు మించి తగిన మూర్తిమత్వమూ కలిగిన ఉపాధ్యాయులనూ, డబ్బు వెచ్చించి నియమించుకోవలసిన అవసరం ప్రైవేటు విద్యా సంస్థలకు అసలు లేదు..

పర్యవసానం…
మూత బడుతున్న సర్కారీ బడులు

ప్రత్యేకమైన వృత్తి పరమైన శిక్షణ లేకుండా…
పదవ తరగతి పాసైతే .. “A” “B” “C” “D” లు చెప్పగలిగితే… LKG కి “Miss”..
ఇంటరు పాసై.. రైమ్స్ చెబితే .. UKG కి “Miss”…
మీరు తల్లి/తండ్రి/మిస్/ఉపాద్యాయిని/ఉపాద్యాయుడు ఐతే దయచేసి … సహనం కొల్పోకండి…
కొన్ని నిజాలూ పరిశీలించండి…

ఈ నాగరిక ప్రపంచంలో, హైదరాబాదు నగరంలో …
మీరు పిలవ దలుచు కూంటే .. టీచరుగా పిలుచుకోగలిగిన వృత్తిలో ఉన్న ఓ స్త్రీ…
ఓ చిన్న పిల్ల క్లాసు లో మూత్ర విసర్జన చేసిందనీ, క్లాసు లో అందరి ముందూ ఆ విద్యార్ధిని చేత మూత్రం తాగించింది…
ఇది యాభై ఏళ్ల క్రితం జరుగలేదు, అప్పుడు భారతదేశం అంత ఎదగలేదు. ఇది ౦8-౦9 విద్యాసంవత్సరం లొ జరిగింది.

హైదరాబాడు లోనే, ఓ బడి లో పిల్లవాడిని కొడితే, ఆ పిల్ల వాడికి చెయ్యి స్పర్శ పోయి.. ఆసుపత్రి పాలయ్యాడు…

ఈ పైశాచిక గురు ప్రవృత్తిని ఏ వంక చెప్పి సమర్ధిస్తారు?

ప్రవేశాలప్పుడు అడగండి…
‘అబ్బే మా స్కుల్లో అసలు కొట్టమండీ ” అంటారు…
మొదటి త్రైమాసికం అవ్వగానే అడగండి…
“మీ పిల్ల అసలు గొడవ చేయదండీ, కొట్టే సమస్య రాదు అంటారు”…
ఇంకో ఆర్నెల్లు ఆగి అడగండి, అబ్బే ఎదో స్కేల్తో ఇట్టా అంటాం అంతే అంటారు.
గత సంవత్సరం ఓ స్కూల్లో నా కుమారుడి సీటుకోసమై వెల్తే…
ఆ ప్రినిసిపాలుడూ..
“సార్ ఇక్కడ ఉన్న ౪౦౦ మంది పిల్లలనీ నేను నా సొంత పిల్లల్లా చుసుకుంటానండీ” అంటు మొదలు పెట్టాడు…
ఓ పది నిముషాలు ఊకదంచాడో లేడొ..
“UKG లొ ఓ పిల్లాడు ఉన్నాడండీ, టీచరు బోర్డ్ వైపుకు తిరిగి మళ్ల వెనక్కి తిరిగే లోపు టీచర్నే మాయం చేయగలడు” అన్నాడు…

ఆయన విఙ్ఞత ని అంచనా వేశే పెద్దపని మీకే వదిలి పెడుతున్నాను…

ఈ సమస్యకు గురుద్రోహం ( అనగా గురువులు చేశే ద్రోహం) ఎంత కారణమో – తల్లిదండ్రుల ఉదాసీనతా అంతే కారణం..
( ప్రభుత్వం సంగతి చెప్పనవసరం లేదనుకుంటా)..

దయచేసి.. మా బడి/ మా పిల్లలు చదివే బడి/ ఆ కాన్వెంటు / ఈ ఇన్స్టిట్యూట్ ఇట్టాంటివి కాదు అని చెప్పకండి..
మీరు చెప్పేది నిజమే ఐతే సంతోషమే కానీ, నేను నమ్మటానికి సిద్ధం గాలేను…
కాదు నమ్మే పరిస్థితి లో లేను…

మెరుగైన సమాజం కోసం, చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవటం కోసం, హాయిగా బ్రతకటం కోసం, కనీసం బ్రతకటం కోసం ..
మీ వంతు చేయగలిగినది ఏమైనా ఉంటే చేయండి, దయతో.

నేను అందరు తల్లులూ, తండ్రులూ, ఉపాధ్యాయులూ ఇలానే ఉన్నారంటంలేదు….
మీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడండీ ఎందరు ఇలా ఉన్నారో మీకే తెలుస్తుంది.
ఐతే,
ఇలాంటి స్వభావం ఉన్న గురువు ఒక్కరున్నా గర్హించాల్సిందే,ఆ బాధ్యత నుంచీ శాశ్వతంగా తొలగించాల్సిందే
పిల్లల్నీ దండించే, శారీరకంగా మానసికంగా హింసించే కాన్వెంట్ ఒక్కటున్నా గమనించాల్సిందే, శాశ్వతంగా మూయించాల్సిందే.

———————————————-

పై వార్త ఈనాడు దినపత్రిక నుండి సంగ్రహించబడినది. 

7 responses to “మాతా శత్రుః పితా వైరి గురుర్ రిపుః

 1. మీరు మరీ మొహమాట పడుతున్నట్లున్నారు. సహనం అన్న అతి ముఖ్యమైన అర్హత లేకుండా ఉపాధ్యాయవృత్తిలోకి దూకే ఇలాంటి మూర్ఖులకి సస్పెన్షన్లు ఏ మూలకి? నేరుగా పైకి పంపితే నరకానికెళ్తూ, తమ చేతిలో స్వర్గస్తులైన శిష్యుల్ని చూసైనా మరో జన్మలోనైనా బుద్ధి తెచ్చుకుంటారేమో.

 2. చాలా బాగావ్రాసారు.ప్రస్తుతం పరిస్థితులు చూస్తూంటే ” ఇదా పురోగమనం ” అనిపిస్తోంది.

 3. పొద్దున్న వార్తాపత్రికలో ఈ వార్త చదివి నిర్ఘాంతపోయాను. ఐనా మనిషి మారఁబోదూ ఆతని తీరు మారఁబోదు.

  అన్నట్టు పాఠశాలలు విద్యా వ్యవస్థ గుఱించి ఆదిలక్ష్మిగారి టపా చూసారా?
  http://ammaodi.blogspot.com/2009/04/71.html

 4. పట్టభద్రురాలైన మహిళ తన సంతానాన్నికూడా పట్టభద్రులను చేయగలదు అని రాజగోపాలచారి గారు అభిప్రాయపడ్డారు. చూడబోతే ఆయన అభిప్రాయం తప్పనిపిస్తోంది. పట్టభద్రులనుచేయటం అలా వుంచి కనీసం L.K.G. కి కూడా convents మీద ఆధారపడాల్సిన పరిస్థితికి కారణం ఎవ్వరు? (ఇక్కడ నా వుద్దేశ్యం “తల్లులెవరూ వుద్యోగాల్లో పాలుపంచుకోకూడదు” అని కాదు గమనించగలరు).

  చిన్నపిల్లలకు బోధించడానికి కావలసిన విద్యాసంబంధిత అర్హతలున్నాయి సరే బోధన పధ్ధతుల పై అవగాహన వుండక్కరలేదా? అసలు బోధించడానికి కావాల్సిన ఇతరత్రా అర్హతలు అఖ్ఖర్లేదా (సహనం, వ్యక్తిత్వం ఇలాంటి లక్షణాలు)? వాళ్ళ నడత, నడవడిక గురించి కొండొకచో కౌటుంబిక పరిస్థితుల గురించి విచారించాల్సిన అవసరంలేదా? క్రికెట్ జట్టులో కూడా psycologist అవసరమని భావించే మనం మరి ఈ చిన్నపిల్ల convents లో మాత్రం ఆ అవసరం లేదని ఎందుకు అనుకోవాలి?

  ఇంత చిత్రహింసలు పెట్టీ, వారి బాల్యాన్ని వారి నుండి లాక్కుని మనం వాళ్ళకు ఒరగబెడుతున్నదేమిటి? మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించలేని, విలువలు నేర్పలేని (అసలవసరమేలేని) వెధవ చదువులు కాదా?

 5. >>”మెరుగైన సమాజం కోసం, చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవటం కోసం, హాయిగా బ్రతకటం కోసం, కనీసం బ్రతకటం కోసం .. మీ వంతు చేయగలిగినది ఏమైనా ఉంటే చేయండి, దయతో”.

  క్రింది టపాను చదవండి. పైసా ఖర్చులేని కనీసం ఇటువంటి పనినైనా చేద్దాం.

  http://nagaprasadv.blogspot.com/2009/01/blog-post_16.html

 6. అందుకే నేను భూటాను వలస వెళుతున్నాను. అక్కడ ఇంటర్నెట్టూ వుండదూ, జీలకఱ్ఱా వుండదు.

 7. రాకేశా,
  కొట్టే టీచర్లు కూడా ఉండరా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s